ఎన్టీఆర్
జీవితం
ఆధారంగా
మూడు-నాలుగు
బయోపిక్‌లు రూపొందబోతున్నాయన్న
వార్తలతో
ఆయన పేరు మళ్ళీ ఒక్కసారిగా
కేంద్రబిందువు అయిన సంగతి
తెలిసిందే.
మరోవైపు
తమిళనాడులో ఎంజీఆర్ జీవితం
ఆధారంగా కూడా తాజాగా ఒక
చలనచిత్రం ప్రారంభమైంది.
ఈ
సందర్భంగా వీరిరువురి
జీవితాలమధ్య పోలిక రావటం
అనివార్యం.
అయితే,
తమిళనాడు
రాజకీయాలను దగ్గరనుంచి చూసిన
తెలుగువారందరికీ,
ఎంజీఆర్...
రామారావుకంటే
ఎన్నోరెట్లు పాపులర్ నేత
అన్న సంగతి తెలిసిందే.
రామారావు
జీవితంలో బ్రహ్మాండమైన
విజయాలవంటి ఉత్థానాలతోబాటు,
ఘోర
పరాజయాలు,
వెన్నుపోట్లు
వంటి పతనాలు కూడా ఉన్నాయి.
ఇక
ఆయన చరమాంకం అయితే ఒక నల్లటి
మచ్చగా మిగిలిపోయిన సంగతి
తెలిసిందే.
సొంతవాళ్ళే
వెన్నుపోటు పొడిచి గద్దెనుంచి
తనను దించేశారన్న మానసికక్షోభతోనే
ఎన్టీఆర్ ప్రాణాలు విడిచారు.
ఎంజీఆర్
పరిస్థితి అలాకాదు…To Read Full Article, Click Here
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
Comments
Post a Comment