Skip to main content

గుడివాడలో దొంగనోట్లు పంచింది తెలుగుదేశమంటూ సాక్షి కథనం



గత ఆదివారం గుడివాడలో మున్సిపల్ ఎన్నికలసందర్భంగా ఒకవార్డులో జగన్ పార్టీ నేతలు ఓటర్లకు దొంగనోట్లు పంచారని మీడియా అంతా కోడైకూసిన సంగతి తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియావంటి ఆంగ్ల దినపత్రికలుకూడా వైఎస్ఆర్ సీపీనేతలు ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్నట్లు (http://goo.gl/UqFBNR) వార్తను ఇచ్చాయి. అయితే, సాక్షి మీడియామాత్రం ఈ వార్తను దీనిని 'తనదైన శైలి'లో ఆవిష్కరించింది. గుడివాడలో తెలుగుదేశంనేతలు చెల్లనినోట్లు పంపిణీ చేశారంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో కథనాలు ఇచ్చింది. క్రింది లింక్‌లో ఆ కథనాలను చూడొచ్చు.

http://goo.gl/ogIJM3

ఈ వార్త పూర్వాపరాలలోకి వెళ్తే, గుడివాడ పట్టణంలోని 21వవార్డులో అభ్యర్ధి ఒకరు ఓటుకు రెండువేలరూపాయల చొప్పున డబ్బు పంచారు. నాలుగు ఐదొందలరూపాయల నోట్లుగా ఆ డబ్బును ఇచ్చారు. తీసుకున్న ఓటర్లలో కొందరు వాటిని దుకాణాలలో ఇవ్వబోగా అవి 2005కు పూర్వం ముద్రించినవి కాబట్టి చెల్లబోవంటూ వ్యాపారులు నిరాకరించారు. దీంతో, తాము మోసపోయామని భావించిన సదరు ఓటర్లు లబోదిబోమన్నారు. అయితే తాము తీసుకుంది అక్రమ వ్యవహారంకాబట్టి పోలీసులకు చెప్పలేక తేలుకుట్టిన దొంగల్లాగా కిమ్మనకుండా కూర్చున్నారు. అయితే  మీడియాకు ఎలాగో పొక్కి ఈ విషయం బయటకొచ్చింది. స్థానిక తెలుగుదేశంనేతలు ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ నేతలమీద పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇద్దరు జగన్ పార్టీ నేతలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, తాము పంచింది నకిలీ నోట్లుకాదని, 2005కుపూర్వం ముద్రించినవిమాత్రమేనని సదరు అభ్యర్ధితరపువారు ఓటర్లకు నచ్చచెబుతున్నా ఉపయోగంలేకుండా పోయింది. విషయం పోలీసులదృష్టిలోకెళ్ళిపోయింది. పోలీసులు పంపిణీ జరిగిన నోట్లను సేకరించి విచారణ ప్రారంభించారు.

image courtesy:wikipedia.com

Comments

  1. జగన్‌పార్టీ నేతల కుళ్ళు రాజకీయాలకు కాలం చెల్లేదెప్పటికో. . .దరిద్రమేమంటే ఆ పార్టీ కరపత్రిక సాక్షిని చదివే మూర్ఖులకు ఇక నిజాలు తెలిసే అవకాశమే లేదు. . . నేను టిడిపికి సపోర్ట్‌కాదండి గమనించండి. ఈరోజునుంచి మరో శవ రాజకీయం. . . ఈనాడు చందాదారులుగా ఉన్న ప్రతి ఒక్కరికి సాక్షి పత్రిక మూడు నెలలు ఉచితంగా వేస్తారట. . . ఈ మూడు నెలలు ఉచితంగా కరపత్రాలు (సాక్షి) పంచి ఎన్నికల కమిషన్‌నుంచి తప్పించుకుందామని. సామాన్యుడు పేపర్‌ ఉచితంగా వస్తుందని భావిస్తున్నాడే కానీ, ఉచితంగా పేపర్‌ ఇచ్చి ఎన్ని కోట్లు సంపాదిస్తాడో ఊహించట్లేదు. అసలు ఉచితంగా ఎవ్వరైనా ఎందుకు ఇస్తారు? అప్పనంగా సంపాదించిన సొమ్ము అయితేనే కదా. . సామాన్య ఓటరుకు తెలిసేదెన్నడో. . .

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

గ్రేటర్‌లో జనం గుణపాఠం చెప్పవలసింది కేసీఆర్‌కా, బీజేపీకా?

  రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్‌ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.