కమ్యూనికేషన్లరంగంలో ఒక నవశకానికి ఫేస్‌బుక్ నాంది పలికింది. పోస్టుద్వారా ఉత్తరాలు పంపుకోవడాన్ని ఇ మెయిల్ దాదాపు కనుమరుగు చేయగా, ఇప్పుడు దానిని తలదన్నే కొత్త ఉత్పత్తిని ఫేస్‌బుక్ రూపొందించింది. దాదాపు అరబిలియన్(50కోట్లు)మంది సభ్యులుగా ఉన్న సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ - ఫేస్‌బుక్...ఇ-మెయిల్, ఎస్ఎమ్ఎస్, చాట్, సోషల్ నెట్‌వర్కింగ్ వంటి వివిధ కమ్యూనికేషన్‌లను మేళవించి ఒక కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బెర్గ్, సహ వ్యవస్థాపకుడు ఆండ్రూ బోస్‌వర్త్ నిన్న(సోమవారం, 15.11.10) అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో(సిలికాన్‌వ్యాలీ)లో ఈ కొత్త ఉత్పత్తి గురించి ప్రకటించారు.(తమ కొ్త్త ఉత్పత్తి ఇన్‌ఫార్మల్‌గా ఉంటుందని చెప్పడానికి కావచ్చు...వారిద్దరూ ఇన్‌ఫార్మల్‌గా టి షర్టులు, జీన్స్ వేసుకుని మీడియా ముందుకొచ్చారు) ఇ-మెయిల్ చేయడం ఒక పెద్ద లాంఛనంగా ఉందని, సబ్జెక్టు రాయడం, సీసీ, బీబీ వంటి ఖాళీలను నింపడం...ఇదంతా ఒక పెద్ద ప్రక్రియగా చేయాల్సివస్తోందని మార్క్ జుకర్‌బెర్గ్ అన్నారు. చాలా మందకొడిగా, నెమ్మదిగా ఉండే ఈ ఇ-మెయ...