Skip to main content

ఇ-మెయిల్‌ను తలదన్నే సరికొత్త క‌మ్యూనికేష‌న్ టూల్‌ను ఆవిష్కరించిన ఫేస్‌బుక్

క‌మ్యూనికేష‌న్ల‌రంగంలో ఒక‌ న‌వ‌శకానికి ఫేస్‌బుక్ నాంది ప‌లికింది. పోస్టుద్వారా ఉత్త‌రాలు పంపుకోవ‌డాన్ని ఇ మెయిల్ దాదాపు క‌నుమ‌రుగు చేయ‌గా, ఇప్పుడు దానిని త‌ల‌ద‌న్నే కొత్త ఉత్ప‌త్తిని ఫేస్‌బుక్ రూపొందించింది. దాదాపు అర‌బిలియ‌న్(50కోట్లు)మంది స‌భ్యులుగా ఉన్న సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ - ఫేస్‌బుక్...ఇ-మెయిల్, ఎస్ఎమ్ఎస్‌, చాట్‌, సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వంటి వివిధ క‌మ్యూనికేష‌న్‌ల‌ను మేళ‌వించి ఒక కొత్త ఉత్ప‌త్తిని తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్‌బెర్గ్, స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ఆండ్రూ బోస్‌వ‌ర్త్ నిన్న‌(సోమ‌వారం, 15.11.10) అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో(సిలికాన్‌వ్యాలీ)లో ఈ కొత్త ఉత్ప‌త్తి గురించి ప్ర‌క‌టించారు.(త‌మ కొ్త్త ఉత్ప‌త్తి ఇన్‌ఫార్మ‌ల్‌గా ఉంటుంద‌ని చెప్ప‌డానికి కావ‌చ్చు...వారిద్ద‌రూ ఇన్‌ఫార్మ‌ల్‌గా టి ష‌ర్టులు, జీన్స్ వేసుకుని మీడియా ముందుకొచ్చారు)



ఇ-మెయిల్ చేయ‌డం ఒక పెద్ద లాంఛ‌నంగా ఉంద‌ని, స‌బ్జెక్టు రాయ‌డం, సీసీ, బీబీ వంటి ఖాళీల‌ను నింప‌డం...ఇదంతా ఒక పెద్ద ప్ర‌క్రియ‌గా చేయాల్సివ‌స్తోంద‌ని మార్క్ జుక‌ర్‌బెర్గ్ అన్నారు. చాలా మంద‌కొడిగా, నెమ్మ‌దిగా ఉండే ఈ ఇ-మెయిల్ వ్య‌వ‌హారం న‌వ‌త‌రానికి ప‌నికిరాద‌ని వ్యాఖ్యానించారు. తాము రూపొందించిన స‌ర్వీస్ చాలా ఇన్‌ఫార్మ‌ల్‌గా ఉంటుంద‌ని, దీనితో సుల‌భంగా, సునాయాసంగా సందేశాలు పంపుకోవ‌చ్చ‌ని చెప్పారు. అనేక యూజ‌ర్ ఫ్రెండ్‌లీ ఫీచర్స్స్ దీనిలో ఉంటాయ‌ని తెలిపారు. ప్రైవ‌సీ, స్పామ్ వంటి అంశాల విష‌యంలో మిగిలిన సంస్థ‌ల‌కంటే త‌మ‌ది మెరుగ్గా ఉంటుంద‌ని చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఉన్న యూజ‌ర్‌నేమ్‌తోనే @ఎఫ్‌బి.కామ్ అనే ఐడీ ఇస్తామ‌ని తెలిపారు. వెంట‌నే ఇది అందుబాటులో ఉండ‌ద‌ని, మెల్ల‌మెల్ల‌గా ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని చెప్పారు. ఇప్ప‌టికిప్పుడు ఇ-మెయిల్ అంత‌రించిపోతుంద‌ని తాము చెప్ప‌డంలేద‌ని, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్ప‌త్తిని రూపొందించామ‌ని అన్నారు.

ఫేస్‌బుక్ కొత్త ఉత్ప‌త్తి మొత్తానికి ఇ-మెయిల్ రంగంలో మొద‌టి మూడు స్థానాల‌లో ఉన్న హాట్‌మెయిల్(మైక్రోసాఫ్ట్), యూహూ, గూగుల్ సంస్థ‌లను డిఫెన్స్‌లో ప‌డేసింది. మ‌రి ఈ స‌వాల్‌ను ఎదుర్కోవ‌డానికి వారు ఏమి చేయ‌బోతున్నారో చూడాలి. మొత్తానికి ఒక వినూత్న సంచలన ఉత్పత్తితో ఫేస్‌బుక్ తన స్థాయిని పెంచుకుని మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహూల చెంత చేరింది. ప్రపంచమంతా ఉపయోగించే అలాంటి ఒక విస్తృత స్థాయి ఉత్పత్తిని ఇంత అతిపెద్ద మానవవనరులు ఉన్న భారతదేశం ఎందుకు రూపొందించలేకపోతోందో మరి.

Comments

  1. అక్షర తప్పులను ఎత్తి చూపే మీ బ్లాగులో ఇన్ని తప్పులా?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

చంద్ర‌బాబు, రామోజీరావు జీర్ణించుకోలేని పరిణామం

అవును నిన్నటి సీఎమ్ మార్పు వ్య‌వ‌హారం వాళ్ళిద్ద‌రికీ అస్స‌లు మింగుడుప‌డ‌ని ప‌రిణామమని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ త‌ర్వాత‌...వాళ్ళిద్ద‌రూ కాంగ్రెస్‌లో  తీవ్రంగా ద్వేషించే వ్య‌క్తి కిర‌ణ్ కుమార్‌రెడ్డి. అటువంటి వ్య‌క్తి ఇవాళ సీఎమ్ అవుతున్నాడంటే వాళ్ళిద్ద‌రికీ నిన్న‌రాత్రి నిద్రకూడా పట్టిఉండదు. అస‌లు వీళ్ళిద్ద‌రికీ - కిర‌ణ్‌కూ గొడ‌వేమిట‌నుకుంటున్నారా...! కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఒక ఏగ్రెసివ్ కాంగ్రెస్ నాయ‌కుడు. 2004లో అధికారంలోకి రాక‌మునుపు, వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలుగుదేశంమీద ఎటాక్‌ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో గ‌ట్టివ్య‌క్తి ఎవ‌ర‌ని చూస్తే... కిర‌ణ్‌కుమార్ రెడ్డే ముందుండేవారు. గాంధీభ‌వ‌న్‌లో, సీఎల్పీలో జ‌రిగే ప్రెస్‌మీట్‌ల‌లో ఆయ‌న విమ‌ర్శ‌లు ధాటిగా ఉండేవి. "చంద్ర‌బాబునాయుడూ... ఇదేమిటి, అదేమిటి..." అంటూ ఏక‌వ‌చ‌న సంబోధ‌న‌తోనే కొట్టిన‌ట్లు మాట్లాడేవారు. అసెంబ్లీలో కూడా కిర‌ణ్‌ టీడీపీని బాగా ఎదుర్కొనేవారు. దీంతో చంద్రబాబునాయుడు కిరణ్‌కుమార్ ఉనికిని కూడా సహించలేకపోయేవారు.  దరిమిలా 2004తర్వాత కిరణ్ వైఎస్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అసెంబ్లీలో ప్రతిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు కిర‌ణ్ స్పంద‌న‌ను ప్ర‌