Skip to main content

చ‌ర‌ణ్‌కు తొలి చేదు(నారింజ‌) అనుభ‌వం రుచి చూపించిన భాస్క‌ర్


పాపం చ‌ర‌ణ్‌...చిరుత, మ‌గ‌ధీరవంటి విజయాల త‌ర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచించి...చించీ...చించీ(ఆరెంజ్‌కు ముందు చ‌ర‌ణ్ ఎంతో మ‌థ‌న‌ప‌డ్డాడ‌ని  చిరంజీవి ఆ ఆడియో విడుద‌ల ఫంక్ష‌న్‌లో చెప్పారు) మూడోసినిమాకు - ప్రేమ‌క‌థ‌ను, ద‌ర్శ‌కుడిగా భాస్క‌ర్‌ను ఎంచుకుంటూ అతను తీసుకున్న నిర్ణయం మిస్‌ఫైర్ అవ్వ‌డం విచార‌క‌రం. అయితే దీనిలో చ‌ర‌ణ్ త‌ప్పేమీ లేద‌ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక‌టే ఇమేజ్‌లో ఇమిడిపోకుండా వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాలు చేస్తూ అటు మాస్‌ను, ఇటు క్లాస్‌ను మెప్పించాల‌నుకోవ‌డం మంచి ఆలోచ‌నే. కానీ అత‌ని ఆలోచ‌న‌ను ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ స‌రిగా execute చేయ‌లేక‌పోయాడు.

క‌థ‌లో, క్యారెక్ట‌రైజేష‌న్‌లో లోపాల వ‌ల‌న సినిమా అటు క్లాస్‌నుగానీ, ఇటు మాస్‌నుగానీ ఆక‌ట్టుకోలేక‌పోతోంద‌ని విమ‌ర్శ‌కులంద‌రూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు. క‌థ‌కు మంచి పాయింటునే తీసుక‌న్న భాస్క‌ర్, దానిపై ఇంకా బాగా క‌స‌ర‌త్తు చేసి, ఆ త‌ర్వాత‌ సినిమా రూపొందిస్తే బాగుండేది. తీసుకున్న పాయింటును జ‌స్టిఫై చేసే సీన్లు లేవ‌ని అంద‌రూ అంటున్నారు. మ‌రీ క్లాస్‌గా, ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో ఉంచుకుని తీసే బాలీవుడ్ ల‌వ్‌స్టోరీలాగా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. పైగా భాస్కర్ అనవసరఖర్చు పెట్టించి బడ్జెట్ విపరీతంగా పెంచాడని కూడా వార్తలొచ్చాయి. దానికితోడు... నాగబాబు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా చేశారో, లేక రిలీజ్ ప‌నుల్లోబ‌డి నిర్ల‌క్ష్యం చేశారోగానీ, ఈ సినిమా ప్ర‌చారం అంతా ఒక low key affair లాగా న‌డిచింది. జ‌ల్సాలాగా, మ‌గ‌ధీర‌లాగా హైప్ క్రియేట్ అవ్వ‌లేదు. దాంతో ఓపెనింగ్స్ కూడా పెద్ద‌గాలేవు. నేను ఇంతకుముందొక పోస్టులో అనుమానించినట్లే(ముందే  చెప్పిన ....టీవీ అని అన్ని ఛానల్స్ వాళ్ళూ స్క్రోలింగ్ వేసుకున్నట్లా...హ్హహ్హ..హ్హా) జెనీలియా ముఖం exhaust అయిపోయినట్లు కనబడిందని అంటున్నారు.

ఈ సినిమాలో విమ‌ర్శ‌కులంద‌రూ కామ‌న్‌గా చెబుతున్న మ‌రో పాయింట్ చ‌ర‌ణ్ లుక్స్‌, అతని యాక్ష‌న్. ఈ రెండూ బాగున్నాయ‌ని అంటున్నారు. అంటే న‌టుడుగా అత‌ను విఫ‌ల‌మ‌వ్వ‌లేద‌న్న‌మాట‌. ఫెయిల‌యింద‌ల్లా ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ మాత్ర‌మేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. టాలీవుడ్‌లో మోస్ట్ హంబుల్, మోడెస్ట్  యంగ్‌హీరోగా అన్నివ‌ర్గాల‌నుంచి మంచిపేరు తెచ్చుకున్న చ‌ర‌ణ్‌కు, త‌ర్వాత సినిమా అయినా మంచి ఫ‌లితాన్నివ్వాల‌ని ఆశిద్దాం.

p.s.:ఈ పోస్టు రాత్రే రాసినా, వ్యతిరేక ప్రచారం చేస్తున్నానని మెగా అభిమానుల కోపం మూటగట్టుకున్నట్లవుతుందేమోననే ఆలోచన వచ్చి ఆపాను. అయితే పరమ వీరాభిమాని a2zగారే (నో ఫీల్ మూవీ అని)పెదవి విరిచిన తర్వాత ఇక మనదేముంది అని ఈ ఉదయం పబ్లిష్ చేసేశాను.



Comments

  1. తెలంగాణలో తుమ్మాలన్నా కేసీఆర్ అనుమతి అవసరమైనట్లు, బ్లాగుల్లో రామచరణ్ సినిమా బాలేదనాలంటే ఏటూజీ గారి పర్మిషన్ అవసరమన్నమాట. బాగుంది బాగుంది :-)

    ReplyDelete
  2. అబ్రకదబ్రగారూ, తెలుగోడులో మీ పోస్టులు చాలా చదివాను. felt nice. మీరు ఇటీవల ఎక్కువ రాయడంలేదు...? నా బ్లాగును సందర్శించినందుకు ధన్యవాదాలు. స్పందనలు తెలియజేస్తూ ఉండగలరు. అన్నట్లు, తెలుగోడు పేరుమీద ఈమధ్య ఎవరో మరొకరు రాస్తున్నట్లున్నారు. కొద్దిగా confusionగా ఉంది.

    శుభాభినందనలతో
    ప్రజ్ఞ‌

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

కమ్మవారిని దెబ్బతీయటానికే రాజధానిని జగన్ మార్చారా?

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు ...

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .