Skip to main content

అమెరికా ఉత్పత్తుల అమ్మకాలను పెంచడం కోసమే భారత పర్యటన:కుండ బద్దలు కొట్టిన ఒబామా

చరిత్రాత్మక భారత పర్యటన వెనకున్న అసలు లక్ష్యమేమిటో ఒబామా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ముంబాయికి బయలుదేరేముందు వైట్ హౌస్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో తన పర్యటన పరమార్ధాన్ని ఆయన స్వయంగా వివరించారు. భారత్ మార్కెట్ లో అమెరికా ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచడంపైనే తాను ఈ పర్యటనలో దృష్టి కేంద్రీకరించబోతున్నానని, పలు కార్పొరేట్ ఒప్పందాలు చేసుకోబోతున్నానని తెలిపారు. రాబోయే ఐదేళ్ళలో అమెరికా ఎగుమతులను రెట్టింపు చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అమెరికాలో ఉద్యోగం కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లభించేదాకా తాను సంతృప్తి చెందబోనని తెలిపారు. అమెరికా ఉత్పత్తులకు మార్కెట్ పెరిగితే దేశంలో ఉపాధి దానంతట అదే పెరుగుతుందని, తద్వారా నిరుద్యోగం తగ్గిపోతుందని వివరించారు.

అసలు విషయమేమిటంటే మార్పు నినాదంతో అమెరికా గద్దనెక్కిన ఒబామా అక్కడి ప్రజలకు ఎలాంటి మార్పూ చేసి చూపలేకపోయారు. దానికి తోడు ఆర్ధిక వ్యవస్థను కూడా ఏమాత్రం కోలుకునేటట్లు చేయలేకపోయారు...నిరుద్యోగ సమస్యనూ తగ్గించలేకపోయారు. దీనితో ఆయనకు ప్రజాదరణ క్రమక్రమంగా తగ్గుతూ వస్తూ నిన్నటి మధ్యంతర ఎన్నికలనాటికి తీవ్రంగా దిగజారిపోయింది.(ఈ ఎన్నికల ఫలితాలలో దిగువసభ - హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ లో ప్రత్యర్ధి పార్టీ రిపబ్లికన్స్ పూర్తిగా ఆధిపత్యం సాధించారు. సెనేట్ లో మాత్రం డెమోక్రాట్స్ కు కొద్దిగా మెజారిటీ ఉంది) ప్రజలలో తిరిగి పేరు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న ఒబామా కొద్దినెలలుగా ఉపాధి అవకాశాలను పెంచడంపై హామీలు గుప్పిస్తున్నారు. అందుకే శరవేగంగా పెరుగుతున్న ఆసిమా మార్కెట్ లపై...ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద కన్స్యూమర్ మార్కెట్ అయిన భారత్ పై ప్రేమ కురిపిస్తూ స్నేహహస్తాలు చాపుతున్నారు. భారత్ నుంచి ఆయన ఇండోనేషియా,దక్షిణ కొరియా, జపాన్ వెళ్ళేదీ...అక్కడ కూడా సేల్స్ మ్యాన్ పాత్ర పోషించడానికే.

Comments

  1. ఎటకారంకాపోతే, మరెందుకొత్తాడండే

    ReplyDelete
  2. Do you think he loves INDIA,
    He is against "out sourcing". not only he ruined our job prospects in US he is after our outsourced jobs in India too.
    It is a shame the congi govt. is spreading red carpet to him and they are going to give him our pride and resouces in a platter.
    shame on MM Singh and Sonia, one was born in Pakistan and another in Italy.

    ReplyDelete
  3. ప్రజ్ఞ

    @మొదటి అనానిమస్: మరేనండి...అదే నేనూ అంటున్నానండి.

    @రెండవ అనానిమస్: No, I don't think he loves India.

    ReplyDelete
  4. @2nd Anon:

    Whether we like it or not, he is the president of the most powerful nation in the world today and we have to remember that. We have invited him to come to India, not that he is so keen in coming over here ;) and hence we need to show our hospitality, right :)

    We need to understand a bit better about the balance of trade and economic imbalances. No country will sacrifice their own economic interests on their own unless there is no otherway ;)

    Being a "Son of this soil", what you have done so far that outshines MM Singh's contributions towards economic liberalization of India. Just stop ranting ;)

    ReplyDelete
  5. ఏడ్చినట్టుంది. ఎప్పుడూ ముష్టాళ్ళలా అమెరికా అద్య్క్షుడు ఏమి తెస్తాడా అని ఎదురు చూడటమేనా?! సిగ్గులేదు? ఇలాంటి ఐడియా రావడమే దివాళాకోరు తనం.
    సత్తాధారి కాంగ్రెస్ మనకు ఏంచేస్తున్నారో ఎప్పుడైనా నిలదీశారా? కల్మాడి, విలాసరావ్, యైఎసార్ లనుంచి సోనియా ఎంత దండుకుందో ఎవడైనా అడిగారా?

    ReplyDelete
  6. ఏం, మీకొక కోటి రూపాయలు నొక్కేసే చాన్సొస్తే వదిలేస్తారా? మనకు తినే అవకాసం రావట్లేదనేగా ఈ ఏడుపు. అమెరికా వాల్లు కంట్రోల్ చేసే ఇంటర్నెట్ వాడుకుని, ఎవరో ఇంకొక అమెరికా వాడి బ్లాగర్ ఫ్రీ గా వాడేసుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రావటంలేదా, ఎక్కువగా సిగ్గుపడకండి, లేకపోతే ఇంట్లోనే ఉండిపోవాలి :)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర