అధికారం
పరమావధికాదు,
ప్రజాసమస్యలపై
ప్రశ్నించటం కోసం అంటూ
రాజకీయాలలోకి
వచ్చిన పవన్ కళ్యాణ్ పట్ల
యువత గణనీయసంఖ్యలోనే ఆసక్తి
చూపుతున్న సంగతి తెలిసిందే.
నవరాజకీయం
రావాలని,
నిష్కళంకమైన
పాలన కావాలని కాంక్షిస్తున్న
యువతీయువకులకు పవన్ జనసేన
ఆశాకిరణంలాగా కనపడటమే దీనికి
కారణం.
అట్టడుగు
స్థాయినుంచి అత్యున్నతస్థాయి
ఉద్యోగాలలో ఉన్నవారిదాకా,
ఇంకా
చెప్పాలంటే విదేశాలలోఉన్నవారు
కూడా చాలామంది పవన్ వెంట
నడవటానికి ఉవ్విళ్ళూరుతున్నారు.
మరోవైపు,
పవన్
గానీ,
ఆయన
బృందంగానీ ఏమీ చెప్పకపోయినా
తమ
తమ ప్రాంతాలలో
స్వచ్ఛందంగా,
తపనతో
అనేక సేవాకార్యక్రమాలను,
వితరణ
కార్యక్రమాలను నిర్వహించేవారి
సంఖ్యకూడా తక్కువేమీకాదు.
ఈ
జనసైనికులు
పవన్ ను ఎవరైనా పరుషంగా ఒక్కమాట
అంటే చాలు తమకు అందుబాటులోఉన్న
సోషల్ మీడియాద్వారా,
ఇతర
మార్గాలద్వారా వాళ్ళమీద
యుద్ధాలు ప్రకటిస్తున్నారు.
ఒక్కముక్కలో
చెప్పాలంటే వీరంతా
ఆయనపై గంపెడాశలు పెట్టుకున్నారు.
అయితే,
మరో
ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నప్పటికీ
ఇంతవరకూ పార్టీ నిర్మాణమే
జరగని,
ద్వితీయశ్రేణి
నాయకత్వమే లేని,
స్పష్టమైన
కార్యాచరణ కనబడని,
తమ
స్వరం వినిపించటానికి సొంత
మీడియా ఊసే ఎత్తని ఈ 'జనసేన'తో
పవన్ కళ్యాణ్ చేస్తున్న
ప్రయోగం రాబోతున్న ఎన్నికలలో
విఫలమైతే -
ఆ
పార్టీకోసం తపనపడుతున్న,
చెమటోడుస్తున్న
ఈ యువతీ యువకుల గుండెలు
బద్దలవుతాయన్న సంగతి ఆ అభినవ
చేగువేరాకు తెలుసా
లేదా
అనే
ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం.
ఈ
ప్రశ్న ఊహాజనితం(hypothetical)
అనిపిస్తున్నప్పటికీ
అసంబద్ధంమాత్రం కాదనే చెప్పాలి.
ఎందుకంటే
పార్టీలో ఎన్నోప్రధాన లోపాలు
స్పష్టంగా కనిపిస్తున్నాయి. To Read Full Story,Click Here.
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
Comments
Post a Comment