Tuesday, December 11, 2018

ఇది కఠోర వాస్తవం: టీఆర్ఎస్‌ను గెలిపించింది చంద్రబాబే!

ఈ ఎన్నికల్లో విజయానికి కేసీఆర్ మొట్టమొదట కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు. ఎందుకంటే, ఆఖరినిమిషంలో చంద్రబాబునాయుడు హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలలో చేసిన ప్రచారం టీఆర్ఎస్ కు అనూహ్యరీతిలో కలిసొచ్చింది. చంద్ర బాబు పర్యటనల తర్వాత తెలంగాణలో మూడ్ ఒక్కసారిగా మారిపోయి టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓట్ల పోలరైజేషన్ జరిగింది.Click here to Read the Full Story.

Thursday, December 6, 2018

కరెంట్ పై కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే! ఇదీ నిజం!

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం అంటూ సాధిస్తే అది కేవలం రెండు కారణాల వలనే అని చెప్పుకోవాలి. అది ఒకటి - విచ్చలవిడిగా నిధులు విరజిమ్మి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. రెండు - నిరంతర విద్యుత్ సరఫరా. అందుకే కేసీఆర్ ప్రతి ఎన్నికల ప్రచారసభలోనూ ఈ రెండింటి గురించి ఊదరగొడుతుంటారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా గురించి అయితే ఆయన మాటలకు అడ్డూ ఆపు ఉండదు. Click Here to Read the Full Story

Tuesday, December 4, 2018

ఆ మూడు వర్గాలే కేసీఆర్ కొంప ముంచబోతున్నాయి!

పెన్షన్లు - కరెంట్ అనే రెండు అంశాలే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రధాన అస్త్రాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇవి తీసుకొచ్చే ఓట్లను తలదన్నేలా మూడు వర్గాల ఓట్లు టీఆర్ఎస్ కు దెబ్బ కొట్టబోతున్నాయి. నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు అనే ఈ మూడు వర్గాలు టీఆర్ఎస్ పేరు చెబితేనే భగ్గుమంటూ మండిపడుతున్నాయి. Click Here to read the Full Story

Friday, September 28, 2018

బిగ్‌బాస్‌షోలో యాంటీ క్లైమాక్స్! జనం ఛీకొట్టటం ఖాయం!బిగ్ బాస్ రెండో సీజన్ మొదలైనప్పుడు కొద్ది రోజులపాటు నానిని జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చి పెదవి విరిచారు చాలామంది. నానికూడా తొలినాళ్ళలో కొద్దిగా బెరుకుగానే కనిపించాడు. తన సహజమైన ఆత్మవిశ్వాసం కనిపించలేదు. కానీ మెల్లగా పుంజుకున్నాడు. వారం ముగియగానే వీకెండ్ లో వచ్చి, ఆ వారమంతా హౌస్ లో జరిగిన సంఘటనలను విశ్లేషించటంలో, సభ్యులు వ్యక్తిగత పనితీరు, ప్రవర్తనను అంచనా వేయటంలో మంచి పరిణతి ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అక్కడనుంచి అతను ఎక్కడా తడబడలేదు. బ్రహ్మాండంగా షోను నడిపించారు. తప్పులు చేసిన ఇంటి సభ్యులను గట్టిగా మందలించారు. సలహాలు, సూచనలు చక్కగా ఇచ్చాడు.Click Here to Read the Full Story...

Tuesday, April 24, 2018

పవన్ తల్లి ఎపిసోడ్‌లో అల్లు అరవింద్ సెన్సేషనల్ స్కెచ్!

పవన్ తల్లిపై అమర్యాదకర వ్యాఖ్యలు చేయించింది రాంగోపాల్ వర్మే. దానిలో సందేహమేమీ లేదు. అయితే పవన్ మొన్నటినుంచి శివాలెత్తిపోయి, ఆ నాలుగు మీడియా సంస్థలపై చిందులు తొక్కటం వెనక ఉన్నది మాత్రం ఆయన బంధువు, అగ్రనిర్మాత అల్లు అరవింద్. పవన్ ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి వెళ్ళి ఆగ్రహావేశాలు ప్రదర్శించిన ముందు రోజు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలే పవన్ ను రెచ్చిపోయేటట్లు చేశాయి. అదెలాగో చూడండి. Click Here to Read Full Article.

Sunday, March 25, 2018

ఏపీలో పీక్స్‌కు చేరిన కులపిచ్చి: కమ్మ, రెడ్డి వర్గాల్లో తీవ్ర అసహనం!

చంద్రబాబునాయుడిని ఎవరైనా విమర్శిస్తే కమ్మవారు భగ్గుమని మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తప్పుబడితే రెడ్లు నిప్పులు చెరుగుతున్నారు. ఆ మధ్య 'అసహనం' అనే మాట దేశాన్ని పట్టికుదిపేసిన సంగతి తెలిసిందే. ముస్లిమ్, దళిత వర్గాలపై సంఘ్ పరివార్ హిందుత్వ శక్తులు దాడులకు పాల్పడటాన్ని మత అసహనంగా విపక్షాలు, ప్రజాసంఘాలు అభివర్ణించాయి. ఇప్పుడు ఏపీలో అలాంటిదే ఒక అసహనం చోటుచేసుకుంటోంది... కమ్మ, రెడ్డి సామాజికవర్గాలలో. వారి వారి కులాలకు చెందిన పార్టీలపై, తమ కుల అధినేతలపై ఎవరైనా విమర్శలు చేస్తే లేశమైనా తాళలేకపోతున్నారు... విమర్శకులను దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రెండువర్గాలలో నూటికి 95శాతం మంది ఇలాగే మాట్లాడుతున్నారు... వ్యవహరిస్తున్నారు. పరస్పర భౌతికదాడులైతే జరగటంలేదుగానీ కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఈ రెండువర్గాల మధ్య పానిపట్టుయుద్ధం, తళ్ళికోటయుద్ధం స్థాయిలో పరస్పరదాడులు జరుగుతున్నాయి. తీవ్రఅసహనంతో రగిలిపోతున్న ఈ రెండు సామాజికవర్గాల వైఖరిని ఒకసారి పరిశీలిద్దాం.To Read the Full Story, Click Here.

Monday, March 12, 2018

చంద్రబాబునాయుడు 4 ఏళ్ళ పాలనలోని 10 తీవ్ర తప్పిదాలు!

చంద్రబాబు 1995లో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవటంలోగానీ, 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ తో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించటంలోగానీ, 1999లో ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని తిరిగి అధికారంలోకి రావటంలోగానీ - ప్రదర్శించిన రాజకీయ చతురత, వ్యవహారదక్షత అందరికీ తెలిసిందే. మరి నాటి ఆ సామర్థ్యం, దూకుడు ఏమయ్యాయోగానీ 2014లో అధికారంలోకి వచ్చిననాటినుంచి పరిశీలిస్తే, ఆయన వ్యవహారశైలి, తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగానూ, అవకతవకలుగానూ ఉంటున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన 'ఓటుకు నోటు కేసు' అనే ఒక్క తప్పిదం(blunder) తాలూకు మూల్యాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం భరించాల్సివస్తోంది. ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పిన ఆ బాబు ఇప్పుడు ఈ కేసు కారణంగా మోడి ముందు మోకరిల్లుతున్నారు. తద్వారా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోగానీ, ప్యాకేజి విషయంలోగానీ కేంద్రంనుంచి చట్టం ప్రకారం రావాల్సినవాటిని డిమాండ్ చేసే హక్కును(bargaining capacity)ని కూడా కోల్పోవటం ఏపీ ప్రజలపాలిట దురదృష్టంగా మారింది. మరోవైపు ఈ కేసుకారణంగా చంద్రబాబు ఏపీ ప్రజలతోబాటు అటు తెలంగాణలో సొంత పార్టీ శ్రేణులకు కూడా తీవ్రమైన అన్యాయం చేశారని చెప్పాలి.To Read the Full Story, CLICK HERE.

Monday, February 5, 2018

వీరమాచనేనిపై విరుచుకుపడుతున్న డాక్టర్‌లు: ఇంతకీ ఎవరు కరెక్ట్ ?

కొద్దిరోజులుగా తెలుగురాష్ట్రాలను కుదిపేస్తున్న వీరమాచనేని డైట్ ప్లాన్ మీద తెలుగు మీడియాలో మొట్టమొదటిసారిగా ఏషియానెట్ వెబ్ సైట్ విస్తృత కథనాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే(ఆ కథనాన్ని చదవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి). షుగర్ వ్యాధిని ఒక్కరోజులో తగ్గించుకోవచ్చని చిటికేసి మరీ చెబుతున్న వీరమాచనేని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో హాట్ టాపిక్ గా మారారు. వీరమాచనేనికంటే ఎంతో ముందుగానే విశాఖపట్నానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ పీవీ సత్యనారాయణ ఈ ప్రత్యామ్నాయ ఆహారవిధానంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు నయం చేస్తున్నప్పటికీ ఆయనకు పెద్గగా ప్రచారం లభించలేదు. దానికి కారణం సత్యనారాయణ కార్డియో థొరాసిక్ సర్జన్ కావటం, సర్జన్ గా తన విధులను కొనసాగిస్తున్నందున దీనిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేకపోవటం. మరోవైపు వీరమాచనేని చెప్పేతీరు బలంగా నాటుకుపోయేటట్లు ఉండటం, విజయవాడలోని పలువురు ప్రముఖ వైద్యుల మద్దతు కూడా లభించటంతో ఆయన సిద్ధాంతం విస్తృతంగా ప్రజలలోకి వెళ్ళింది. షుగర్ వ్యాధితో ఎన్నోరోజులుగా బాధపడుతున్నవారికి ఈయన ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి దానినుంచి బయటపడే మార్గముందని ఎవరైనా చెబితే ఆశగా చూడటం సహజం. ఔత్సాహికులు కొంతమంది ఈయన డైట్ ప్లాన్ ను ఆచరిస్తుండగా, మరికొంతమంది వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఆచరించేవారిలో రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులతోసహా ఎందరో ప్రముఖులు ఉంటున్నారు. మరోవైపు అల్లోపతి వైద్యులు, ఒబేసిటీ, షుగర్ వ్యాధిలను ఆధారంగా చేసుకుని వ్యాపారం చేసేవారు మాత్రం వీరమాచనేనిపై విరుచుకుపడుతున్నారు. మరి ఈ ఇరుపక్షాలలో ఎవరు కరెక్టో తెలుసుకోవాలంటే ఇరుపక్షాల ప్రధాన వాదనలను పరిశీలించాలి.To Read the Full Story, Click Here.

Saturday, January 20, 2018

మనం తిండి తినే విధానమంతా తప్పేనట! డాక్టర్‌లు కూడా ఫాలో అవుతున్న కొత్త పద్ధతి ఇదిగో!

పొద్దున్నే లేస్తే మనం తినే ఇడ్లీ, దోశ, పూరి, బ్రెడ్ లతో మొదలుపెట్టి భోజనంలో తినే అన్నం, చపాతి, ఇక సాయంత్రంపూట స్నాక్స్ గా తినే సమోసాలు, బజ్జీలు, బర్గర్, పిజ్జాలవరకు అన్నింటిలో ఎక్కువగా ఉండే ఏకైక పదార్థం ఏమిటో తెలుసా? కార్బోహాడ్రేట్స్(పిండిపదార్థాలు). ఇది మనం తీసుకునే ఆహారంలో 70 నుంచి 80 శాతం ఉంటోంది. ఇదే మన కొంప ముంచుతోందని, షుగర్, బీపీ, ఒబేసిటీ, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులకు కారణమవుతోందని తాజా అధ్యయనాలలో తేలింది. దీనితోపాటు - సంప్రదాయ వంటనూనెలు, నెయ్యి, వెన్న వంటి ఫ్యాట్స్(కొవ్వు పదార్థాలు)తో కొలెస్టరాల్ పెరుగుతుందని ఇంతవరకూ నమ్ముతూ వస్తున్న సిద్ధాంతం కూడా పూర్తిగా తప్పని తెలియవచ్చింది. ఫ్యాట్స్ తినటం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుందన్నది అపోహమాత్రమేనని, వాటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని అంటున్నారు. ఈ తాజా అధ్యయనాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఒక కొత్త ప్రత్యామ్నాయ ఆహార విధానం(డైట్ ఛేంజ్ ప్రోగ్రామ్) ఇప్పుడు ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలలో హల్ చల్ చేస్తోంది. దీనిని ఆచరించటంవలనసాధారణ వ్యక్తులకు ఆరోగ్యం ఎన్నోరెట్లు మెరుగవుతుండగా, షుగర్, బీపీ, ఒబేసిటీ, మోకాళ్ళ నొప్పులు,పీసీఓడీ వంటి దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులతో బాధపడేవారికి వాటినుంచి విముక్తి కలుగుతోంది. అవును… మీరు చదివింది కరెక్టే. ఇది అక్షరాలా నిజం. 3 నెలలపాటు ఒక నిర్ణీత పద్ధతిలో ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించి, కొవ్వుపదార్థాలను పెంచటమే ఈ కొత్త ప్రోగ్రామ్ లో అనుసరించే మూలసూత్రం. కొందరు వైద్యులు కూడా ఈ ప్రోగ్రామ్ ను ఆచరించి సత్ఫలితాలు పొందామని బహిరంగంగా చెబుతున్నారు. మీడియా కన్ను సరిగా పడకపోవటంతో పెద్దగా బయటకురాని ఈ ప్రోగ్రామ్ ఇప్పుడిప్పుడే మెల్లగా ఊపందుకుంటోంది. ఏపీలోని ఇతర ప్రాంతాలకు, తెలంగాణకు కూడా విస్తరిస్తోన్న కొత్త ఆహారవిధానంపై ప్రత్యేక కథనం.To Read the Full Story, Click Here.

Friday, January 5, 2018

ఈ తిక్క పాలిటిక్స్‌కు లెక్క ఉందా?

మన తెలుగు చేగువేరా పవన్ కళ్యాణ్ తాను అమితంగా ప్రేమించే అన్న బాటవైపుగానే అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు… రాజకీయాలకుసంబంధించి. కేసీఆర్ పాలన బాగుందని, చంద్రబాబు పాలన బాగుందని చెప్పటంద్వారా పవన్ తెలుగు రాష్ట్రాలప్రజలకు… కనీసం తన పార్టీ కార్యకర్తలకైనా ఏమి సందేశం ఇస్తున్నారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరువురు చంద్రుల పాలన బాగుంటే జనసేన అవసరం ఏమిటన్న విమర్శ బలంగా వినబడుతోంది. పవన్ కు తాను నడుపుతున్నది రాజకీయపార్టీనా, స్వచ్ఛందసేవాసంస్థ(ఎన్జీవో)నా అనేది స్పష్టత లేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జయప్రకాష్ నారాయణ 'లోక్ సత్తా' అనే స్వచ్ఛందసంస్థ పెట్టి దానిని రాజకీయపార్టీగా మార్చి విఫలమైతే, 'జనసేన' అనే రాజకీయపార్టీని పెట్టిన పవన్ దానిని స్వచ్ఛందసంస్థగా మారుస్తారా అన్న అనుమానం కలుగుతోంది.To Read Full Article, Click Here.

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts