Monday, December 28, 2015

వంగవీటి విసిరిన సవాల్‌కు దేవినేని నెహ్రూ స్పందిస్తాడా?


ఒకనాడు రౌడీయిజానికి, రక్తచరిత్రకు పేరుమోసిన విజయవాడలో మళ్ళీ కులచిచ్చు రగిలేటట్లు కనబడుతోంది. కొన్ని సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉన్న బెజవాడ మళ్ళీ రగులుకునేటట్లుంది. వంగవీటి రంగా 27వ వర్ధంతి సందర్భంగా నిన్న రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తూ, వంగవీటి రాధా దేవినేని నెహ్రూకు సవాల్ విసిరారు.To Read Full Story, Click Here.

Tuesday, December 22, 2015

అసలు ఆ రోజు రోజా ఏమంది: లీకైన అసెంబ్లీ గొడవ వీడియో


ఈ నెల 18న అసెంబ్లీలో కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొడవకు దిగటం, ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి సీటువద్దకు వెళ్ళి మరీ అనుచిత వ్యాఖ్యలతో దుర్భాషలాడటం, దాని ఫలితంగా ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేయటం తెలిసిందే. అయితే ఆ రోజు రోజా ముఖ్యమంత్రినే కాదు, పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను కూడా...To Read Full Story, Click Here.

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో రు.25 లక్షలు గెలుచుకున్న అంధుడు


‘మా టీవీ’లో నాగార్జున హోస్ట్‌గా ప్రసారమవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి రు.25 లక్షలు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబితే ఇచ్చే మొత్తం కోటి రూపాయలు అయినప్పటికీ ఇప్పటివరకు విజేతలు అందుకున్న గరిష్ఠమొత్తం రు.12.50 లక్షలుగానే ఉంది. అయితే నిన్న ప్రసారమైన...To Read Full Story, Click Here.

Wednesday, December 16, 2015

అడ్డంగా దొరికిపోయిన జగన్, బయటకొచ్చిన సీసీ టీవీ ఫుటేజ్


వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా ముందు వాపోయిన సంగతి తెలిసిందే. గిరిజన సంప్రదాయ ఆయుధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలను నరుకుతానని తమ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అంటే దానినేదో పెద్దది చేసి అనేక సెక్షన్ల కింద కేసుపెట్టారని, రాజంపేట ఎంపీ, తమ పార్టీ నేత మిధున్ రెడ్డి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో మేనేజర్‌ను కొట్టినట్లు తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.To Read Full Story, Click Here

Friday, December 4, 2015

సెల్ఫ్ గోల్ చేసుకున్న చంద్రబాబు


తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి "నానాటికి తీసికట్టు…" సామెత చందంగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో 15మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం బలం ప్రస్తుతం తొమ్మిదికి దిగజారింది. ఆ ఎన్నికలలో టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాత్రమే కాకుండా రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి కూడా ఇప్పటికే టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకూడా... To Read Full Story, Click Here.

Tuesday, November 24, 2015

వరంగల్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అఖండ విజయానికి కారణమేంటి?తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన 18 నెలల తర్వాత జరిగిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సాధిస్తోంది. కాంగ్రెస్, ఎన్డీఏ అభ్యర్థులకు డిపాజిట్లుకూడా వచ్చే పరిస్థితి కనిపించటంలేదు. వరంగల్ ప్రజలు అధికారపార్టీకి అనుకూలంగా విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. To Read Full Story Click Here.

Thursday, November 19, 2015

తెలంగాణ తెచ్చింది కేసీఆరా - జైపాల్ రెడ్డా? కొత్త చర్చ ప్రారంభం!


వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో వివిధ పార్టీల నాయకుల పరస్పర విమర్శనాస్త్రాల నేపథ్యంలో తెలంగాణ ఎవరు తెచ్చారన్న చర్చ మళ్ళీ మొదలయింది. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణను తెచ్చారని టీఆర్ఎస్ నేతలంటుంటే, తాను క్యాబినెట్‌లో లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పారు. మరి అసలు తెలంగాణ సాధించిన ఘనత ఎవరికి దక్కాలి!To Read Full Story Click Here

Friday, November 13, 2015

పవన్ అంత అమాయకంగా బాబు ట్రాప్‌లో ఎలా పడ్డాడు?


హైదరాబాద్: పవన్ నిన్న చంద్రబాబును కలవటానికి బయలుదేరిన దగ్గరనుంచి మీడియాలో ఎన్నో ఊహాగానాలు, కథనాలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, బాబు దగ్గరకు పవన్ ఎందుకెళ్ళాడో ఆయనకే తెలియదని కొందరు, పవన్ రాజ్యాంగేతరశక్తిలాగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు ముఖ్యమంత్రితో సహా అధికార యంత్రాంగమంతా సాగిలపడటం, సంజాయిషీలు ఇవ్వటమేమిటని మరికొందరూ విమర్శలు గుప్పించారు. పవన్ మాత్రం - అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళలేకపోయినందున శుభాకాంక్షలు చెప్పటానికి వెళ్ళానని చెప్పారు. అయితే ‘ఊరకరారు మహాత్ములు’ అన్నట్టుగా - ఈ అగ్రనేతల భేటి ఊరికే... కేవలం మర్యాదపూర్వకంగా జరిగినదిమాత్రం కాదని, వెనక ఏదోఉందని తెలుస్తూనేఉంది. ఆ ‘ఏదో’ ఏమిటనేది చర్చనీయాంశంగామారింది.To Read Full Story, Click Here.

Friday, October 30, 2015

‘మారుతి’ని చావుదెబ్బ కొడుతున్న బుల్లికారు ‘క్విడ్’!


దశాబ్దాలుగా భారత్‌లో కార్ల అమ్మకాలలో నంబర్ 1 స్థానంలో ఉన్న మారుతిసంస్థను రెండు నెలలైనా నిండని పసిగుడ్డులాంటి ఒక బుల్లికారు దిమ్మతిరిగిపోయేలా దెబ్బకొడుతోంది. భారత చిన్నకార్ల మార్కెట్‌లో మారుతి రారాజన్న విషయం తెలిసిందే.To Read Full Story, Click Here.

Wednesday, October 28, 2015

లగడపాటి ‘ల్యాంకో’ దివాళా తీసింది!


లగడపాటి రాజగోపాల్ నెలకొల్పిన ల్యాంకో సంస్థలు దివాళాకు సిద్ధంగా ఉన్నాయి. ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ ఈ ఏడాది మార్చ్ నాటికి రు.35 వేలకోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది. వడ్డీలకారణంగా ఈ మొత్తం రోజురోజుకూ పెరుగుతోంది.Read Full Story Here.

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమంఅసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు.Read Full Story Here.

Friday, October 23, 2015

అమరావతిలో యాంటీ క్లైమాక్స్‌ ఎందుకయ్యింది?సినిమాలలో క్లైమాక్స్‌లో ఏమవుతుంది? అదీ ముఖ్యంగా తెలుగు సినిమాలలో… హీరో అంతా సెట్ చేసి కథను సుఖాంతం చేస్తాడు. నిన్న కార్యక్రమంలో మోడి పెద్దన్న అయినప్పటికీ, హీరో మాత్రం చంద్రబాబే కదా. కానీ పెద్దన్న మోడి హీరో చంద్రబాబును తుస్సుమనిపించటానికి కారణం ఏమిటి? Read Full Story Here.

Thursday, October 22, 2015

అమరావతి శంకుస్థాపన లైవ్ అప్‌డేట్స్


అమరావతి శంకుస్థాపన కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్‌కోసం ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి - http://www.telugu360.com/amaravati-inauguration-live-blog/

Thursday, October 15, 2015

జగన్ ఫెయిల్యూర్‌ను క్యాష్ చేసుకోలేకపోతున్న టీడీపీ


ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఢీ అంటే ఢీ అన్నట్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ఊపిరి సలపకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఒక్కోసారి పైచేయి సాధిస్తోందికూడా.Read Full Story Here.

Tuesday, October 13, 2015

జగన్ దీక్షవల్ల ఒరిగిందేమిటి?


ప్రత్యేకహోదాకోసం జగన్ నిరవధిక నిరాహారదీక్ష మొత్తానికి ముగిసింది. మొదట ఫ్లూయిడ్స్ తీసుకోవటానికి నిరాకరించినట్లు వార్తలొచ్చాయిగానీ, తర్వాత ఫ్లూయిడ్స్ తీసుకున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఈ నిరాహారదీక్ష వలన జగన్ ఏమి సాధించారన్నది ఇప్పుడు చర్చనీయాంశమయింది.Read Full Story Here.

Tuesday, October 6, 2015

ప్రశ్నార్థకంగా మారుతున్న కేసీఆర్ వ్యవహారశైలి


తెలంగాణ ఏర్పడితే మన పాలన వస్తుందని, కష్టాలు, కన్నీళ్ళు తొలగిపోతాయని, అంతటా ఆనందం, హాయి వెల్లివిరుస్తాయంటూ నాడు అరచేతిలో వైకుంఠం చూపించారు. తెలంగాణ ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పటికీ రాదని, శాశ్వతంగా సీమాంధ్రుల దోపిడిలో బతకాల్సిందేనని హెచ్చరించారు. ఉద్యమం బలపడాలంటే ఆ మాత్రం సెంటిమెంట్ ఉండాలి కాబట్టి నాడు ఆయన అనుసరించిన విధానం అప్పటికి కరెక్టే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత...Read Full Story Here

Friday, October 2, 2015

చర్చనీయాంశంగా మారిన మరో భేటీ: భారతిని కలిసిన కవిత


మొన్న రామోజీరావుతో జగన్ భేటీ తెలుగురాష్ట్రాలు రెండింటిలో పెద్ద చర్చనీయాంశమైతే, ఇప్పుడు జగన్ భార్య భారతితో కేసీఆర్ కుమార్తె కవిత భేటీ అదేస్థాయిలో చర్చకు దారితీసింది. కవిత నిన్న హైదరాబాద్‌లో జగన్ నివాసం
లోటస్ పాండ్‌కు వెళ్ళి...Read Full Story Here

Wednesday, September 30, 2015

నోస్టర్‌డామస్ చెప్పిన ఆ నాయకుడు నరేంద్ర మోడీయేనా?


2014 నుంచి 2026 వరకు భారతదేశాన్ని ఒక వ్యక్తి పరిపాలిస్తాడని, అతనిని ప్రజలు మొదట ద్వేషిస్తారని, అయితే అతను తర్వాత దేశ దశ, దిశను మార్చేయటంతో విపరీతంగా ప్రేమిస్తారని ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్టర్ డామస్ 450 సంవత్సరాల క్రితం చెప్పినది ...Read Full Story Here

Friday, September 25, 2015

రామోజీ - జగన్‌ భేటి: తెరవెనక కథేంటి?


వ్యాపారపరంగా, రాజకీయంగా బద్ధశత్రువులైన జగన్మోహన్ రెడ్డి, రామోజీరావు ప్రత్యేకంగా భేటీకావటం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. జగన్ నిన్నసాయంత్రం తమ పార్టీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డితో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీరావుతో భేటీ అయ్యారు...Read The Full Story Here

చిరంజీవి బీజేపీలో చేరబోతున్నారా?


కాంగ్రెస్ ఎంపీ, నటుడు చిరంజీవి భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నట్లు హైదరాబాద్‌నుంచి వెలువడే ఒక ఆంగ్ల దినపత్రిక ఇవాళ ఓ కథనాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రవర్తనతో నొచ్చుకుని చిరంజీవి ఈ నిర్ణయం ...Read Full Story Here.

Thursday, September 3, 2015

ట్యూషన్‌లో పొరపాటు: తప్పులో కాలేసిన జగన్


ప్రత్యేకహోదాపై మంగళవారంనాడు సీఎమ్‌కు, స్పీకర్‌కూ ట్యూషన్ చెప్పబోతున్నానని ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి సోమవారంనాడు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే మంగళవారంనాడు ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షనేతగా జగన్ చర్చను ప్రారంభించారు. ప్రిపేర చేసుకొచ్చిన కాగితాలు చదువుతూ...Read The Full Story Here.

రామోజీ ఆలోచనలలో మార్పు వచ్చిందా?


తెలుగు మీడియారంగ దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నాస్తికుడని ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనవసరంలేదు. తెలుగువారందరికీ అది తెలిసిన విషయమే. కమ్యూనిస్ట్ భావజాలం నిండిన రామోజీ తన చిత్రనిర్మాణసంస్థకుగానీ, ఇతర సంస్థలకుగానీ దేవుడి పేర్లు పెట్టలేదు. సంస్థకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలలోగానీ, వార్షికోత్సవాలలోగానీ, ఇతర కార్యక్రమాలలోగానీ పూజలలో ఆయన పాల్గొనరు.Read The Full Story Here...

Tuesday, September 1, 2015

వందలకోట్ల బ్రాండ్ ఇమేజ్‌ను వృథా చేసుకుంటున్న తల'తిక్క' చేగువేరా


సినిమాలలోనూ, రాజకీయాలలోనూ అతనికున్న పాపులారిటీకి, బ్రాండ్ ఇమేజ్‌కీ కోట్లకు కోట్లు సంపాదించుకోవచ్చు. వరసగా సినిమాలు ఒప్పుకుని చేసేయొచ్చు. యాడ్స్ చేయొచ్చు. కానీ చేయడు. కాబట్టే అతను పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇలా వందలకోట్ల బ్రాండ్ ఇమేజ్‌ను వృథా చేసుకుంటున్న సెలబ్రిటీ మరొకరు ఉండరేమోననిపిస్తుంది.Read Full Story Here.

Saturday, August 29, 2015

వెంకయ్యనాయుడు ఆంధ్రా తరపున మాట్లాడకూడదా?

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాను కేంద్రమంత్రిననే విషయాన్ని మరిచిపోయి ఏపీ రాష్ట్రానికి ప్రతినిధిలాగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నీతిఆయోగ్ బృందాన్ని తన ఇంటికి పిలిపించుకుని ఏపీకి చెందిన అంశాలపై మాట్లాడటంపై మండిపడ్డారు. దీనిని టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. వెంకయ్యనాయుడు విభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. Read Full Story Here.

Thursday, August 27, 2015

తెలంగాణలో 2019లో పవర్‌ కాంగ్రెస్‌దేనా?

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ సమయం ఉండగా రానున్న ప్రభుత్వంగురించి అప్పుడే ఊహాగానం చేయటం తొందరపాటు(టూ ఎర్లీ) అనిపించినా ప్రస్తుత పరిస్థితులు అలా ఆలోచించేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. దీనికిగానూ ముందు కేసీఆర్ ప్రభుత్వ పాలనను, తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పనితీరు అంశాలను ఒకసారి బేరీజు వేయాలి. Read Full Story here

Friday, August 21, 2015

ఏపీ మంత్రిని విమర్శిస్తూ ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌లో కథనమా!మామూలుగా అయితే ఇలా కథనం రావటంలో విశేషమేమీలేదు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా పిలువబడే మీడియా - ప్రభుత్వాల లోపాలపై, పొరపాట్లపై కథనాలు వెలువరించాల్సిందే. అయితే తెలుగుదేశం పార్టీ సొంత మీడియా సంస్థలలాగా వ్యవహరిస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ ఛానల్ ఇలాంటి కథనాలు వెలువరించటం విశేషం. Read full story here

Wednesday, August 19, 2015

మోడి 'డౌన్‌ఫాల్' మొదలయిందా!                      ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి

Tuesday, August 18, 2015

కొరటాల శివ - బోయపాటి శ్రీను: ఎవరిమాట నిజం?                    ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి

Thursday, August 13, 2015

నిర్భయ-రిషిత: మరణించి సాధించారు, మార్పులకు నాంది పలికారు!                    ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి!

Friday, August 7, 2015

తను తీసుకున్న గోతిలో తానే పడిన మోడి!ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి!

సుష్మాపై సోనియా కక్షకు కారణం!
                     ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి!

Thursday, August 6, 2015

'డిఫరెంట్ షేడ్స్' చూపిస్తున్న జానారెడ్డి!                       ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి!

ఇది తెలుసా! మహేష్‌కు తెలుగు చదవటం రాదట!
                   ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి!

కేసీఆర్! అంత విలాసాలు అవసరమా?                      ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి!

Wednesday, August 5, 2015

హైకోర్టు విభజనపై ఇదీ కేసీఆర్ రహస్య ఎజెండా!
                                ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి!

'నాటి ఎన్‌టీఆర్ తర్వాత ఇప్పుడు పవన్‌కే ఆ ఘనత'                                ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి

Tuesday, August 4, 2015

ఐదు భాషలలోనూ హిట్ అయిన 'దృశ్యం'

                         
                                 ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి

నవ్వు తెప్పిస్తున్న మహేష్ 'శ్రీమంతుడు' స్టిల్


                                         ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి

Friday, July 31, 2015

విభజన విభేదాలకు కారణమెవరు?

http://www.telugu360.com/te/cms-of-telugu-states-should-put-full-stop-to-the-disputes/

ఆర్టికల్ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి

Friday, July 17, 2015

చంద్రబాబు పట్టు కోల్పోయారా!


http://www.telugu360.com/te/did-chandrababu-loose-hold-on-party-and-govt/

                ఆర్టికల్‌ చదవటానికి పై ఇమేజ్‌మీద క్లిక్ చేయండి


Saturday, March 28, 2015

ఆంధ్రా కేజ్రీవాల్ అవ్వాలనుకుంటున్న శివాజికి విశాఖలో చేదు అనుభవం


ఏదో ఒక సమస్య తీసుకుని ప్రజా ఉద్యమాలు నడిపి అర్జెంట్‌గా ఏపీలో అగ్రనేతగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న నటుడు శివాజికి దురదృష్టవశాత్తూ నిన్న విశాఖపట్నంలో చుక్కెదురయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం శివాజీ ఇటీవల ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రం నలువైపులా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో మొదటి సమావేశం నిర్వహించారుకూడా. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలోని ప్లాటినంజుబ్లీ హాల్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశంలో మాట్లాడుతూ కొందరు వక్తలు బీజేపీ, టీడీపీ పార్టీలను విమర్శించినపుడు శివాజీ వారిని అడ్డుకుని మైక్ కట్ చేశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వక్తలను శివాజి అనుచరులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో  అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసంతృప్తికి గురైన శివాజి, ఇలా అయితే వెళ్ళిపోతానంటూ తన అనుచరులతోసహా అక్కడనుంచి కారులో ఉడాయించారు. ఓర్పు, సహనంలేని శివాజికి రాజకీయాలు ఎందుకంటూ సమావేశానికి హాజరైన విద్యార్థులు, ఉద్యమకారులు హీరోగారిని తీవ్రంగా దుర్భాషలాడారు. ఈ సమావేశంతాలూకు వీడియోను ఇక్కడ చూడొచ్చు.

'మాస్టర్' చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన శివాజి, గుంటూరుజిల్లా నర్సరావుపేటప్రాంతానికి చెందిన సామాన్యకుటుంబంనుంచి వచ్చారు. హైదరాబాద్‌లో జెమిని టీవీ ఛానల్‌లో మొదట చిన్నఉద్యోగం చేసేవారు. ఒకరోజు పాటల ప్రోగ్రామ్‌కు యాంకర్ రాకపోవటంతో మంచి మాటకారి అయిన శివాజినే ఆ ప్రోగ్రామ్ నిర్వాహకులు యాంకర్‌ను చేసేశారు. ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు 2000 సంవత్సరంలో కొత్త నటీనటులకోసం నిర్వహించిన పోటీలో సెలక్ట్ అయ్యారు. 'పరదేశి' అనే సినిమాలో అవకాశం సంపాదించుకుని 'మాస్టర్' చిత్రంద్వారా వెలుగులోకి వచ్చారు. హీరో స్నేహితుడి వేషాలు వేస్తూ ఉండే శివాజి మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం వంటి చిత్రాలద్వారా హీరోగా ఓ వెలుగు వెలిగారు. మాస్ హీరోగా ఎదగాలని స్టేట్ రౌడీ, సీతారాముడు అనే కొన్ని చిత్రాలు తీయగా అవి వారంకూడా ఆడలేదు. ఆ దెబ్బతో చిన్న సినిమాల ఆఫర్‌లు కూడా పోయాయి. ఇటీవల అవకాశాలు లేకపోవటంతో తనే స్వంతంగా 'బూచమ్మ బూచాడు' అనే కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించారు. అది ఓ మాదిరిగా నడిచింది.

టీవీ9 ఎడిటర్ రవిప్రకాష్‌తో సాన్నిహిత్యం కలిగిఉన్న శివాజీ, ఆ ఛానల్ మద్దతుతో ఉద్యమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏదో ఒక సమస్య తీసుకుని రోడ్డెక్కుతున్నారు. ఆ కార్యక్రమాలన్నింటినీ టీవీ9 అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చూపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెంవద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదం బాధితుల సమస్యతో ఉద్యమాల బాటలో బయలుదేరారు. ఆ తర్వాత, తిరుమలలో దేవస్థానం బోర్డ్ ధనికులకు ఊడిగం చేస్తోందంటూ హైదరాబాద్‌లో ఒకరోజు ధర్నా చేశారు(టీటీడీ బోర్డ్ ఛైర్మన్ కావాలన్నది తన కోరికలలో ఒకటని ఈయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కేలో వాక్రుచ్చారు). రోడ్డుప్రమాదాలు ఎక్కువైపోతున్నాయంటూ కొన్నిరోజులు ఆక్రోశం వెలిబుచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం గళమెత్తారు. అన్నిపార్టీలూ కలిసి ఏపీని తొక్కేస్తున్నాయని, దీనికోసం ఉద్యమించాలని నినదించారు. అంతర్యుద్ధం తప్పదని ప్రభుత్వాలను హెచ్చరించారు.

లక్ష్యం స్వార్థపూరితమైనప్పటికీ ఆ ప్రయత్నంలో శివాజి మరింత శ్రద్ధ, కృషి పెడితే బాగుండేది. ఏదో ఒక సమస్యతో టీవీ ఛానల్‌లో కనిపించాలనికాకుండా, చిత్తశుద్ధితో ఏదో ఒకటి నిర్మాణాత్మకంగా చేయాలి. ఆ సమస్యను సమూలంగా అధ్యయనం చేయాలి. శివాజి సభలలో మాట్లాడే మాటలు చూస్తే పరిణతితోకూడినవిగాలేకపోగా చిన్నపిల్లలు మాట్లాడినట్లు ఉన్నాయి. షార్ట్‌కట్‌లద్వారా తొందరగా పైకి ఎగబాకాలనికాక ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా శివాజి కృషిచేస్తే బాగుంటుంది.Image courtesy:fb.com/ActorSivaji

Saturday, March 21, 2015

పేపర్లకెక్కిన అక్కినేని ఫ్యామిలీ: జప్తు నోటీసులు జారీచేసిన బ్యాంక్‌లుహైదరాబాద్‌ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో అన్నపూర్ణ స్టూడియోస్‌కు చెందిన అత్యంత విలువైన 7 ఎకరాలు 25 గుంటల స్థలాన్ని ఇండియన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ అధికారులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. స్టూడియోస్‌తరపున తమవద్ద తీసుకున్న రుణాలకు సంబంధించి రు. 62కోట్లు బకాయి ఉందని, దీనిపై గత ఏడాది జనవరి రెండున డిమాండ్ నోటీస్ జారీ చేసినప్పటికీ రుణగ్రహీతలు స్పందించనందున 20మార్చి 2015న స్టూడియోస్‌ తరపున తనఖా పెట్టిన స్థలాన్ని స్వాధీన పరుచుకున్నట్లు బ్యాంక్ అధికారులు ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ స్థలానికి సంబంధించి ఎట్టి లావాదేవీలూ జరుపరాదని హెచ్చరించారు. రుణాన్ని తీసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన కుమారులు నాగార్జునరావు(నాగార్జున) ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అయితే నాగేశ్వరరావు చనిపోయినందున  నాగార్జునతోబాటు నాగేశ్వరరావు వారసులు వెంకట నారాయణరావు(వెంకట్), కుమార్తె నాగసుశీల('కరెంట్' సుశాంత్ తల్లి), మరో కుమార్తె సరోజ మనవరాలు సుప్రియ(అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం హీరోయిన్), ఇంకా నిమ్మగడ్డ ప్రసాద్(వాన్‌పిక్, మ్యాట్రిక్స్, మాటీవీ), వెంకటేశ్ రొడ్డంకూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని బ్యాంక్ అధికారులు  తెలిపారు. ఈ బకాయిలకు గ్యారెంటర్లుగా నాగార్జున, సుప్రియ ఉన్నట్లు వెల్లడించారు. ఆర్థిక వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉంటారని ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటినుంచి అక్కినేనికి మంచి పేరుంది. మద్రాస్‌లో, హైదరాబాద్‌లో, ప.గో.జిల్లాలో అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటినుంచో అనేక స్థిరాస్తులు ఉన్నాయి. దానికితోడు ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిచిన 'మనం' చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అలాంటిది అక్కినేని చనిపోయిన కొద్దికాలానికే ఇలా ఆయన కుటుంబం పేరు పేపర్లకెక్కటం ఆశ్చర్యకరంగా ఉంది. 


బ్యాంక్ అధికారుల పత్రికా ప్రకటనను ఈ లింక్‌లో చూడొచ్చు -  http://epaper.eenadu.net. ఈ లింక్ లోకి వెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఎంచుకుని అక్కడి dropdownనుంచి హైదరాబాద్ ఎడిషన్‌ సెలక్ట్ చేసుకుని రెండవ పేజిలో చూడండి.

Tuesday, March 10, 2015

యాపిల్‌వారి మరో ప్రతిష్ఠాత్మక ఉత్పాదన 'యాపిల్ వాచ్' ఆవిష్కారం!


మ్యాక్, ఐపాడ్, ఐఫోన్, మ్యాక్ బుక్, ఐపేడ్‌వంటి అత్యుత్తమమైన ఉత్పత్తులతో చరిత్ర సృష్టించిన యాపిల్ సంస్థ, తమ మరో ప్రతిష్ఠాత్మక ఉత్పత్తి 'యాపిల్ వాచ్‌'ను నిన్న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో విడుదల చేసింది.  దీనిని రెండు సైజులలో వివిధ మోడల్స్, డిజైన్లలో తయారు చేశారు. ప్రారంభ దర - 349 అమెరికన్ డాలర్లు. ఇది సుమారు రు.21 వేలకు సమానం. గరిష్ఠధర - 17,000 అమెరికన్ డాలర్లు(రు. 10,20,000). గరిష్ఠ మోడల్‌ వాచ్‌ను 18 క్యారట్ల బంగారంతో రూపొందించారు. డిస్‌ప్లే గ్లాస్‌ను సఫైర్(నీలం)తో తయారు చేశారు.

వచ్చేనెల పదినుంచి ఆర్డర్‌లు బుక్ చేసుకోవచ్చని, 24నుంచి స్టోర్లలో అందుబాటులో ఉంటుందని సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. ఐఫోన్ చేసే కాల్స్, మెసేజెస్, పేమెంట్స్‌వంటి పలు పనులతోబాటుగా ధరించినవారి హృదయ స్పందనలను(హార్ట్ బీట్), వారు చేసే వ్యాయామం వివరాలను కూడా నమోదు చేస్తుందని కుక్ చెప్పారు. చేయవలసినపనులను(రిమైండర్స్) మణికట్టుమీద తట్టిమరీ గుర్తు చేస్తుందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లలో చెక్‌ఇన్ చేయటానికి, కొన్ని హోటల్స్‌లో గదులకు తాళంగాకూడా ఈ వాచ్‌ను ఉపయోగించొచ్చని టిమ్ కుక్ నిన్న ఆవిష్కరణ కార్యక్రమంలో చెప్పారు. బ్యాటరీలో ఛార్జి 18 గంటలు వస్తుందని వెల్లడించారు. 

మరోవైపు యాపిల్ వాచ్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కేవలం హార్ట్ బీట్ వంటి కొన్ని పనులు మాత్రమే ఫోన్ కంటే అదనంగా వాచ్ చేస్తోందని, వాటికోసం అంత ఖర్చుపెట్టి దానిని కొనాల్సిన అవసరం లేదని, పలు రిస్ట్ బ్యాండ్ ట్రాకర్‌లు లభిస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. అటు వాచ్ ఆవిష్కరణ కార్యక్రమంలోనే సరికొత్త 12 అంగుళాల మ్యాక్ బుక్‌ ల్యాప్‌టాప్‌ను కూడా విడుదల చేశారు. దీనిలో ఒకే ఒక యూఎస్‌బీ పోర్ట్ ఉండటం విశేషం.

Image courtesy: www.apple.com


Tuesday, February 10, 2015

ఢిల్లీలో అద్భుతాన్ని ఆవిష్కరించిన సామాన్య మానవుడు!


ఎనిమిది నెలలక్రితం తిరుగులేని మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న 'మోడి-షా అండ్ కో'కు ఢిల్లీ ఆమ్ ఆద్మీలు(సామాన్య మానవులు) దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. ప్రభుత్వంలో, పార్టీలో ఏకపక్షంగా - కేంద్రీకృతంగా వ్యవహారాలు నడుపుతున్న మోడి-షా ద్వయానికి ఇది చెంపపెట్టు. అమిత్ షా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికలలో తన శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. తమపార్టీ ఎంపీలు 300మందినికూడా అమిత్ షా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దించారు. ఢిల్లీ నగరంలో గణనీయసంఖ్యలో ఉన్న ఆంధ్రప్రాంత తెలుగువారిని ఆకట్టుకోవటంకోసం ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు. ఆఖరు నిమిషంలో కిరణ్‌బేడిని పార్టీలోకి తీసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు(దీంతో అంతర్గత విభేదాలు మొదలై ఇదే చివరికి 'బూమరాంగ్' అయింది). స్వయంగా నరేంద్ర మోడి విస్తృతంగా ప్రచారసభలలో పాల్గొని ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చేసిన తప్పులను తెలుసుకుని దాదాపు సంవత్సరకాలంగా పక్కా ప్రణాళికతో పనిచేస్తూ లక్ష్యాన్ని సాధించింది. పార్టీ వ్యవస్థను పోలింగ్ బూత్‌స్థాయినుంచి పునర్నిర్మించుకుంది. కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించటంపై చేసిన జాప్యం ఆమ్ ఆద్మీపార్టీకి కలిసొచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఈ ఎన్నికలకు సిద్ధమైలేకపోగా ఆమ్ ఆద్మీమాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దానికితోడు గతంలో తాను తప్పు చేశానని కేజ్రీవాల్ నిజాయతీగా క్షమాపణ వేడుకుని ప్రజలలో తనపైఉన్న అసంతృప్తిని తొలగించుకున్నారు. తనమీద ఉన్న అరాచకముద్రను తొలగిపోయేలా పాత ధోరణిని మార్చుకున్నారు. కిరణ్‌బేడివంటి ప్రత్యర్థులు రెచ్చగొట్టినా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. మఫ్లర్, గళ్ళచొక్కా, కళ్ళజోడువంటి సామాన్యమానవుడి గెటప్‌తో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు(మోడి రు.10 లక్షల సూట్ ధరించటం పలు విమర్శలకు దారితీసింది). బుఖారి మద్దతు ప్రకటించినా దానిని తిరస్కరించటం కేజ్రీవాల్ తీసుకున్న మరో మంచి నిర్ణయమని చెప్పాలి.

ఈ ఎన్నికల ఫలితంనుంచి ఇటు మోడి-షా ద్వయం, అటు కేజ్రీవాల్ బృందం నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. మోడి-షా ద్వయం తమ అహంకారాన్ని వీడి పార్టీలో, ప్రభుత్వంలో వికేంద్రీకృత, ప్రజాస్వామిక వ్యవహారశైలిని అనుసరించాలి. కేజ్రీవాల్ బృందం తమ గెలుపుకు కారణాలను గుర్తెరిగి గతంలో చేసిన తప్పులను(ఒక్కసారి జాతీయస్థాయికి ఎదిగిపోవాలని ప్రయత్నించటం, ప్రతిదానికీ రోడ్డుకెక్కటం వగైరా) పునరావృతంకాకుండా చూసుకోవాలి. 

image courtesy: wikipedia

Wednesday, February 4, 2015

'superlative' ముఖ్యమంత్రి కేసీఆర్


చిన్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్‌ చదువుకున్నవారందరికీ parts of speech లోని ఎనిమిది భాగాలలో Adjective అనేది గుర్తుండే ఉంటుంది. ఆ Adjectiveలో Superlative Adjective అనే మరో సబ్ క్యాటగిరీ ఉంటుంది. ఆ సూపర్‌లేటివ్ ఎడ్జెక్టివ్‌కు అర్థం 'సర్వోత్కృష్టమమైనది' అని. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకయ్యా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సమయాలలో, సందర్భాలలో ఆయా సమస్యలకు ప్రకటిస్తున్న 'సర్వోత్కృష్ట' పరిష్కారాలగురించి చెప్పేందుకు. అదేమిటో ఏ సమస్యకుకూడా సర్వోత్తమమైనది తప్పితే దానికి తక్కువస్థాయిలో పరిష్కారం కేసీఆర్‌కు కనబడదు. 

ఏదైనా సమస్యను వివరించటం ఆలస్యం ఆయన దానికి సర్వోత్కృష్టమైన పరిష్కారం ప్రకటించిపారేస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం సందర్భంగా మొదలుపెట్టిన ఈ పోకడ, అధికారం చేపట్టిన ఆర్నెల్ల తర్వాతకూడా కొనసాగుతూనేఉంది. నాడు ప్రచారంలో పేదలకు డబల్ బెడ్‌రూమ్ ఫ్లాట్, మూడెకరాల పొలం, కోటి ఎకరాలకు సాగునీరు, లక్షా 25వేల ఉద్యోగాలు, ముస్లిమ్‌లకు 12శాతం రిజర్వేషన్లు వంటి వాగ్దానాలు చేశారు. వాటి ఆచరణ ఏదశలో ఉందో ఎవరికీ తెలియదు. వాగ్దానాలుమాత్రం  అధికారం చేపట్టిన తర్వాత మరింత జోరందుకున్నాయి.

తాజాగా చూస్తే...త్వరలో రానున్న కార్పొరేషన్ ఎన్నికలదృష్ట్యా హైదరాబాద్‌నగరంమీద దృష్టి కేంద్రీకరించిన దొరవారు భాగ్యనగరాన్ని అమెరికాలోని డాలస్ నగరంలాగా చేస్తానని ఇవాళ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. మొన్నటికి మొన్న నగరంలోని పేదలందరికీ టవర్స్ అనే ఆకాశహర్య్యాలను కట్టించి గృహవసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. టవర్స్ అంటే గుర్తొచ్చింది...హుస్సేన్‌సాగర్‌చుట్టూ వంద అంతస్తుల ఆకాశహర్మ్యాలు కట్టిస్తానని, వాటిలో ప్రపంచంలోనే ఎత్తయిన టవర్ కూడా ఉంటుందని ఆ మధ్య చెప్పారు. హుస్సేన్ సాగర్ శుద్ధికి రు.100 కోట్లు, వినాయక సాగర్ నిర్మాణం, హైదరాబాద్ ఉత్తరాన మరో విమానాశ్రయం...తదితర వాగ్దానాలుకూడా చేశారు. ఇటీవల యాదగిరిగుట్ట సందర్శనకు వెళ్ళిన సందర్భంగా గుట్టను తిరుపతిని తలదన్నేలా వాటికన్ స్థాయిలో ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రం చేస్తానని వాక్రుచ్చారు. బ్రాహ్మణుల సభలో వారి సమస్యలను ఏకరువు పెట్టగానే 50 కోట్ల రూపాయలతో అర్చక సంక్షేమనిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ధూప దీప నైవేద్యాలకోసం ఒక్కొక్క గుడికి నెలకు రు.6 వేలరూపాయలు మంజూరు చేస్తానని మరో వాగ్దానం. వరంగల్ నగరాన్ని సూరత్ స్థాయిలో టెక్స్‌టైల్ హబ్‌గా మారుస్తానని, కరీంనగర్‌ను లండన్, న్యూయార్క్ నగరాలస్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. మళయాళీల సభలో వారి భవనానికి ఎకరం స్థలం, కోటిరూపాయల నిధులు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇల్లులేని మళయాళీ కుటుంబాల జాబితా ఇస్తే డబల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక తెలంగాణలోని ప్రతి ఇంటికీ నాలుగేళ్ళలో నల్లా ఏర్పాటు చేయిస్తానంటూ 28వేల కోట్ల రూపాయల వాటర్ గ్రిడ్ పథకాన్ని ఆర్భాటంగా ఆవిష్కరించారు. ఈ గ్రిడ్ ప్రపంచ రికార్డ్ సృష్టిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఈ గ్రిడ్‌కోసం భూమి చుట్టుకొలతకు నాలుగురెట్లు పొడవైన పైప్ లైన్లు వేయబోతున్నట్లు ప్రకటించారు.

పిట్టలదొరలాగా హామీలు ఇచ్చేస్తున్నాడని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఎలా ఉన్నా, ఈ వాగ్దానాలు - ఆచరణ విషయంలో కేసీఆర్‌ పాపులారిటీకి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి హనీమూన్ వ్యవధిని కాస్త ఎక్కువగానే ఇచ్చే మైండ్‌సెట్‌లో ఉన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వంకాబట్టి కాస్త టైమ్ ఇవ్వాలని జనంలో అభిప్రాయం నెలకొని ఉంది(అందుకేనేమో సీఎన్ఎన్ ఐబీఎన్ ఛానల్ నిర్వహించిన పోల్‌లో కేసీఆర్ మోస్ట్ పాపులర్ పొలిటీషియన్‌గా ఎన్నికయ్యారు). ఇప్పటిదాకా కేసీఆర్ ప్రభుత్వం చేసినదానినిగురించి చెప్పుకోవాలంటే కనిపిస్తున్నది ఏమైనా ఉందా అంటే - అది ఒక్క సమగ్ర సర్వే మాత్రమే(ఆ సర్వేలోని డేటాను ఎలా వినియోగించుకున్నారో తెలియటంలేదుగానీ, త్వరలో మళ్ళీ మరో సర్వే చేయించబోతున్నారట). కేసీఆర్ ఇప్పటికైనా మేలుకుని 'బెస్ట్ ఇంపాజిబుల్ సొల్యూషన్‌' ప్రకటనలను గుప్పించటంకాక ఆచరణసాధ్యమయ్యే పరిష్కారాలకోసం కృషి చేస్తే బాగుంటుంది.

photo courtesy:www.telangana.gov.in

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts