Thursday, April 10, 2014

టీఆర్ఎస్ గొంతుకలై గర్జించే శ్రవణ్, కర్నె ప్రభాకర్‌లకు కేసీఆర్ మొండిచెయ్యితెలంగాణ రాష్ట్రసమితి వాదాన్ని వివిధ వేదికలపై, టీవీ చర్చా కార్యక్రమాలలో బలంగా వినిపించే వారిలో డాక్టర్ దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్ ముందుంటారు(ఇంతకుముందు రఘునందన్‌రావుకూడా ఈ జాబితాలో ఉండేవారు. అయితే ఆయన గత ఏడాది మే నెలలో పార్టీనుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు). పార్టీ అధికార ప్రతినిధులు మరెందరో ఉన్నా, ప్రత్యర్ధి పార్టీల నాయకుల విమర్శలను, వాదనలను తిప్పికొట్టడంలో వీరిద్దరిదే పైచేయిగా ఉంటుంది. అయితే పార్టీకోసం ఇంత గొంతుచించుకుని అరిచిన వీరిద్దరికీ పార్టీ అధినేత మొండిచెయ్యే చూపారు.

శ్రవణ్ గతంలో ప్రజారాజ్యంలో చురుకైన పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా మెలుగుతూ ఆయన సిఫార్సుద్వారా సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ సాధించి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీనుంచి డాక్టరేట్ పొందిన శ్రవణ్, మంచి ఆలోచనాపరుడు, వక్త కావటంతో తక్కువ సమయంలోనే టీఆర్ఎస్‌లో పొలిట్‌బ్యూరోలో స్థానం సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో భువనగిరి, ముషీరాబాద్‌లలో ఏదో ఒకస్థానంలో పోటీచేయాలని ప్రయత్నించారుగానీ  టికెట్‌ దక్కలేదు.

ఇక పార్టీ కార్యక్రమాల అమలుకమిటీ ఛైర్మన్ కర్నె ప్రభాకర్ మొదటినుంచీ కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్నారు. నల్గొండజిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి టికెట్‌కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఆయనకు నిరాశే మిగిలింది. కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి ఆ టికెట్‌ను కేటాయించారు.

పొద్దున లేచినదగ్గరనుంచీ పార్టీకి మద్దతుగా వాదిస్తూ, పార్టీని, నాయకులను భుజానకెత్తుకుని ప్రత్యర్ధులపై ఒంటిమీద దూసుకెళ్ళే వీరు, టికెట్‌లు దక్కకపోవటంవలన ఎంత నిరాశకు గురై ఉంటారో తేలిగ్గా ఊహించుకోవచ్చు. మరోవైపు, పార్టీ టికెట్‌లు ఆశించి భంగపడ్డవారిని విడివిడిగా పక్కకు పిలిచి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదట ఎమ్మెల్సీ ఇచ్చేది నీకేనంటూ ఆశలు కల్పించి మైమరిపిస్తున్నారట మాటల మరాఠీ.

                                                                -------


Looking for Content Writers for Telugu web audience?

కంటెంట్ రైటింగ్ సేవలు కావలసినవారు సంప్రదించగలరు 

tejasswi11@gmail.com


image courtesy: tv9

7 comments:

 1. వీరిద్దరికే కాదు నాయని నరసింహారెడ్డి లాంటి సీనియర్ నాయకుడికి కూడా మొండిచేయే మిగిలింది.

  ReplyDelete
  Replies
  1. పార్టీ వాయిస్‌గా ఉండీ టికెట్ దక్కించుకోలేకపోయినవాళ్ళగురించి నేను లైన్ తీసుకున్నాను.

   Delete
  2. కరేక్తేనండీ. అందుకే రఘునందన్ & చెరుకు సుధాకర్ పార్టీ వదిలేశారేమో?

   Delete
  3. గర్జన లిక అవసరం లేదు కదా. గర్జించే వాళ్లతో యెప్పటికయినా ప్రమాదమే, యేక చత్ర అధికారానికి కావలసింది విధేయులే!

   Delete
  4. గురూ తెలబానిస్తాన్లో ఎవరు ఎలా సంక నాకిపోతే నీకెందుకు?

   Delete
  5. యేదో ఒక చిన్న మాట మాట్లాడ్డం కూడా తప్పేనా? ఆంధ్రాలో ఉన్న ఒక కమ్యునిష్టు మేధావి అంతర్జాతీయ విషయాల గురించి కూడా తన అభిప్రాయాల్ని వెల్లడించుతున్నప్పుడు మీరు నన్నెందుకు వ్యతిరేకిస్తున్నారు?విడిపోయి కలిసుందాం అంటున్నవాళ్ళు ఈ చిన్న మాటకే ఇంతగా నీ ప్రాంతం నా ప్రాంతం అంటున్నారేమిటో? నేనెప్పుడూ మిమ్మ్మల్ని అలా(తెలబానిస్థాన్ అని) అనుకోలేదు.

   Delete
 2. FYI శ్రవణ్ కాంగ్రెసులో చేరారు

  ReplyDelete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts