Skip to main content

Posts

కంప్యూటర్‌లో తెలుగు భాషకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం!

ప్రపంచ తెలుగు మహాసభల పుణ్యమా అని తెలుగు భాషపై విస్తృతంగా చర్చజరగటం , ప్రాధాన్యత పెరగటం మంచి పరిణామాలే . కానీ ఏలినవా రు తెలుగుభాషకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన కోణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు . ఇందుగలడందులేడన్నట్లుగా కంప్యూటర్ లు అన్నిచోట్లా వ్యాపించిఉన్న ప్రస్తుత తరుణంలో కంప్యూటర్లలో తెలుగు భాష వాడకంపై అత్యధికశాతం ప్రజలలో ( విద్యావంతులలోనే ) నెలకొని ఉన్న అజ్ఞానాన్ని తొలగించి సులభంగా , విస్తృతంగా ఉపయోగించేదిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటంలేదు ... To Read Full Article, Click Here.

ఎన్‌టీఆర్-ఎంజీఆర్: పాపులారిటీలో ఎవరు గ్రేట్?

ఎన్‌టీఆర్ జీవితం ఆధారంగా మూడు - నాలుగు బయోపిక్‌లు రూపొందబోతున్నాయన్న వార్తలతో ఆయన పేరు మళ్ళీ ఒక్కసారిగా కేంద్రబిందువు అయిన సంగతి తెలిసిం దే . మరోవైపు తమిళనాడులో ఎంజీఆర్ జీవితం ఆధారంగా కూడా తాజాగా ఒక చలనచిత్రం ప్రారంభమైంది . ఈ సందర్భంగా వీరిరువురి జీవితాలమధ్య పోలిక రావటం అనివార్యం . అయితే , తమిళనాడు రాజకీయాలను దగ్గరనుంచి చూసిన తెలుగువారందరికీ , ఎంజీఆర్ ... రామారావుకంటే ఎన్నోరెట్లు పాపులర్ నేత అన్న సంగతి తెలిసిందే . రామారావు జీవితంలో బ్రహ్మాండమైన విజయాలవంటి ఉత్థానాలతోబాటు , ఘోర పరాజయాలు , వెన్నుపోట్లు వంటి పతనాలు కూడా ఉన్నాయి . ఇక ఆయన చరమాంకం అయితే ఒక నల్లటి మచ్చగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే . సొంతవాళ్ళే వెన్నుపోటు పొడిచి గద్దెనుంచి తనను దించేశారన్న మానసికక్షోభతోనే ఎన్టీఆర్ ప్రాణాలు విడిచారు . ఎంజీఆర్ పరిస్థితి అలాకాదు… To Read Full Article, Click Here

'జియో' నిలువునా ముంచేసిందంటున్నారు!

గత 25-30 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన టెక్నాలజీ - అంతకు ముందు 100 సంవత్సరాల కాలం మొత్తంలో జరిగిన అభివృద్ధి చెందినదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువన్న సంగతి తెలిసిందే . ఇలా శరవేగంతో మారిపోతున్న టెక్నాలజీతో ఎన్నోరకాల కొత్తఉద్యోగాలు , వ్యాపారాలు , ఉపాధిమార్గాలు పుట్టుకురావటం , కొంతకాలం రాజ్యమేలిన తర్వాత అంతే వేగంగా మాయమైపోవటం కూడా జరుగుతోంది . 1980, 1990 దశకాలలో వీడియో పార్లర్ , ఎస్టీడీ బూత్ వ్యాపారాలు ఎంత జోరుగా సాగేవో అందరికీ గుర్తుండే ఉంటుంది . క్రమక్రమంగా అవి అదృశ్యమైపోయ్యాయి . అదే కోవలో , ఆ అదృశ్యమైపోతున్న జాబితాలోకి తాజాగా ఇంటర్నెట్ కేఫ్ లు వచ్చి చేరాయి . To Read Full Story, Click Here!

వెల్‌కమ్ వర్సెస్ రెడ్డి: వేగంగా మారుతున్న తెలంగాణ రాజకీయం

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. తెలంగాణలో సంఘటితమవుతున్న రెడ్లకు, కేసీఆర్ వ్యతిరేకులకు రేవంత్ ఒక ఆలంబనగా మారేటట్లున్నారు. దీనితో వచ్చే ఎన్నికలనాటికి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. 2019 ఎన్నికల్లో ముఖాముఖి పోటీ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. To Read Full Story, Click Here.

యువత జీవితాలతో ఆడుకోవద్దు పవన్ కళ్యాణ్!

అధికారం పరమావధికాదు , ప్రజాసమస్యలపై ప్రశ్నించటం కోసం అంటూ రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పట్ల యువత గణనీయసంఖ్యలోనే ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే . నవరాజకీయం రావాలని , నిష్కళంకమైన పాలన కావాలని కాంక్షిస్తున్న యువతీయువకులకు పవన్ జనసేన ఆశాకిరణంలాగా కనపడటమే దీనికి కారణం . అట్టడుగు స్థాయినుంచి అత్యున్నతస్థాయి ఉద్యోగాలలో ఉన్నవారిదాకా , ఇంకా చెప్పాలంటే విదేశాలలోఉన్నవారు కూడా చాలామంది పవన్ వెంట నడవటానికి ఉవ్విళ్ళూరుతున్నారు . మరోవైపు , పవన్ గానీ , ఆయన బృందంగానీ ఏమీ చెప్పకపోయినా తమ తమ ప్రాంతాలలో స్వచ్ఛందంగా , తపనతో అనేక సేవాకార్యక్రమాలను , వితరణ కార్యక్రమాలను నిర్వ హించేవారి సంఖ్యకూడా తక్కువేమీకాదు . ఈ జనసైనికులు పవన్ ను ఎవరైనా పరుషంగా ఒక్కమాట అంటే చాలు తమకు అందుబాటులోఉన్న సోషల్ మీడియాద్వారా , ఇతర మార్గాలద్వారా వాళ్ళమీద యుద్ధాలు ప్రకటిస్తున్నారు . ఒక్కముక్కలో చెప్పాలంటే వీరంతా ఆయనపై గంపెడాశలు పెట్టుకున్నారు . అయితే , మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నప్పటికీ ఇంతవరకూ పార్టీ నిర్మాణమే జరగని , ద్వితీయశ్రేణి నాయకత్వమే లేని , స్పష్టమైన కార్యాచరణ కనబడని , తమ స్వరం వినిపించటానికి సొంత మీడియా ...

బతుకమ్మ చీరలతో కేసీఆర్ సెల్ఫ్ గోల్!

మూడున్నరేళ్ళుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి , రేవంత్ రెడ్డి , కోదండరామ్ , కె . లక్ష్మణ్ వంటి మహా మహానాయకులు చేయలేని పనిని బతుకమ్మ చీరలు చేశాయి . అవును మరి ! ఈ నాయకవర్యులందరూ తెలంగాణ ప్రజల చెవులల్లో ఇళ్ళు కట్టుకుని మరీ కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ సాధించలేని ఫలితం ఇప్పుడు ఒక్క దెబ్బతో సూటిగా , సుత్తిలేకుండా జరిగిపోయింది . అపర చాణుక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ బతుకమ్మ చీరలతో సెల్ఫ్ గోల్ చేసుకుని తన పరువు తానే బజారున వేసుకున్నారు . To Read Full Story, Click Here.

రచయిత్రి కె.రామలక్ష్మి వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు

అలనాటి సుప్రసిద్ధ తెలుగు కవి, సినీ రచయిత ఆరుద్ర భార్య, తానుకూడా స్వయంగా రచయిత్రి అయిన రామలక్ష్మి ఇ టీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె కొందరు ప్రముఖులనుద్దేశించి మాట్లాడిన భాష, ఉపయోగించిన పదాలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఇంటర్వ్యూ చేసిన సీనియర్ పాత్రికేయుడు తెలకపల్లి రవిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామలక్ష్మి ఈ ఇంటర్వ్యూలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనక రహస్యకోణాన్ని బయటపెట్టారు. అప్పట్లో మద్రాస్ లో ఉండే చలనచిత్రపరిశ్రమలోని అనేక రహస్యాలను బయటపెట్టారు. జయకు, శోభన్ బాబుకు మధ్య బంధం గురించి కూడా రామలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను గయ్యాళినని, డేర్‌డెవిల్‌ని అని కూడా చెప్పుకున్నారు. విచిత్రమేమిటంటే ఈమెపై కూడా గ్రంథచౌర్యం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. గోరింటాకు చిత్ర కథను తననుంచి కొట్టేసి దాసరి నారాయణరావుకు అమ్మారని రంగనాయకమ్మ కోర్టు కెళ్ళారు. ఈ కేసులో రంగనాయకమ్మే గెలిచారు కూడా. To Read Full Story, Click Here Image Courtesy: www.Pressks.com