మ్యాక్, ఐపాడ్, ఐఫోన్, మ్యాక్ బుక్, ఐపేడ్‌వంటి అత్యుత్తమమైన ఉత్పత్తులతో చరిత్ర సృష్టించిన యాపిల్ సంస్థ, తమ మరో ప్రతిష్ఠాత్మక ఉత్పత్తి 'యాపిల్ వాచ్'ను నిన్న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో విడుదల చేసింది. దీనిని రెండు సైజులలో వివిధ మోడల్స్, డిజైన్లలో తయారు చేశారు. ప్రారంభ దర - 349 అమెరికన్ డాలర్లు. ఇది సుమారు రు.21 వేలకు సమానం. గరిష్ఠధర - 17,000 అమెరికన్ డాలర్లు(రు. 10,20,000). గరిష్ఠ మోడల్ వాచ్‌ను 18 క్యారట్ల బంగారంతో రూపొందించారు. డిస్‌ప్లే గ్లాస్‌ను సఫైర్(నీలం)తో తయారు చేశారు. వచ్చేనెల పదినుంచి ఆర్డర్‌లు బుక్ చేసుకోవచ్చని, 24నుంచి స్టోర్లలో అందుబాటులో ఉంటుందని సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. ఐఫోన్ చేసే కాల్స్, మెసేజెస్, పేమెంట్స్‌వంటి పలు పనులతోబాటుగా ధరించినవారి హృదయ స్పందనలను(హార్ట్ బీట్), వారు చేసే వ్యాయామం వివరాలను కూడా నమోదు చేస్తుందని కుక్ చెప్పారు. చేయవలసినపనులను(రిమైండర్స్) మణికట్టుమీద తట్టిమరీ గుర్తు చేస్తుందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లలో చెక్‌ఇన్ చేయటానికి, కొన్ని హోటల్స్‌లో గదులకు తాళంగాకూడా ఈ వాచ్‌ను ఉపయోగించొచ్చని టిమ్ కుక్ నిన్న ఆవిష్కరణ కార్యక్రమంలో చె...