మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోడి సభలో తనతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబునాయుడు నిన్న స్వయంగా అతని కార్యాలయానికి వెళ్ళి మరీ కలుసుకోవటం తెలుగుదేశంపార్టీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. తెలుగుదేశం శ్రేణులలోని ఒక వర్గానికి, నందమూరి కుటుంబంలోని హరికృష్ణ వర్గానికి ఇది జీర్ణించుకోలేని పరిణామమని చెప్పొచ్చు. మొదటివర్గం కోణంచూస్తే, తెలుగుదేశంలో కోస్తాలోని శ్రేణులలో ఒక సామాజిక వర్గం చంద్రబాబు-పవన్ భేటీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతోంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలోని టీడీపీ శ్రేణులు తల కొట్టేసినట్లయిందని భావిస్తున్నారు. దీనికి మూలాలు ఈనాటివికావు. తెలుగుదేశాన్ని తమ సొంతసంస్థగా పరిగణించే కమ్మ సామాజికవర్గానికీ, పవన్ కళ్యాణ్ సామాజికవర్గమైన కాపులకు కోస్తాలో చిరకాలంగా బద్ధవైరమున్న సంగతి తెలిసిందే. ఊళ్ళలో ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన సినీ అభిమానులుకూడా తమ తమ వర్గాలకు చెందిన నందమూరి, మెగా హీరోలకు 'బై డిఫాల్ట్' అభిమానులుగా మారిపోతుంటారు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్‌వద్దకే స్వయంగ...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides