Skip to main content

యాపిల్‌వారి మరో ప్రతిష్ఠాత్మక ఉత్పాదన 'యాపిల్ వాచ్' ఆవిష్కారం!


మ్యాక్, ఐపాడ్, ఐఫోన్, మ్యాక్ బుక్, ఐపేడ్‌వంటి అత్యుత్తమమైన ఉత్పత్తులతో చరిత్ర సృష్టించిన యాపిల్ సంస్థ, తమ మరో ప్రతిష్ఠాత్మక ఉత్పత్తి 'యాపిల్ వాచ్‌'ను నిన్న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో విడుదల చేసింది.  దీనిని రెండు సైజులలో వివిధ మోడల్స్, డిజైన్లలో తయారు చేశారు. ప్రారంభ దర - 349 అమెరికన్ డాలర్లు. ఇది సుమారు రు.21 వేలకు సమానం. గరిష్ఠధర - 17,000 అమెరికన్ డాలర్లు(రు. 10,20,000). గరిష్ఠ మోడల్‌ వాచ్‌ను 18 క్యారట్ల బంగారంతో రూపొందించారు. డిస్‌ప్లే గ్లాస్‌ను సఫైర్(నీలం)తో తయారు చేశారు.

వచ్చేనెల పదినుంచి ఆర్డర్‌లు బుక్ చేసుకోవచ్చని, 24నుంచి స్టోర్లలో అందుబాటులో ఉంటుందని సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. ఐఫోన్ చేసే కాల్స్, మెసేజెస్, పేమెంట్స్‌వంటి పలు పనులతోబాటుగా ధరించినవారి హృదయ స్పందనలను(హార్ట్ బీట్), వారు చేసే వ్యాయామం వివరాలను కూడా నమోదు చేస్తుందని కుక్ చెప్పారు. చేయవలసినపనులను(రిమైండర్స్) మణికట్టుమీద తట్టిమరీ గుర్తు చేస్తుందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లలో చెక్‌ఇన్ చేయటానికి, కొన్ని హోటల్స్‌లో గదులకు తాళంగాకూడా ఈ వాచ్‌ను ఉపయోగించొచ్చని టిమ్ కుక్ నిన్న ఆవిష్కరణ కార్యక్రమంలో చెప్పారు. బ్యాటరీలో ఛార్జి 18 గంటలు వస్తుందని వెల్లడించారు. 

మరోవైపు యాపిల్ వాచ్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కేవలం హార్ట్ బీట్ వంటి కొన్ని పనులు మాత్రమే ఫోన్ కంటే అదనంగా వాచ్ చేస్తోందని, వాటికోసం అంత ఖర్చుపెట్టి దానిని కొనాల్సిన అవసరం లేదని, పలు రిస్ట్ బ్యాండ్ ట్రాకర్‌లు లభిస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. అటు వాచ్ ఆవిష్కరణ కార్యక్రమంలోనే సరికొత్త 12 అంగుళాల మ్యాక్ బుక్‌ ల్యాప్‌టాప్‌ను కూడా విడుదల చేశారు. దీనిలో ఒకే ఒక యూఎస్‌బీ పోర్ట్ ఉండటం విశేషం.

Image courtesy: www.apple.com


Comments

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

చంద్ర‌బాబు, రామోజీరావు జీర్ణించుకోలేని పరిణామం

అవును నిన్నటి సీఎమ్ మార్పు వ్య‌వ‌హారం వాళ్ళిద్ద‌రికీ అస్స‌లు మింగుడుప‌డ‌ని ప‌రిణామమని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ త‌ర్వాత‌...వాళ్ళిద్ద‌రూ కాంగ్రెస్‌లో  తీవ్రంగా ద్వేషించే వ్య‌క్తి కిర‌ణ్ కుమార్‌రెడ్డి. అటువంటి వ్య‌క్తి ఇవాళ సీఎమ్ అవుతున్నాడంటే వాళ్ళిద్ద‌రికీ నిన్న‌రాత్రి నిద్రకూడా పట్టిఉండదు. అస‌లు వీళ్ళిద్ద‌రికీ - కిర‌ణ్‌కూ గొడ‌వేమిట‌నుకుంటున్నారా...! కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఒక ఏగ్రెసివ్ కాంగ్రెస్ నాయ‌కుడు. 2004లో అధికారంలోకి రాక‌మునుపు, వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలుగుదేశంమీద ఎటాక్‌ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో గ‌ట్టివ్య‌క్తి ఎవ‌ర‌ని చూస్తే... కిర‌ణ్‌కుమార్ రెడ్డే ముందుండేవారు. గాంధీభ‌వ‌న్‌లో, సీఎల్పీలో జ‌రిగే ప్రెస్‌మీట్‌ల‌లో ఆయ‌న విమ‌ర్శ‌లు ధాటిగా ఉండేవి. "చంద్ర‌బాబునాయుడూ... ఇదేమిటి, అదేమిటి..." అంటూ ఏక‌వ‌చ‌న సంబోధ‌న‌తోనే కొట్టిన‌ట్లు మాట్లాడేవారు. అసెంబ్లీలో కూడా కిర‌ణ్‌ టీడీపీని బాగా ఎదుర్కొనేవారు. దీంతో చంద్రబాబునాయుడు కిరణ్‌కుమార్ ఉనికిని కూడా సహించలేకపోయేవారు.  దరిమిలా 2004తర్వాత కిరణ్ వైఎస్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అసెంబ్లీలో ప్రతిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు కిర‌ణ్ స్పంద‌న‌ను ప్ర‌