Skip to main content

అమెరికా ఆధిపత్యం తగ్గిందని అంగీకరించిన ఒబామా...భారత్ వరల్డ్ పవర్ గా ఎదిగిందని ప్రశంశలు


ఒకనాడు ద్విథృవంగా(అమెరికా, రష్యా)ఉన్న ప్రపంచం, సోవియట్ రష్యా(యూఎస్ఎస్ఆర్) పతనం పుణ్యమా అని ఏకధృవప్రపంచమైపోవడంతో పెద్దన్నపాత్ర తీసుకున్న అమెరికా...గత 30ఏళ్ళుగా చేస్తూవస్తున్న కర్రపెత్తనానికి కాలం చెల్లే పరిస్థితి దగ్గరకు వచ్చినట్లేఉంది. అమెరికా ఆధిపత్యం సడలిందని ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించారు. అఫ్ కోర్స్...ఆయన చెప్పింది ఆర్ధికపరంగా అనుకోండి.(డబ్బు లేకపోతే ఎవరు లెక్క చేస్తారు?) భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు అనూహ్యరీతిలో ఎదుగుతుండటం తమ ఆర్ధికవ్యవస్థకు సవాలుగా మారిందని ఒబామా నిన్న ముంబాయిలో చెప్పారు. అయితే ఆ దేశాలకు గట్టిపోటీనిస్తామని గాంభీర్యం ప్రదర్శించారు. భారత్ కు హైటెక్ ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంపై తనకు, తన ప్రజలకు సర్ది చెప్పుకున్నారు. వాణిజ్యమంటే ఒక్కవైపునుంచే జరగదని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని అన్నారు. మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అమెరికా ప్రజలకు ఆయన ఈ వివరణ ఇచ్చుకున్నట్లు కనబడుతోంది.

భారత్ ఎదుగుతున్న శక్తి కాదని, ఇప్పుడది అంతర్జాతీయశక్తి అని ఒబామా అన్నారు. ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ను సందర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ తో స్నేహసంబంధాలను మరింత పటిష్ఠం చేసుకోవడంకోసమే తానీ యాత్రను చేపట్టినట్లు చెప్పారు. పాకిస్తాన్ గురించి మాత్రం ఒబామా ఆచితూచి మాట్లాడారు. మొన్న ముంబాయిదాడుల మృతులకు నివాళులర్పించే సమయంలో కూడా ఆ దాడుల్లో పాకిస్తాన్ తీవ్రవాదుల పాత్రను ఒబామా ప్రస్తావించలేదు. నిన్న కూడా సెయింట్ జేవియర్స్ కళాశాలలో ఓ విద్యార్ధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... పాకిస్తాన్ ఆసియాలో ఓ కీలక దేశమని, దాని ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని అన్నారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదశక్తులు ఉన్నమాట నిజమేనని, అలాంటివి అన్ని దేశాల్లో ఉన్నాయని చెప్పారు. అయితే తీవ్రవాదంపై పాకిస్తాన్ ప్రభుత్వం పోరు ఆశించిన స్థాయిలో లేనిమాట నిజమేనని అన్నారు. పాకిస్తాన్ బాగుంటేనే భారత్ కు మంచిదని, ఇరుదేశాలూ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

ఏది ఏమైనా ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా దాడులు, కుంభకోణాలు, ఆర్ధికవ్యవస్థ పతనం, నిరుద్యోగం వంటి వరుసదెబ్బలతో కుదేలైపోతున్న అమెరికా పరిస్థితి క్రమక్రమేణా దిగజారి, ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్న బ్రిటన్...ఎలాగైతే మామూలు దేశంగా మారిపోయిందో అమెరికా కూడా అలాగే మారే పరిస్థితి దగ్గర్లేనో ఉందని అనిపిస్తోంది.

Comments

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.