Skip to main content

రామోజీ రావ్...మాటలు జాగ్రత్త!

 ఈనాడులో ఇవాళ "మాటలు జాగ్రత్త!" శీర్షికతో వచ్చిన వార్తలో తప్పులు చిత్తగించండి. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ప్రతిరోజూ సుమారు 5,000 ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయి(రహస్యంగా వింటున్నాయి) అన్నది ఒక వార్త. దానిపై ఈనాడు మెయిన్ ఎడిషన్ మూడో పేజిలో "మాటలు జాగ్రత్త" అనే శీర్షికతో ఇచ్చిన వార్తలో... 'ట్యాపింగ్‌'కు బదులుగా 'ట్యాంపరింగ్' అని వచ్చింది. పోనీ ఏదో ఒకచోట అయితే...ఏదో పొరపాటున, అజాగ్రత్తవలన న్యూస్ డెస్క్ వారు చూసి ఉండకపపోవచ్చు అని అనుకోవచ్చు. హెడ్డింగ్‌లో ఒకసారి, కింది వార్తలో నాలుగుసార్లు 'ట్యాంపరింగ్' అనే మాట ప్రచురితమయింది.

ఆవార్తను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి http://www.eenadu.net/story.asp?qry1=19&reccount=23

అంటే ట్యాపింగ్‌కు, ట్యాంపరింగ్‌కు తేడా తెలియని సబ్ ఎడిటర్ ఈ వార్తను రాశాడన్న మాట. సరే...మరి ఆ వార్తను సరిదిద్దిన డెస్క్ ఇన్ ఛార్జి అనే శాల్తీ ఏం చేస్తున్నట్లో? ట్యాంపరింగ్ అంటే ఫలితాన్ని తారుమారు చేయడం...ఆటోమీటర్లను ట్యాంపరింగ్ చేస్తారు, ఈవీఎమ్ లను ట్యాంపరింగ్ చేస్తారు. టెలిఫోన్లను ట్యాంపరింగ్ చేయడమంటే బిల్లులను తారుమారు చేయడమో లేక బిల్లు అసలు రాకపోవడమో చేసినట్లు. సబ్ ఎడిటర్ అంటే దాదాపుగా ఏ విషయం మీదైనా కొద్దోగొప్పో పరిజ్ఞానం ఉన్నవాడయినా అయిఉండాలి. లేకపోతే తనకు తెలియని విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించి వార్తను సవివరంగా ఇవ్వగలిగినవాడయినా ఉండాలి. ఈరెండూ లేని సబ్ ఎడిటర్, డెస్క్ ఇన్ ఛార్జి అక్కడ ఉన్నట్లు అర్ధమవుతోంది. అసలు ఝలక్ ఏమిటంటే...ఈవార్తకు పెట్టిన శీర్షిక...ఈనాడు సంపాదకవర్గానికి, యాజమాన్యానికే(రెండూ ఒకటేలెండి...ఎడిటర్, పబ్లిషర్ రామోజీయే) వర్తించడం.

మరోవైపు ఇవాళ సాక్షి హైదరాబాద్ జిల్లా ఎడిషన్లో మేయర్ కార్తీకరెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి ఒక ఫోటో వార్త  ఇచ్చారు. దాని ఫోటో రైటప్ లో Indianapolis నగరం గురించి రాస్తూ 'ఇండియానాపొలిస్'కు బదులుగా 'ఇండియానా పోలీసు' అని రాశారు. ఆ నగరం ఇండియానా అనే రాష్ట్రానికి రాజధాని. తెలియని వాళ్ళు అది చదివి ఇండియానా రాష్ట్ర పోలీసులని అనుకునే ప్రమాదముంది. పైగా కొసమెరుపేమిటంటే...ఆ ఫోటోలో మేయర్ తదితరుల వెనక కనిపిస్తున్న బ్యానర్లో  ఇండియానపొలిస్ అని స్పష్టంగా తెలుగులో రాసిఉంది. అది చూసినా ఆ పేరును ఎలా రాయాలో అర్ధమై ఉండేది. ఆ ఫోటోను చూడాలంటే ఈ లింక్‌కు వెళ్ళండి. http://epaper.sakshi.com/apnews/City-Hyderabad/23112010/12

Comments

  1. Junior Editing staff suppose to correct these errors. But they were paid low wages, demand more work from them, so the news quality is low.

    It may be copy/paste errors also, or typing errors by the data entry people.

    I agree that they should spend more time on quality of the news.

    ReplyDelete
  2. @అనానిమస్ గారూ,
    ఆ వార్తను, తప్పులను కరెక్ట్ చేయాల్సింది జూనియర్ ఎడిటింగ్ స్టాఫ్ కాదు...సీనియర్లు. డెస్క్ లో సెటప్ ఎలా ఉంటుందంటే...సబ్ ఎడిటర్ రాసిన వార్తను షిఫ్ట్ లేదా డెస్క్ ఇన్ ఛార్జి సరిదిద్దుతారు. తర్వాత సీనియర్ డెస్క్ ఇన్ ఛార్జి కూడా పేజీలవారీగా వార్తలు చూసేటపుడు ప్రతి వార్తనూ పరిశీలించాలి. గతంలో అయితే పూర్తి అయిన ప్రతిపేజీని డెస్క్ లో డ్యూటీలో ఉన్న ప్రతివారూ చదవాలని కొన్ని పేపర్లలో నియమాన్ని పాటించేవారు...తప్పులను నివారించడానికి. ఇంకో విషయమేమిటంటే ఇంతకుమునుపు సబ్ ఎడిటర్లు రాసిన వార్తలను కంపోజ్ చేయడానికి వేరే స్టాఫ్(టీపీ ఆపరేటర్లు) ఉండేవారు. అయితే ఇప్పుడు ప్రతి సబ్ ఎడిటర్ కూ విధిగా కంపోజింగ్ కూడా వచ్చి ఉండాలి. కాబట్టి, డేటా ఎంట్రీ మనుషులేమీ అక్కడ ఉండరు...కాపీ, పేస్టుకు కూడా అవకాశంలేదు.

    ReplyDelete
  3. 'ఇండియానాపోలిస్'కు బదులుగా 'ఇండియానా పోలీసు'
    ___________________________________
    Wow, this is creativity!

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. http://vivaadavanam.blogspot.com/

    ReplyDelete
  7. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. ఇంకా దేశం పేరు ఎలా రాస్తే మీకేం
    ________________________

    అక్కడ రాసింది దేశం పేరు కాదు - ఊరిపేరు. ఇండియాకీ ఇండియానాపొలిస్ కీ చాలా తేడా ఉంది :))

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.