Friday, April 18, 2014

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది. అన్ని దినపత్రికలూ సహజంగానే ఆ వార్తను ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ  తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి.

తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్రాలకు సంబంధించికూడా శుక్రవారం ఉదయానికి దీనికిమించి పెద్దవార్తలేదు). ఆ వార్త ప్రాధాన్యానికి తగ్గట్టుగానే ఇవాళ్టి అన్ని దినపత్రికలలో బ్యానర్ వార్తగా వచ్చింది(టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రజ్యోతి పేపర్లలో ఇవాళ్టి బ్యానర్ వార్తలను పైన ఇమేజిలలో చూడొచ్చు). 'ఈనాడు'లో మాత్రం ఈ వార్త అసలు కనబడనేలేదు. వెబ్ ఎడిషన్ లోని 'ఈ- పేపర్'లో మాత్రం ఎనిమిదోపేజీలో ఎడమవైపు క్రింద మూలన ఒక చిన్నవార్తగా ఇచ్చారు(ఆఖరి ఇమేజ్ లో ఆ వార్తను చూడండి).

అక్కడ ఇచ్చిన వార్తలోకూడా వారు ఆ వార్తకు పెట్టిన శీర్షిక చూస్తే...'భాజపా, తెదేపా పొత్తుపై మథనం'. ఒక పక్కన తెగతెంపులు చేసుకోవాలనుకుంటున్నట్లు చంద్రబాబు స్వయంగా చెప్పటం, పొత్తుపై ప్రతిష్టంభన ఏర్పడటం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే 'పొత్తుపై మథనం' అని శీర్షిక పెట్టటమంటే వార్త ప్రాధాన్యతను తక్కువ చేయాలని సంపాదకవర్గం నిశ్చయించుకున్నట్లనిపిస్తోంది.


ఏది ఏమైనా, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ స్థాయి దినపత్రికలో ఇంత పెద్దతప్పుదొర్లటం దారుణం. తమ ప్రాధామ్యాలకోసమే వార్తను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెడితేమాత్రం అది క్షమించరాని తప్పిదం. సంపాదకవర్యులూ! ఈ తప్పిదంపై పాఠకులకు వివరణ ఇవ్వాల్సిన కనీసబాధ్యత తమపై ఉందేమో ఒకసారి ఆలోచించండి.

11 comments:

 1. భాజపా-తెదేపా మధ్య పొత్తు బదులుగా పోత్తు అని పడితే తప్పు దొరింది అనొచ్చు, లెదా ఏదో ఒక పార్టీ పేరు తప్పుగా పడితే తప్పు అనొచ్చు,
  కానీ యింతపెద్ద విషయాన్ని తప్పుదొర్లింది అంటే ప్రజలింకా పిచ్చోళ్ళని నమ్మే 'ఈనా డు'బ్బాకోర్ వ్రాతల్ని సమర్ధించినట్లే

  ReplyDelete
 2. జోగీ జోగీ రాచుకుంటే బూడిద రాలిందని సామెత. రెండూ తెలుగుగడ్డమీద గెలవలేని పార్టీలే. ఏ దృష్ట్యా మీరు ఆ పొత్తుకు అంత ప్రాధాన్యముందని భావిస్తున్నారో అర్థం కావట్లేదు.

  ReplyDelete
  Replies
  1. ఇక్కడ వార్తల ప్రాధాన్యతల గురించి ప్రస్తావిస్తుంటే ఆ రెండు పార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మీకు కనబడుతోందా! పోనీ ఏ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలో తమరు సెలవివ్వండి

   Delete
 3. మైక్రోసాఫ్ట్ కి ఎవరో అమెరికన్ ఇండియన్ ముఖ్య్యాధికారి అయితే , ఆయన పేరు సత్యనారాయణ చౌదరి అని డబ్బాకట్టి ప్రకటించిన పేపరు అది. ఆయన తండ్రి యుగంధర చౌదరి కాదని అనంతపురం వాళ్ళకి తెలుసు. అంతటి కులవాద పత్రిక అది.

  ఇప్పుడు ఆ మంద మోడి వెంట పడింది. కాబట్టి ఆ వార్త కుల వార్త అయింది. కుల వార్త విలువైనది. ఒకప్పుడు రెండు కమ్యూనిష్టు పార్టీలకు కులపీటలు వేసిన పత్రిక. మరువరాదు.

  ReplyDelete
 4. మైక్రోసాఫ్ట్ కి ఎవరో అమెరికన్ ఇండియన్ ముఖ్య్యాధికారి అయితే , ఆయన పేరు సత్యనారాయణ చౌదరి అని డబ్బాకట్టి ప్రకటించిన పేపరు అది. ఆయన తండ్రి యుగంధర చౌదరి కాదని అనంతపురం వాళ్ళకి తెలుసు. అంతటి కులవాద పత్రిక అది.

  ఇప్పుడు ఆ మంద మోడి వెంట పడింది. కాబట్టి ఆ వార్త కుల వార్త అయింది. కుల వార్త విలువైనది. ఒకప్పుడు రెండు కమ్యూనిష్టు పార్టీలకు కులపీటలు వేసిన పత్రిక. మరువరాదు.

  ReplyDelete
  Replies
  1. Nadeem,
   Can you show any proof to prove your point? Eenadu never mentioned his name is Satyanarayana Chowdary, if you can show any proof on that, I will stand corrected, otherwise are you ready to stand corrected?

   Delete
  2. ఇదుగోండి 2014 ఫిబ్రవరి 5 వ తేదీ ఈనాడు లో "శభాష్ సత్య" అని వచ్చినది.

   @@ " బుక్కాపురం బిడ్డ.. ' ఐఏఎస్ ' యుగంధర్ కుమారుడు..

   ఈనాడు, అనంతపురం: న్యూస్ టుడే, తాడిపత్రి : సత్య నాదెళ్ళ అలియాస్ నాదెళ్ళ
   సత్యనారాయణ చౌదరి స్వస్ధలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం." @@

   Delete
  3. Nadeem,
   Thanks for your reply, Is there any screen shot, other than your typing, the reason I am asking is I don't see it in Feb 5th Anantapur Edition what you are saying.
   FYi, Here is the link

   http://archives.eenadu.net/02-05-2014/district/inner.aspx?dsname=Anantapur&info=atp-panel1

   Delete
  4. Well, here is the link to the item.

   http://archives.eenadu.net/02-05-2014/news/newsitem.aspx?item=panel&no=3

   But it hardly matters to what caste Satya Nadella belongs. He is now a global person. Indians especially Telugu people should be proud of his success.

   Delete
 5. ఆర్యా ! మీరు అనవసరంగా కినుక పూనుతున్నారు. ఆ పార్టీలు రెండు అధికారంలోకి రాలేనివే. ఆ దృష్ట్యా వాటి పొత్తుకు ప్రాధాన్యం లేదు గనక ఈనాడు పత్రిక ఆ పొత్తు గురించి ప్రముఖంగా నివేదించినా నివేదించకపోయినా పెద్దగా తేడా ఉండదని నా భావం.

  - ఇట్లు మొదటి అనానిమస్

  ReplyDelete
 6. సత్యం నాదెళ్ళ ఏ కులస్థుడైతే మనకెందుకు ? ఈనాడుకెందుకు ? మన తెలుగువాడనుకుంటే మనకు తృప్తి. కానీ ఇన్ని దశాబ్దాల పాటు సంయుక్తరాష్ట్రాల్లో గడిపేసిన సత్యం నాదెళ్ళకి ఇప్పుడు తెలుగుఫీలింగ్ ఉంటుందా ? మైక్రోసాఫ్ట్ అధినేతగా ఆయన తెలుగువాళ్ళకు ఒరగబెట్టగలిగేదేమిటి ? కనీసం కొన్ని మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులనైనా తెలుగులో విడుదల చేయించగలడా ? Internet Explorer వచ్చి ఇన్నేళ్ళవుతూంటే అది ఈనాటికీ తెలుగులో లేదే. స్వదేశంలో ఎనిమిదిన్నరకోట్లమందికి లేని తెలుగుఫీలింగు విదేశంలో ఉండే గుప్పెడంతమంది పొట్టపోసుకోలు వలసదార్లకి ఉండాలని ఎక్కడ ఆశిస్తాం ? మనకే తెలుగుఫీలింగుంటే మన రాష్ట్రం ఎందుకిలా ముక్కలవుతుంది ? Pan-Telugu Nationalism is a dead concept for now. Hope it will be revived after a couple of generations at the least.

  ReplyDelete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts