Skip to main content

"అయన వస్తున్నాడు" వర్సెస్ "ఆయన వస్తేనే బాగుంటుంది "




గతకొద్దిరోజులుగా న్యూస్ ఛానల్స్ చూస్తున్నవారికి పై రెండు స్లోగన్‌ల గురించి వివరించి చెప్పనవసరంలేదు. చూడనివారికోసం వివరణ - పై రెండు స్లోగన్‌లూ రెండు వేర్వేరు రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార చిత్రాలలోనివి. మొదటిదేమో జగన్ పార్టీది, రెండేదేమో తెలుగుదేశానిది. 

జగన్ పార్టీ ప్రచారచిత్రాలలో  ముందు ఏదో ఒక అక్రమాన్ని చూపిస్తారు. ఆ తర్వాత బాధితులవర్గంలోని ఒక వ్యక్తి లేచి ఇంకెన్నాళ్ళు మీ అక్రమాలు, ఆయనొస్తున్నాడు ఎలుగెత్తి అరుస్తారు. ఇంతలో పెద్ద ఎత్తున గాలి, దుమారం వస్తాయి. ఆ వెంటనే మీసాల రామ్ అన్నయ్య(ఈయన ఈ మధ్యనే సాక్షిలోకి రీఎంట్రీ ఇచ్చారు) తన బేస్ వాయిస్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి అంటూ పిలుపునిస్తారు. థమ్సప్ యాడ్‌లోలా గాలి, దుమారాన్ని చూపటంపై జోకులు బాగా పేలుతున్నాయి...'వచ్చేదెవరూ! వైఎస్ దెయ్యమా?' అని.

ఇక తెలుగుదేశం ప్రచారచిత్రాలలో ముందుగా, పెరిగిపోతున్న ధరలు, కరెంట్ కోత వంటి ఏదో ఒక సమస్యను ప్రస్తావిస్తారు. స్క్రీన్ అంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుందిగానీ, ఎక్కడో ఒక్కచోటమాత్రమే పసుపురంగు కనిపిస్తూఉంటుంది. సమస్యగురించి పాత్రలు మాట్లాడుకున్న తర్వాత ముక్తాయింపుగా "ఆయనున్నప్పుడే బాగుండేది, మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది" అని ఒకరితో చెప్పిస్తారు. ఆ వెంటనే చంద్రబాబు తలకాయ స్లో మోషన్‌లో ఇటువైపుకు తిరుగుతుంది. అయితే క్లోజప్‌లో చూపించటంవల్లనో, ఏమోగానీ చంద్రబాబు ముఖంలో నవ్వు కృతకంగా, కళావిహీనంగా ఉంది. ఈ చిత్రాలను రూపొందించిన దర్శకుడు, నటుడు అల్లరి రవిబాబు, జగన్ పార్టీ ప్రచారచిత్రాలను చూసి పోటీగా అదే థీమ్‌తో తీయటంకాక మరేదైనా కొత్తగా ప్రయత్నించాల్సిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

  1. దీనికి పోటీగా కాంగ్రెస్ వారు "ఏమండీ ఆవిడ వచ్చింది" అంటూ సోనియమ్మను చూపించే ఆడ్ వేస్తారా కొంపతీసి?

    ReplyDelete
  2. ఈ మధ్య బ్లాగుల్లో ఒకడు బయలుదేరాడు . వాడికి హిందుత్వ పిచ్చి ! మామూలు పిచ్చి కానే కాదు . నిన్న మొన్నటిదాకా వాడు బిజెపి గురించి తేగ రాసి మిగాతాపార్టీ లను తిట్టి పారేసేవాడు ( టిడిపి తో సహా ) ఇప్పుడు వాడికి టిడిపి సెక్యులర్ పార్టీ అయి పోయింది .. ఇంతకీ ఇండియాను రక్షించమని అడిగేవాడు చెప్పేదేమిటి అంటే బిజెపి అధికారంలోకి రావాలట .. వారి హిందూ మతతత్వం రాజ్యమేలాలట !! మేమూ హిందువులమే బాబూ

    ReplyDelete
  3. Jai Sreee Ram. Sreerama raksha sarva jagadraksha.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

కమ్మవారిని దెబ్బతీయటానికే రాజధానిని జగన్ మార్చారా?

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు ...

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .