Skip to main content

టీఆర్ఎస్ గొంతుకలై గర్జించే శ్రవణ్, కర్నె ప్రభాకర్‌లకు కేసీఆర్ మొండిచెయ్యి



తెలంగాణ రాష్ట్రసమితి వాదాన్ని వివిధ వేదికలపై, టీవీ చర్చా కార్యక్రమాలలో బలంగా వినిపించే వారిలో డాక్టర్ దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్ ముందుంటారు(ఇంతకుముందు రఘునందన్‌రావుకూడా ఈ జాబితాలో ఉండేవారు. అయితే ఆయన గత ఏడాది మే నెలలో పార్టీనుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు). పార్టీ అధికార ప్రతినిధులు మరెందరో ఉన్నా, ప్రత్యర్ధి పార్టీల నాయకుల విమర్శలను, వాదనలను తిప్పికొట్టడంలో వీరిద్దరిదే పైచేయిగా ఉంటుంది. అయితే పార్టీకోసం ఇంత గొంతుచించుకుని అరిచిన వీరిద్దరికీ పార్టీ అధినేత మొండిచెయ్యే చూపారు.

శ్రవణ్ గతంలో ప్రజారాజ్యంలో చురుకైన పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా మెలుగుతూ ఆయన సిఫార్సుద్వారా సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ సాధించి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీనుంచి డాక్టరేట్ పొందిన శ్రవణ్, మంచి ఆలోచనాపరుడు, వక్త కావటంతో తక్కువ సమయంలోనే టీఆర్ఎస్‌లో పొలిట్‌బ్యూరోలో స్థానం సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో భువనగిరి, ముషీరాబాద్‌లలో ఏదో ఒకస్థానంలో పోటీచేయాలని ప్రయత్నించారుగానీ  టికెట్‌ దక్కలేదు.

ఇక పార్టీ కార్యక్రమాల అమలుకమిటీ ఛైర్మన్ కర్నె ప్రభాకర్ మొదటినుంచీ కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్నారు. నల్గొండజిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి టికెట్‌కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఆయనకు నిరాశే మిగిలింది. కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి ఆ టికెట్‌ను కేటాయించారు.

పొద్దున లేచినదగ్గరనుంచీ పార్టీకి మద్దతుగా వాదిస్తూ, పార్టీని, నాయకులను భుజానకెత్తుకుని ప్రత్యర్ధులపై ఒంటిమీద దూసుకెళ్ళే వీరు, టికెట్‌లు దక్కకపోవటంవలన ఎంత నిరాశకు గురై ఉంటారో తేలిగ్గా ఊహించుకోవచ్చు. మరోవైపు, పార్టీ టికెట్‌లు ఆశించి భంగపడ్డవారిని విడివిడిగా పక్కకు పిలిచి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదట ఎమ్మెల్సీ ఇచ్చేది నీకేనంటూ ఆశలు కల్పించి మైమరిపిస్తున్నారట మాటల మరాఠీ.

                                                                -------


Looking for Content Writers for Telugu web audience?

కంటెంట్ రైటింగ్ సేవలు కావలసినవారు సంప్రదించగలరు 

tejasswi11@gmail.com


image courtesy: tv9

Comments

  1. వీరిద్దరికే కాదు నాయని నరసింహారెడ్డి లాంటి సీనియర్ నాయకుడికి కూడా మొండిచేయే మిగిలింది.

    ReplyDelete
    Replies
    1. పార్టీ వాయిస్‌గా ఉండీ టికెట్ దక్కించుకోలేకపోయినవాళ్ళగురించి నేను లైన్ తీసుకున్నాను.

      Delete
    2. కరేక్తేనండీ. అందుకే రఘునందన్ & చెరుకు సుధాకర్ పార్టీ వదిలేశారేమో?

      Delete
    3. గర్జన లిక అవసరం లేదు కదా. గర్జించే వాళ్లతో యెప్పటికయినా ప్రమాదమే, యేక చత్ర అధికారానికి కావలసింది విధేయులే!

      Delete
    4. గురూ తెలబానిస్తాన్లో ఎవరు ఎలా సంక నాకిపోతే నీకెందుకు?

      Delete
    5. యేదో ఒక చిన్న మాట మాట్లాడ్డం కూడా తప్పేనా? ఆంధ్రాలో ఉన్న ఒక కమ్యునిష్టు మేధావి అంతర్జాతీయ విషయాల గురించి కూడా తన అభిప్రాయాల్ని వెల్లడించుతున్నప్పుడు మీరు నన్నెందుకు వ్యతిరేకిస్తున్నారు?విడిపోయి కలిసుందాం అంటున్నవాళ్ళు ఈ చిన్న మాటకే ఇంతగా నీ ప్రాంతం నా ప్రాంతం అంటున్నారేమిటో? నేనెప్పుడూ మిమ్మ్మల్ని అలా(తెలబానిస్థాన్ అని) అనుకోలేదు.

      Delete
  2. FYI శ్రవణ్ కాంగ్రెసులో చేరారు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

చంద్ర‌బాబు, రామోజీరావు జీర్ణించుకోలేని పరిణామం

అవును నిన్నటి సీఎమ్ మార్పు వ్య‌వ‌హారం వాళ్ళిద్ద‌రికీ అస్స‌లు మింగుడుప‌డ‌ని ప‌రిణామమని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ త‌ర్వాత‌...వాళ్ళిద్ద‌రూ కాంగ్రెస్‌లో  తీవ్రంగా ద్వేషించే వ్య‌క్తి కిర‌ణ్ కుమార్‌రెడ్డి. అటువంటి వ్య‌క్తి ఇవాళ సీఎమ్ అవుతున్నాడంటే వాళ్ళిద్ద‌రికీ నిన్న‌రాత్రి నిద్రకూడా పట్టిఉండదు. అస‌లు వీళ్ళిద్ద‌రికీ - కిర‌ణ్‌కూ గొడ‌వేమిట‌నుకుంటున్నారా...! కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఒక ఏగ్రెసివ్ కాంగ్రెస్ నాయ‌కుడు. 2004లో అధికారంలోకి రాక‌మునుపు, వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలుగుదేశంమీద ఎటాక్‌ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో గ‌ట్టివ్య‌క్తి ఎవ‌ర‌ని చూస్తే... కిర‌ణ్‌కుమార్ రెడ్డే ముందుండేవారు. గాంధీభ‌వ‌న్‌లో, సీఎల్పీలో జ‌రిగే ప్రెస్‌మీట్‌ల‌లో ఆయ‌న విమ‌ర్శ‌లు ధాటిగా ఉండేవి. "చంద్ర‌బాబునాయుడూ... ఇదేమిటి, అదేమిటి..." అంటూ ఏక‌వ‌చ‌న సంబోధ‌న‌తోనే కొట్టిన‌ట్లు మాట్లాడేవారు. అసెంబ్లీలో కూడా కిర‌ణ్‌ టీడీపీని బాగా ఎదుర్కొనేవారు. దీంతో చంద్రబాబునాయుడు కిరణ్‌కుమార్ ఉనికిని కూడా సహించలేకపోయేవారు.  దరిమిలా 2004తర్వాత కిరణ్ వైఎస్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అసెంబ్లీలో ప్రతిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు కిర‌ణ్ స్పంద‌న‌ను ప్ర‌