Skip to main content

Posts

Showing posts from January, 2020

కమ్మవారిని దెబ్బతీయటానికే రాజధానిని జగన్ మార్చారా?

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు   రాజధానిగా   ఉన్న   చారిత్రక   ప్రదేశం   అయిన   పాత   అమరావతి   ప్రస్తావనతో   నాని  తనప్రసంగాన్ని  మొదలుపెట్టారు .  చంద్రబాబుఆ  అసలు   అమరావతిని   పాడుబెట్టి ,  అక్కడకు  25  కిలోమీటర్లదూరంలో   రాజధానికోసం   తాను   సృష్టించినదే