ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి - లింక్ .
రామోజీ జగన్ని ఆదరించినా...హామీ ఇచ్చినా అంత కంటే ఆత్మ వంచన మరోకటి ఉండదు...రామోజీని అధః పాతాళానికి తొక్కడానికి రాజశేకర్ రెడ్డి చేయని ప్రయత్నం లెదు!!పైగా అవినీతి పై యుద్ధం చేశ్తాం అని రోజూ డప్పు కొట్టుకునే ఈనాడుకి...అంత కంటే దిగజారుడు తనం మరోకటి ఉండదు...అవినీతి కేసుల్లో ఉన్న వాళ్ళ పై విచారణ వేగవంతం చేయాలన్న డిమాండ్ అన్ని వర్గాల ప్రజల్లో ఎప్పటి నుండో వినపడుతూనే ఉంది....విచ్చల విడి అవినీతి కి పాల్పడి పళ్ళు ఇకలిస్తూ..జనానికి చేతులు ఊపుతూ..పదుల సంఖ్య లో వాహనాల్లో.. జనాల్లో తిరుగుతున్న నాయకుల్ని చూసి జనం ఊడికెత్తి పోతున్నారు...
ReplyDelete