మన తెలుగు చేగువేరా పవన్ కళ్యాణ్ తాను అమితంగా ప్రేమించే అన్న బాటవైపుగానే అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు… రాజకీయాలకుసంబంధించి. కేసీఆర్ పాలన బాగుందని, చంద్రబాబు పాలన బాగుందని చెప్పటంద్వారా పవన్ తెలుగు రాష్ట్రాలప్రజలకు… కనీసం తన పార్టీ కార్యకర్తలకైనా ఏమి సందేశం ఇస్తున్నారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరువురు చంద్రుల పాలన బాగుంటే జనసేన అవసరం ఏమిటన్న విమర్శ బలంగా వినబడుతోంది. పవన్ కు తాను నడుపుతున్నది రాజకీయపార్టీనా, స్వచ్ఛందసేవాసంస్థ(ఎన్జీవో)నా అనేది స్పష్టత లేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జయప్రకాష్ నారాయణ 'లోక్ సత్తా' అనే స్వచ్ఛందసంస్థ పెట్టి దానిని రాజకీయపార్టీగా మార్చి విఫలమైతే, 'జనసేన' అనే రాజకీయపార్టీని పెట్టిన పవన్ దానిని స్వచ్ఛందసంస్థగా మారుస్తారా అన్న అనుమానం కలుగుతోంది. To Read Full Article, Click Here.
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides