Thursday, April 25, 2019

అత్యుత్తమ రేటింగ్స్ తో ఎంట్రీ ఇస్తున్న 'రియల్ మి 3 ప్రో': షియామికి ఝలక్!

గత ఫిబ్రవరిలో విడుదలైన 'రెడ్‌మి నోట్ 7 ప్రో' భారత మొబైల్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. బడ్జెట్ మొబైల్స్ సెగ్మెంట్‌లో ఆ ఫోన్ ను దాదాపుగా 'గేమ్ ఛేంజర్' అని చెప్పొచ్చు. 14 వేల రూపాయలకే స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సోనీ కెమేరా వంటి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ఇస్తున్న ఈ ఫోన్ ను మార్కెట్ నిపుణులు బెస్ట్ 'వేల్యూ ఫర్ మనీ' గ్యాడ్జెట్ గా అభివర్ణించారు. ఒక్క ఎన్ఎఫ్‌సి(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) తప్పితే మిడ్‌రేంజ్, ప్రీమియమ్ సెగ్మెంట్ ఫోన్లలో ఉండే ఫీచర్లు దాదాపుగా అన్నీ ఉన్నాయనే చెప్పాలి. ఇప్పటికే భారత్‌లో మొబైల్ ఫోన్ అమ్మకాలలో నంబర్ 1 స్థానానికి చేరుకున్న షియామి(రెడ్‌మి సంస్థకు మాతృసంస్థ)ని రెడ్‌మి నోట్ 7 ప్రో మరింత పైకి తీసుకెళుతుందని అందరూ భావించారు. అయితే షియామికి వణుకు పుట్టించే విధంగా, 'రెడ్‌మి నోట్ 7 ప్రో'ను తలదన్నే ఫోన్‌ను రియల్ మి సంస్థ మూడురోజుల క్రితం విడుదల చేసింది. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Wednesday, April 10, 2019

విశ్లేషణ: ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు పడనున్నాయి?ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొని ఉంది. టీడీపీ, వైసీపీల స్థాయిలో లేకపోయినా జనసేనపార్టీ చాలాచోట్ల నిర్ణయాత్మకంగా ఉంది. పోయినసారి ముఖాముఖి పోటీలో టీడీపీ విజయం సాధించింది. మరి ఈ త్రిముఖ పోటీ ఎవరికి లాభిస్తుందో పరిశీలిద్దాం.

ఏపీలో కులాల స్పృహ కాస్త ఎక్కువేనన్న విషయం తెలిసిందే. అందులోనూ ఈ సారి పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ ఎన్నికలు మూడు కులాలకు చెందిన మూడు ప్రధానపార్టీల మధ్య యుద్ధంలాగా మారాయి. ఇక రాష్ట్రంలో మిగిలిన కులాల ఓటర్లు ఈ మూడు పార్టీలలో ఎవరికి అత్యధికంగా మొగ్గు చూపితే వారే అధికారాన్ని చేజిక్కించుకుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనవరసరంలేదు. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. Click Here.

Tuesday, April 9, 2019

విశ్లేషణ: చంద్రబాబు/జగన్ - ముఖ్యమంత్రిగా ఎవరు బెటర్?

ఆంధ్రప్రదేశ్ లో తటస్థంగా ఉండే విద్యావంతులు, ఆలోచనపరులు ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారికి ముందుచూస్తే నుయ్యి, వెనకచూస్తే గొయ్యి(పెనంనుంచి పొయ్యిలోకి అని, ఇంగ్లీషులో between the devil and the deep sea అనికూడా అంటారు) అన్నట్లుగా ఉంది . ఒకవైపేమో, ఏపీలో అవినీతిని కనీ వినీ ఎరగని రీతిలో తారాస్థాయికి చేరేటట్లు చేసి, అస్మదీయవర్గం దోచుకోటానికి తలుపులు బార్లా తెరిచిన చంద్రబాబు ప్రభుత్వం ఉంది. మరోవైపేమో... ఏమి చేసైనా ముఖ్యమంత్రి గద్దెనెక్కాలనే ఏకైక లక్ష్యంతో సాగుతూ, ఏపీ అభివృద్ధి అవ్వకూడదని బలంగా కాంక్షించే కేసీఆర్ తో జట్టుకట్టిన ప్రతిపక్ష నాయకుడు జగన్ ఉన్నారు. పూర్తివ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. Click Here.

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts