2004 లో...కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని...మా వోయిస్టుల పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతోందని మీడియావారు అడిగితే – సిసలైన క్రైస్తవుడిలాగానే ఆయన బైబిల్ లోని ఓ కథను ఉటంకిస్తూ, వాళ్ళు ' ప్రోడిగల్ సన్స్ '(పెడ దోవ పట్టిన పిల్లలు) అని అన్నారు. మావోయిస్టుల సంగతేమిటోగానీ , సాక్షాత్తూ ఆయన కుమారుడే ప్రోడిగల్ సన్ అయ్యాడనే అభిప్రాయం కలుగుతోంది. తండ్రి చనిపోయిననాటినుంచీ జగన్ వ్యవహారశైలిని గమనిస్తే అది సవ్యంగా ఉందని అనిపించడంలేదు. మరి అతని స్వభావమే అంతో, లేక చెప్పుడుమాటలు వింటున్నాడో తెలియదుగానీ తప్పుదోవ పట్టాడనిపిస్తోంది. ఇప్పుడు రాజీనామా చేయడంవలన పార్టీకి ఎంతోకొంత నష్టం చేయగలడు....కానీ, అతనికి ఒరిగేదేమిటి ? గరిష్ఠంగా... అయితే గియితే - ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతాడు. కానీ అతనేం బావుకుంటాడు... ? అతనికి సొంతపార్టీ పెట్టి నడిపేటంత సామర్ధ్యముందా... ?(అర్ధబలముందిగానీ...దిశానిర్దేశం చేసేటంత అనుభవజ్ఞులు, రాజనీతిజ్ఞులు, వ్యూహకర్తలెవరూ అతనిపక్కన కనిపించడంలేదు). ఇంత జరిగాక కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides