Skip to main content

జగన్ దారి...పెడదారా?

2004లో...కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ళ‌లో ముఖ్యమంత్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డిని...మావోయిస్టుల ప‌ట్ల మీ వైఖ‌రి ఎలా ఉండ‌బోతోంద‌ని మీడియావారు అడిగితే – సిసలైన క్రైస్తవుడిలాగానే ఆయన బైబిల్ లోని ఓ కథను ఉటంకిస్తూ, వాళ్ళు 'ప్రోడిగ‌ల్ స‌న్స్'(పెడదోవ ప‌ట్టిన పిల్ల‌లు) అని అన్నారు. మావోయిస్టుల సంగ‌తేమిటోగానీ, సాక్షాత్తూ ఆయ‌న‌ కుమారుడే ప్రోడిగ‌ల్ స‌న్‌ అయ్యాడనే అభిప్రాయం కలుగుతోంది. తండ్రి చనిపోయిననాటినుంచీ జగన్ వ్యవహారశైలిని గమనిస్తే అది సవ్యంగా ఉందని అనిపించడంలేదు. మరి అతని స్వభావమే అంతో, లేక చెప్పుడుమాటలు వింటున్నాడో తెలియదుగానీ తప్పుదోవ పట్టాడనిపిస్తోంది. ఇప్పుడు రాజీనామా చేయడంవలన పార్టీకి ఎంతోకొంత నష్టం చేయగలడు....కానీ, అతనికి ఒరిగేదేమిటి? గరిష్ఠంగా... అయితే గియితే - ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతాడు. కానీ అతనేం బావుకుంటాడు...? అతనికి సొంతపార్టీ పెట్టి నడిపేటంత సామర్ధ్యముందా...?(అర్ధబలముందిగానీ...దిశానిర్దేశం చేసేటంత అనుభవజ్ఞులు, రాజనీతిజ్ఞులు, వ్యూహకర్తలెవరూ అతనిపక్కన కనిపించడంలేదు). ఇంత జరిగాక కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఊరుకుంటాయా...? భారత రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరగని స్థాయిలో జగన్ చేసిన అవినీతిని బయటకు తీయవా...?

తండ్రిపోయిన వెంటనే సీఎమ్ పదవికి తయారైపోయిన జగన్...అక్కడ తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు కాకమునుపే శవరాజకీయం ప్రారంభించాడు. సీఎమ్ పీఠానికి పావులు కదపడం మొదలుపెట్టాడు. సంతకాల సేకరణ, పీఆర్పీ మద్దతుకోసం ప్రయత్నాలు...వంటి చర్యలు జగన్ ప్రమేయంలేకుండా జరుగుతాయని అనుకోలేము. ఇతని దుందుడుకు స్వభావం, అవినీతి గురించి అప్పటికే తెలుసుకునిఉన్న అధిష్టానం కుర్చీని రోశయ్యకు అప్పగించడంతో... తనకేదో అన్యాయం జరిగిపోయినట్లు భావించసాగాడు. పైగా తండ్రి ఆశయసాధనకోసం ఆయన నిర్వహించిన పదవిని తాను ఆశించడం తప్పా అని ఎదురు ప్రశ్నించడం పరాకాష్ఠ.(జగన్ లెక్క ప్రకారం...డాక్టర్ కొడుకు ఏమీ చదవకపోయినా డాక్టర్‌న‌వడానికి తనకు అర్హత ఉందని అనొచ్చేమో).  హైకమాండ్ వద్దని చెబుతున్నా, తెలంగాణాలో ప్రతికూల పరిస్థితులున్నా ఓదార్పు యాత్ర నిర్వహించడానికి బయటకు ఎన్ని కారణాలు(తన తండ్రి మరణవార్తతో తల్లడిల్లి చనిపోయినవారిని ఓదార్చాల్సిన అవసరం తనకుందని...మాటిచ్చాను కాబట్టి మడమ తిప్పనని...వగైరా) చెబుతున్నా, లోపలి ఎజెండా మాత్రం సొంతపార్టీ స్థాపనే. విపరీతంగా డబ్బుకుమ్మరించి, జనాన్ని సేకరించి, జరిపిన ఆ ఓదార్పుయాత్ర అత్తా-కోడళ్ళ టీవీ సీరియల్‌లాగా సాగి...సాగి... జగన్ ఏడుపుముఖాన్ని మీడియాలో చూడడానికి తెలుగుప్రజలకు విసుగొచ్చేటంతగా సాగింది. మొదట్లో ఆ యాత్రను లైవ్ ఇవ్వడానికి అన్నీ ఛానళ్ళూ పోటీపడగా...చివర చివరికి ఎవరూ పట్టించుకోని స్టేజికి చేరుకుంది.(నిజంగా బాధితులకు సాయం చేయాలనిపిస్తే... వారినందరినీ హైదరాబాద్ పిలిపించుకుని సాయమందించకూడదా). అటు - వెనకున్న ఎమ్మెల్యేల సంఖ్యకూడా 150నుంచి 15కు చేరుకుంది. అయినా అయ్యగారికి రాజకీయం తెలిసిరాలేదు.

2004వ‌ర‌కు జ‌గ‌న్ గురించి బ‌య‌ట‌కు తెలిసింద‌ల్లా...అత‌నేదో ప‌వ‌ర్ ప్లాంట్ న‌డుపుకుంటూ బెంగుళూరులో ఉంటాడ‌ని మాత్ర‌మే. తండ్రి అధికారంలోకి వ‌చ్చిన‌ త‌ర్వాత అత‌ను ఒక్క‌సారిగా క్రియాశీలంగా మారాడు.  అయ్య‌గారి ప్రోడిగ‌ల్ స‌న్ ల‌క్ష‌ణం మొద‌ట బయటకు క‌నిపించింది క‌డ‌ప ఎంపీగా ఉన్న బాబాయి వివేకానంద‌రెడ్డితో రాజీనామా చేయించిన‌పుడు(2005లో అనుకుంటా...). వివేకాను రాజీనామా చేయించి ఆ స్థానంనుంచి తాను పోటీ చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నాడు. జ‌గ‌న్ ఒత్తిడితో రాజీనామాచేయ‌డానికి వివేకా కూడా సిద్ధ‌ప‌డ్డారు. అయితే విష‌యం తెలుసుకున్న‌ సోనియా పిలిచి మంద‌లించ‌డంతో జ‌గ‌న్ శాంతించాడు. అసలు వైఎస్ బతికుంటే...కొన్నాళ్ళు పోయాక, ఔరంగజేబులాగా ఇక చాల్లే పక్కన కూర్చోమని తండ్రిని పక్కనబెట్టి కుర్చీని ఆక్రమించడమో, సంజయ్ గాంధిలాగా రాజ్యాంగేతరశక్తిగా మారడమో జరిగేదని కాంగ్రెస్ నాయకులే కొందరు చెబుతారు.

ఇక ఆ తర్వాత అయ్యగారు వ్యాపారంపైనే పూర్తిస్థాయిలో దృష్టి నిలిపారు. అయితే వ్యాపారాలలో, సంపాదనలోమాత్రం జగన్ ఎంతో పరిణతి ప్రదర్శించడమే కాదు కొత్తపుంతలు తొక్కాడని చెప్పాలి. ర‌క‌రకాల వ్యాపారాల‌లోకి దిగిపోయి విజ‌య‌వంతంగా వాటిని ఒక‌రేంజికి తీసుకువెళ్ళారు.(రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా....!). తండ్రి పలుకుబడిని అతను ఉపయోగించుకున్నట్లు దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకూ ఉపయోగించుకోలేదేమో. 2004కుముందు వైఎస్ కుటుంబం కారు ఖర్చులకు కూడా కేవీపీమీద ఆధారపడే స్థితిలో ఉండగా, 2010నాటికి జగన్ దేశంలోనే అత్యంత అధికంగా ఆదాయపుపన్ను కట్టేస్థాయికి చేరుకున్నాడు. మొద‌ట క‌డ‌ప‌జిల్లాలో సిక్ ఇండ‌స్ట్రీగా ఉన్న ర‌ఘురామ్ సిమెంట్స్‌ను జ‌గ‌న్ టేకోవ‌ర్ చేశారు. దానికి భార‌తి(జ‌గ‌న్ భార్య పేరు భార‌తి) సిమెంట్స్ అని పేరుపెట్టారు. ఆ ఫ్యాక్ట‌రీకి రాష్ట్ర‌ప్ర‌భుత్వం 2007లో 487 ఎక‌రాల భూమిని నామ‌మాత్ర‌పుధ‌ర‌కు కేటాయించింది.(దీనిపై పెద్ద వివాదం కూడా చెల‌రేగింది.)  ఇక ఆ ఫ్యాక్ట‌రీకి నిధుల సేక‌ర‌ణ ఓ పెద్ద ప్ర‌హ‌స‌నం. ప్ర‌పంచంలోనే సిమెంటు ప‌రిశ్ర‌మ‌కు ఆద్యురాలైన ఓ విదేశీకంపెనీతో స‌హా ప‌లు సంస్థ‌లు భార‌తి సిమెంట్స్‌లో పెట్టుబ‌డులు పెట్టాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వంతో ప‌నులు చేయించుకోడానికి వివిధ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలు, ఇండస్ట్రీల అధినేత‌లు ఈ పెట్టుబ‌డులు పెట్టార‌ని రాజ‌కీయావ‌ర్గాలు కోడై కూశాయి. ఉదా.కు...ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల‌లో వాన్‌పిక్ పేరుతో పారిశ్రామిక‌వాడ‌ను పెట్ట‌డానికి రాష్ట్ర‌ప్ర‌భుత్వంనుంచి అనుమ‌తి పొందిన నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్(ఒక‌నాటి మ్యాట్రిక్స్ ఫార్మా అధినేత)  ర‌ఘురామ్ సిమెంట్స్‌లోనూ, జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్‌లోనూ కోట్ల‌రూపాయ‌ల పెట్టుబ‌డులు పెట్టారు. అయితే ఈ వ్యాపారాలకు, సంపాదనకు  రూప‌క‌ల్ప‌నచేసి, విజ‌య‌వంతంగా అమ‌లు చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ ఆడిటర్‌దేన‌ని(విజ‌య‌సాయిరెడ్డి అనుకుంటా...ఆయ‌న‌పేరు) చెప్పుకోవాలి. ఇక రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిన అనేక సెజ్‌ల‌లో జగన్‌కు ఎంతోకొంత(కొన్నింటిలో అయితే 50శాతం) వాటా ముట్టిందని చెబుతారు. ముఖ్యంగా బ్రహ్మణి, ఇందూ ఇన్‌ఫ్రా, రహేజా వంటి సంస్థల సెజ్‌ల‌లో... ఇక హైదరాబాద్ నగరంలో, రంగారెడ్డి జిల్లాలోని ఐటీ కారిడార్‌లో, బెంగళూరు నగరంలో లెక్కలేనన్ని స్థలాలు బినామీ పేర్లతో కొన్నారని సమాచారం. వైఎస్ రెండోసారికూడా పూర్తికాలం పదవిలో కొనసాగితే ఆయన కుటుంబం దేశంలోనే అత్యంత సంపన్న పదికుటుంబాలలో ఒకటిగా నిలిచేదని ఓ అంచనా. జగన్ వ్య‌వ‌హారాల గురించి విని...ఈ విధంగా కూడా సంపాదించొచ్చా అని ఢిల్లీలో బ‌డాబ‌డా రాజ‌కీయ‌నేత‌లే ముక్కున వేలేసుకున్నారంటారు.(తండ్రి సీఎమ్ అయితేనే ఇన్నివేలకోట్లు సంపాదిస్తే ఇక అయ్యగారే సీఎమ్ అయితే రాష్ట్రాన్నిగంపగుత్తగా అమ్మేసేవాడేమో)

నువ్వు ఇంద్రుడివి...చంద్రుడివి, తలుచుకుంటే చింపేస్తావు, పొడిచేస్తావు అంటూ పొగిడే వందిమాగధుల మాటలతో  తనను గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడమే జగన్ ప్రధానలోపం. అసలు అతను తనకెంతబలం ఉందనుకుంటున్నాడో అర్ధంకావడంలేదు.(వైఎస్‌కే రెండోసారి బొటాబొటి మెజారిటీ వచ్చింది. ఆయన మృతి తర్వాత జరిగిన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ ప్రచారం చేసినచోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది. ఇక సమైక్యవాదినని ప్రకటించుకున్న జగ‌న్‌కు తెలంగాణాలో ఓట్లు పడే సమస్యేలేదు). అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే పెద్ద జాతినేతలాగా ఫీలవుతున్నట్లుగా అనిపిస్తోంది. వందిమాగధులను పక్కనపెట్టి మంచి రాజనీతిజ్ఞుల సలహాలకనుగుణంగా నడుచుకుంటే జగన్‌కు మంచి రాజకీయభవిష్యత్తు ఉంటుంది.(వదరుబోతు గోనే ప్రకాశరావు, సొంతనియోజకవర్గంలో పైసా విలువచేయని మైకాసురుడు అంబటి రాంబాబు, అమ్మలక్కలస్థాయి నాయకురాలు కొండా సురేఖలను ఎంతదూరం ఉంచితే అంతమంచిది).  కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంకంటే మునుపు తన తండ్రి చేసినట్లు పార్టీలోనే ఉండి పోరాడితే బాగుండేది. ఏదిఏమైనా ప్రస్తుతానికి అతను రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించడంలో మాత్రం సఫలీకృతం అయ్యాడు. మరి ఆ ప్రకంపనలు ఎటు దారితీస్తాయో చూడాలి.

Comments

  1. Andhra Pradesh is heading towards the model adopted by either Maharastra, TN or Bihar.

    Maharastra model is better for Congress. TN model is also ok. But Bihar model wipe it out.

    Opposition (KCR, Chiru, Babu) may exploit this situation.

    ReplyDelete
  2. అన్నా, నువ్వు వోటేస్తావ?
    నువ్ రాసింది చదివే వాల్లలో ఎంత మంది వోటేస్తారు?
    అసలు వోటేసే జనాల్లో ఎంతమంది నీతో ఏకీభవిస్తారు?

    ఇవ్వన్నీ నువ్వు ఆలోచిస్తే, జగన్ కి వొరిగేదేమిటో అర్థమవుతుంది.

    Losing Jagan is a historical blunder for Congress.

    http://vivaadavanam.blogspot.com/

    ReplyDelete
  3. ఇది అర్థరహితంగా వుంది. ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ చెప్పాడు? లేదే? తనతోపాటు రాజీనామా చేస్తానన్న కొద్దిమందిని కూడా వద్దని వారించాడు. తన తండ్రి కష్టార్జితంతో ఏర్పటైన ప్రభుత్వాన్ని పడగొట్టాడన్న అపకీర్తిని మూటగట్టుకోలేనని తన సన్నిహితులకు చెప్పినట్లు వారు బహిరంగంగానే చెబుతున్నారు. ఇదే తరహాలో మీ వ్యాసంలో చాలా అర్థరహిత, అవగాహనా రాహిత్య వ్యాఖ్యలున్నాయి.

    ReplyDelete
  4. i agree with that "vivaadavanam" comment


    జగన్ వ్యూహం సింపుల్ ....పులివెందుల నుంచి గెలిచి.....అసెంబ్లీ లొ అడుగు పెట్టగానె...అవిశ్వాస తీర్మానం పెడతాడు...అప్పటికి మందిని పోగు చేసుకుంటె చాలు.....

    ReplyDelete
  5. ఆ పిచ్చోడెనకాల ఇంత మంది పిచ్చోళ్ళుండటమే ఆశ్చర్యంగా ఉంది..!
    అయితే కాలం గడిచేకొలదీ ఈ పిచ్చోళ్ళ సంఖ్య తగ్గుతుందని ఆశిద్దాం..!!

    ReplyDelete
  6. తన తండ్రి కష్టార్జితంతో ఏర్పటైన ప్రభుత్వాన్ని పడగొట్టాడన్న అపకీర్తిని మూటగట్టుకోలేనని తన సన్నిహితులకు చెప్పినట్లు వారు బహిరంగంగానే చెబుతున్నారు.
    ________________________________

    బాబూ, S మరీ అంత ఐస్ ఐపోమాక

    వాడు మరీ అంత గొప్పోడేమీ కాదు. అంబటి రాంబాబు మంచి మీడియా క్యాంపైన్ తో జగన్ కి సింపతీ & ఇమేజ్ పెంచుతున్నాడు.

    Wait for midterm polls..



    @@ ఆ పిచ్చోడెనకాల ఇంత మంది పిచ్చోళ్ళుండటమే ఆశ్చర్యంగా ఉంది..!

    గురు, wakeup to reality.

    http://vivaadavanam.blogspot.com/

    ReplyDelete
  7. good analysis and @S, "ఇదే తరహాలో మీ వ్యాసంలో చాలా అర్థరహిత, అవగాహనా రాహిత్య వ్యాఖ్యలున్నాయి." Can you elobarate?

    ReplyDelete
  8. // కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంకంటే మునుపు తన తండ్రి చేసినట్లు పార్టీలోనే ఉండి పోరాడితే బాగుండేది. //

    అంటే సోనియమ్మ చేతులారా సస్పెండ్ అయ్యుంటే శ్రేష్ఠమని మీ ఉద్దేశం

    ReplyDelete
  9. http://www.indianexpress.com/news/suppose-your-boss-wants-to-fire-you-what-will-you-do-jagan/728348/0

    ReplyDelete
  10. jagan di tondara paatu tanam fudel mentality
    tanaki minchina ahankaaram atuvanti vaadu neta ayite antakanna dourbhaagyam ledu ap ki

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.