Skip to main content

Posts

Showing posts from August, 2021

ఈ 'బుల్లెట్టు బండి...' పాట ఎందుకింత సంచలనం అయింది?

'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా...' పాట సోషల్ మీడియాలో సృష్టిస్తున్న సంచలనం వెనక ఒక ప్రత్యేకత ఉంది. ఆ కొత్త పెళ్ళికూతురు ఏ పాటకయితే డాన్స్ చేసిందో ఆ పాటలోని వాక్యాలు ఆమె పాలిట నిజమై కూర్చున్నాయి. ఆ పాటలోని వాక్యాలలో అక్షరాలలో యథాతధంగా రాసి ఉన్నట్లే తన భర్తకు, మెట్టినింటివారికి ఆ అమ్మాయి ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ తీసుకొచ్చింది. ఆ నవవధువు సాయిశ్రియకు పెళ్ళిపట్ల, తన కాబోయే భర్తపట్ల ఆపేక్ష, ఆశలు, నమ్మకం ఎంత బలంగా ఉన్నాయోగానీ, ఆ ప్రకృతి(లా ఆఫ్ ఎట్రాక్షన్‌లో చెప్పే యూనివర్స్) విని తథాస్తు అనినట్లుంది. రాత్రికి రాత్రి ఇన్‌స్టంట్‌గా తాను సెలబ్రిటీ అవ్వటమే కాదు తన భర్తకు, మెట్టినింటివారికి, పుట్టింటివారికి కూడా కనీవినీ ఎరగని గుర్తింపు తీసుకొచ్చింది... పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కొనాలనుకునేవారికి పండగే: అటు 'ఓలా', ఇటు 'ఒన్'!

  ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కొనాలనుకునేవారికి ఇది శుభవార్తే! నిన్న జెండా పండగనాడు ఒకేరోజు రెండు వేర్వేరు కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను లాంచ్ చేశాయి. ప్రముఖ క్యాబ్ యాగ్రిగేటర్ కంపెనీ 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్‌ల రంగంలో ప్రవేశించి తయారుచేసిన స్కూటర్‌ను ఆ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ నిన్న మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేయగా, బెంగళూరుకు చెందిన 'సింపుల్ ఎనర్జీ' అనే స్టార్ట్ అప్ సంస్థ ప్రపంచంలోనే మరెక్కడా లేనటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌తో 'ఒన్' అనే స్కూటర్‌ను నిన్న సాయంత్రం 5 గంటలకు విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్‌లు రెండూకూడా ధరలోనూ, టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోనూ పోటీపడుతుండటం విశేషం. వీళ్ళ పోటీ పుణ్యమా అని ఎలక్ట్రిక్ స్కూటర్‌ల విషయంలో మార్కెట్ బయ్యర్స్‌కు అనుకూలంగా మారటంతో అంతిమంగా వినియోగదారులు/కొనుగోలుదారులు లాభపడనున్నారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.