Skip to main content

Posts

పవన్‌కై చంద్రబాబు వెంపర్లాటను ఆ రెండు వర్గాలూ జీర్ణించుకోగలవా!

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోడి సభలో తనతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబునాయుడు నిన్న స్వయంగా అతని కార్యాలయానికి వెళ్ళి మరీ కలుసుకోవటం తెలుగుదేశంపార్టీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. తెలుగుదేశం శ్రేణులలోని ఒక వర్గానికి, నందమూరి కుటుంబంలోని హరికృష్ణ వర్గానికి ఇది జీర్ణించుకోలేని పరిణామమని చెప్పొచ్చు. మొదటివర్గం కోణంచూస్తే, తెలుగుదేశంలో కోస్తాలోని శ్రేణులలో ఒక సామాజిక వర్గం చంద్రబాబు-పవన్ భేటీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతోంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలోని టీడీపీ శ్రేణులు తల కొట్టేసినట్లయిందని భావిస్తున్నారు. దీనికి మూలాలు ఈనాటివికావు. తెలుగుదేశాన్ని తమ సొంతసంస్థగా పరిగణించే కమ్మ సామాజికవర్గానికీ, పవన్ కళ్యాణ్ సామాజికవర్గమైన కాపులకు కోస్తాలో చిరకాలంగా బద్ధవైరమున్న సంగతి తెలిసిందే. ఊళ్ళలో ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన సినీ అభిమానులుకూడా తమ తమ వర్గాలకు చెందిన నందమూరి, మెగా హీరోలకు 'బై డిఫాల్ట్' అభిమానులుగా మారిపోతుంటారు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్‌వద్దకే స్వయంగ...

ఉదయభాను ఓవరాక్షన్

టీవీ9 ఛానల్‌వారు ఉదయభాను ప్రయోక్తగా ప్రైమ్‌టైమ్‌(రాత్రి 9.30)లో నిగ్గదీసి అడుగు అనే కార్యక్రమాన్ని  ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నికలవేళ ఎంపికచేసిన కొన్నిప్రాంతాలకు వెళ్ళి అక్కడ నెలకొనిఉన్న సమస్యలను ప్రజలద్వారా తెలుసుకుని, వాటిపై స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీయటం అనే కాన్సెప్ట్‌తో టీవీ9 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాస్తవానికి టీవీ9లోనే ఝాన్సీ చాలారోజులనుంచి ఇలాంటి కాన్సెప్ట్‌తోనే, స్థానిక సమస్యలపై చేతన అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. అయితే, 'గంగ గరుడాలెత్తుకెళ్ళేరా...ఇంక ఆంబోతులాట సాగేరా' అంటూ సాగే అనే ఒక పాటను స్వయంగా రచించి, పాడి తనలోని సామాజికస్పృహ కోణాన్ని చాటిచెప్పిన ఉదయభాను అయితే ఈ కార్యక్రమానికి యాంకర్‌గా సముచితంగా ఉంటుందని భావించారో, ఏమో టీవీ9వారు ఆమెను రంగంలోకి దించారు. కార్యక్రమం కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, ఉదయభాను తెచ్చిపెట్టుకుని ప్రదర్శిస్తున్న నాటకీయత, ఓవరాక్షన్‌ చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. సినిమాలలో రాజకీయనాయకులకు వ్యతిరేకంగా ఉపయోగించే అన్యాయం, నిర్లక్ష్యం, నిరాదరణ వంటి కొన్ని పడికట్టుపదాలు పట్టుకుని ఉదయభాను ఊదరగొడుతున...

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అత...

చిరంజీవి, మోహన్‌బాబులపై బాలయ్య సెటైర్లు

హైదరాబాద్‌లో గురువారంరాత్రి జరిగిన లెజెండ్ విజయోత్సవ సభలో హీరో బాలయ్య చిరంజీవి, మోహన్‌బాబులపై చెణుకులు విసిరారు. లెజెండ్ టైటిల్‌గురించి వివరించే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ  టైటిల్ మాస్‌కు అర్థమవుతుందో, లేదోనని మొదట సందేహించామని తెలిపారు. అయితే ఆమధ్య కొందరు లెజెండ్ ఎవరంటూ కొట్టుకుని ఆ పదాన్ని పాపులర్ చేశారంటూ లెజెండ్ పురస్కారంపై గతంలో మోహన్‌బాబు, చిరంజీవి మధ్య జరిగిన గొడవను పరోక్షంగా ప్రస్తావించారు. తాము ఈ టైటిల్ పెట్టటంద్వారా అసలు లెజెండ్ ఎవరో, ఏమిటో ప్రేక్షకులకు చూపించామన్నారు. సినీపరిశ్రమలోగానీ, రాజకీయాలలోగానీ తన తండ్రి ఎన్‌టీరామారావు ఒక్కరే లెజెండ్ అని బాలయ్య చెప్పారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని, అందరిదీనన్నారు. ఎన్‌టీఆర్‌ను మరిచిపోయి లెజెండ్ ఎవరు...ఎవరు అని వెతికేవారు పిచ్చివాళ్ళని, అలా వెతికేవారికి పిచ్చెక్కిందేమోనని ప్రజలు అనుకుంటారని(#*@!?*#!) చెప్పారు. తెలుగు సినీపరిశ్రమ వజ్రోత్సవాలలో లెజెండ్ అంటూ కొందరికి పురస్కారాలు ఇస్తూ తనను పట్టించుకోకపోవటంపై తాను లెజెండ్ కాదా అంటూ మోహన్‌బాబు గొడవకు దిగటం, చిరంజీవి దానికి ఆవేశపూరితంగా సమాధానం ఇవ్వటం తెలిసిందే. ...

టీఆర్ఎస్ గొంతుకలై గర్జించే శ్రవణ్, కర్నె ప్రభాకర్‌లకు కేసీఆర్ మొండిచెయ్యి

తెలంగాణ రాష్ట్రసమితి వాదాన్ని వివిధ వేదికలపై, టీవీ చర్చా కార్యక్రమాలలో బలంగా వినిపించే వారిలో డాక్టర్ దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్ ముందుంటారు(ఇంతకుముందు రఘునందన్‌రావుకూడా ఈ జాబితాలో ఉండేవారు. అయితే ఆయన గత ఏడాది మే నెలలో పార్టీనుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు). పార్టీ అధికార ప్రతినిధులు మరెందరో ఉన్నా, ప్రత్యర్ధి పార్టీల నాయకుల విమర్శలను, వాదనలను తిప్పికొట్టడంలో వీరిద్దరిదే పైచేయిగా ఉంటుంది. అయితే పార్టీకోసం ఇంత గొంతుచించుకుని అరిచిన వీరిద్దరికీ పార్టీ అధినేత మొండిచెయ్యే చూపారు. శ్రవణ్ గతంలో ప్రజారాజ్యంలో చురుకైన పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా మెలుగుతూ ఆయన సిఫార్సుద్వారా సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ సాధించి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీనుంచి డాక్టరేట్ పొందిన శ్రవణ్, మంచి ఆలోచనాపరుడు, వక్త కావటంతో తక్కువ సమయంలోనే టీఆర్ఎస్‌లో పొలిట్‌బ్యూరోలో స్థానం సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో భువనగిరి, ముషీరాబాద్‌లలో ఏదో ఒకస్థానంలో పోటీచేయాలని ప్రయత్నించారుగానీ    టికెట్‌  దక్కలేదు. ...

"అయన వస్తున్నాడు" వర్సెస్ "ఆయన వస్తేనే బాగుంటుంది "

గతకొద్దిరోజులుగా న్యూస్ ఛానల్స్ చూస్తున్నవారికి పై రెండు స్లోగన్‌ల గురించి వివరించి చెప్పనవసరంలేదు. చూడనివారికోసం వివరణ - పై రెండు స్లోగన్‌లూ రెండు వేర్వేరు రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార చిత్రాలలోనివి. మొదటిదేమో జగన్ పార్టీది, రెండేదేమో తెలుగుదేశానిది.  జగన్ పార్టీ ప్రచారచిత్రాలలో  ముందు ఏదో ఒక అక్రమాన్ని చూపిస్తారు. ఆ తర్వాత బాధితులవర్గంలోని ఒక వ్యక్తి లేచి ఇంకెన్నాళ్ళు మీ అక్రమాలు, ఆయనొస్తున్నాడు ఎలుగెత్తి అరుస్తారు. ఇంతలో పెద్ద ఎత్తున గాలి, దుమారం వస్తాయి. ఆ వెంటనే మీసాల రామ్ అన్నయ్య(ఈయన ఈ మధ్యనే సాక్షిలోకి రీఎంట్రీ ఇచ్చారు) తన బేస్ వాయిస్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి అంటూ పిలుపునిస్తారు. థమ్సప్ యాడ్‌లోలా గాలి, దుమారాన్ని చూపటంపై జోకులు బాగా పేలుతున్నాయి...'వచ్చేదెవరూ! వైఎస్ దెయ్యమా?' అని. ఇక తెలుగుదేశం ప్రచారచిత్రాలలో ముందుగా, పెరిగిపోతున్న ధరలు, కరెంట్ కోత వంటి ఏదో ఒక సమస్యను ప్రస్తావిస్తారు. స్క్రీన్ అంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుందిగానీ, ఎక్కడో ఒక్కచోటమాత్రమే పసుపురంగు కనిపిస్తూఉంటుంది. సమస్యగురించి పాత్రలు మాట్లాడుకున్న తర్వాత ముక్తాయింపుగా ...

స్టార్‌ప్లస్ మహాభారతం సీరియల్‌లో మూలకథకు దారుణ వక్రీకరణ

దూరదర్శన్‌లో 80వ దశకం చివరలో ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమైన రామాయణం, మహాభారతం హిందీ సీరియల్స్‌ను భాషతో సంబంధంలేకుండా దేశవ్యాప్తంగా అత్యధికశాతం ప్రజలు ఆదరించారు. రామానంద్ సాగర్(రామాయణం), బీఆర్ చోప్రా(మహాభారతం) ఆ సీరియళ్ళలో వివిధ పాత్రల స్వభావచిత్రణలో, నిర్మాణ ప్రమాణాలలో, సాంకేతిక విలువలలో ప్రశంశనీయమైన పనితీరు కనబరిచారు. పిల్లా, పెద్దా అందరినీ ఆ సీరియల్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సీరియళ్ళ ప్రసార సమయంలో రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోయేదంటే వాటికున్న ప్రజాదరణను అంచనావేయొచ్చు. సాగర్, చోప్రా ఇరువురూ తమ సీరియల్స్ నిర్మాణంకోసం పాత తెలుగు పౌరాణిక చిత్రాలను అనుసరించటం మరో విశేషం. ఇక ప్రస్తుతానికి వస్తే, హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ స్టార్‌ప్లస్‌లో గత ఏడాది సెప్టెంబర్‌నుంచి రాత్రి 8.30గంటలకు మహాభారతం సీరియల్ ప్రసారమవుతున్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. స్వస్తిక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ దాదాపు రు.120 కోట్ల ఖర్చుతో ఈ సీరియల్‌ను నిర్మిస్తోంది. మెలోడ్రామాకోసం ఈ సీరియల్ దర్శక, రచయితలు మూలకథను ఇష్టమొచ్చినట్లు మార్చేస్తూ పాత్రల స్వభావాలను తమకనుగుణంగా రూపుదిద్దుతున్నారు. వీరి వ...