Skip to main content

Posts

యాపిల్ తెలుగు కీబోర్డ్ వాడేవారికి ఒక మంచి చిట్కా

యాపిల్ తెలుగు కీబోర్డ్ అలవాటు ఉన్నవారికి కొత్తగా కంప్యూటర్‌లో ఆ సెటప్ పెట్టుకోవడానికి సాధారణంగా రెండు మార్గాలను అనుసరిస్తున్నాం. 1) అనూ ఫాంట్స్ సాఫ్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవడం.(ఇది యూనికోడ్ కాదు) 2) వీవెన్ గారు రూపొందించిన కీబోర్డ్ లేఔట్‌ను నెట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయడం. అనూ ఫాంట్స్ ఇన్‌స్టాల్ చేయాలంటే దానిని కొననైనా కొనాలి...లేదా పైరసీ వెర్షన్ అయినా తీసుకోవాలి. అందుకనే యాపిల్ కీబోర్డ్ వాడేవారం ఎక్కువగా వీవెన్ గారి సాఫ్ట్ వేర్ వాడుతున్నాం. అయితే దీనిలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి. ‘ఇన్‌స్టాల్‘ అనే పదం కంపోజ్ చేయాలంటే ఇన్ స్టాల్ అని మధ్యలో గ్యాప్ ఇచ్చి కంపోజ్ చేయవలసి వస్తోంది. అలాగే ‘జ్ఞాన‌ము’ అనే పదములో ఉన్న మొదటి అక్షరం కంపోజ్ చేయడానికి వీలుకావడంలేదు. ఇదేకాక మనం మన ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా(నెట్ సెంటర్‌లోగానీ, వేరే సిస్టమ్‌లోగానీ) తెలుగులో కంపోజ్ చేయాలంటే తెలుగు సాఫ్ట్ వేర్ అక్కడ అందుబాటులో ఉండటం అరుదు. పై సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం ఉంది. దీనిగురించి మీకు తెలిస్తే సరే. తెలియకపోతే కింద చూడండి. తెలుగు కీబోర్డుల గురించి నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా నా...

నూతన సంవత్సర శుభాకాంక్షలు

జగన్ దారి...పెడదారా?

2004 లో...కాంగ్రెస్  అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ళ‌లో ముఖ్యమంత్రి  రాజ‌శేఖ‌ర‌రెడ్డిని...మా వోయిస్టుల ప‌ట్ల మీ వైఖ‌రి ఎలా ఉండ‌బోతోంద‌ని మీడియావారు అడిగితే – సిసలైన క్రైస్తవుడిలాగానే ఆయన బైబిల్ లోని ఓ కథను ఉటంకిస్తూ, వాళ్ళు ' ప్రోడిగ‌ల్ స‌న్స్ '(పెడ దోవ ప‌ట్టిన పిల్ల‌లు) అని అన్నారు. మావోయిస్టుల సంగ‌తేమిటోగానీ , సాక్షాత్తూ ఆయ‌న‌ కుమారుడే ప్రోడిగ‌ల్ స‌న్‌ అయ్యాడనే అభిప్రాయం కలుగుతోంది. తండ్రి చనిపోయిననాటినుంచీ జగన్ వ్యవహారశైలిని గమనిస్తే అది సవ్యంగా ఉందని అనిపించడంలేదు. మరి అతని స్వభావమే అంతో, లేక చెప్పుడుమాటలు వింటున్నాడో తెలియదుగానీ తప్పుదోవ పట్టాడనిపిస్తోంది. ఇప్పుడు రాజీనామా చేయడంవలన పార్టీకి ఎంతోకొంత నష్టం చేయగలడు....కానీ, అతనికి ఒరిగేదేమిటి ? గరిష్ఠంగా... అయితే గియితే -  ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతాడు. కానీ అతనేం బావుకుంటాడు... ? అతనికి సొంతపార్టీ పెట్టి నడిపేటంత సామర్ధ్యముందా... ?(అర్ధబలముందిగానీ...దిశానిర్దేశం చేసేటంత అనుభవజ్ఞులు,  రాజనీతిజ్ఞులు,  వ్యూహకర్తలెవరూ అతనిపక్కన కనిపించడంలేదు).  ఇంత జరిగాక కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత...

చ‌ర‌ణ్‌కు తొలి చేదు(నారింజ‌) అనుభ‌వం రుచి చూపించిన భాస్క‌ర్

పాపం చ‌ర‌ణ్‌...చిరుత, మ‌గ‌ధీరవంటి విజయాల త‌ర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచించి...చించీ...చించీ(ఆరెంజ్‌కు ముందు చ‌ర‌ణ్ ఎంతో మ‌థ‌న‌ప‌డ్డాడ‌ని  చిరంజీవి ఆ ఆడియో విడుద‌ల ఫంక్ష‌న్‌లో చెప్పారు) మూడోసినిమాకు - ప్రేమ‌క‌థ‌ను, ద‌ర్శ‌కుడిగా భాస్క‌ర్‌ను ఎంచుకుంటూ అతను తీసుకున్న నిర్ణయం మిస్‌ఫైర్ అవ్వ‌డం విచార‌క‌రం. అయితే దీనిలో చ‌ర‌ణ్ త‌ప్పేమీ లేద‌ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక‌టే ఇమేజ్‌లో ఇమిడిపోకుండా వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాలు చేస్తూ అటు మాస్‌ను, ఇటు క్లాస్‌ను మెప్పించాల‌నుకోవ‌డం మంచి ఆలోచ‌నే. కానీ అత‌ని ఆలోచ‌న‌ను ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ స‌రిగా execute చేయ‌లేక‌పోయాడు. క‌థ‌లో, క్యారెక్ట‌రైజేష‌న్‌లో లోపాల వ‌ల‌న సినిమా అటు క్లాస్‌నుగానీ, ఇటు మాస్‌నుగానీ ఆక‌ట్టుకోలేక‌పోతోంద‌ని విమ‌ర్శ‌కులంద‌రూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు. క‌థ‌కు మంచి పాయింటునే తీసుక‌న్న భాస్క‌ర్, దానిపై ఇంకా బాగా క‌స‌ర‌త్తు చేసి, ఆ త‌ర్వాత‌ సినిమా రూపొందిస్తే బాగుండేది. తీసుకున్న పాయింటును జ‌స్టిఫై చేసే సీన్లు లేవ‌ని అంద‌రూ అంటున్నారు. మ‌రీ క్లాస్‌గా, ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో ఉంచుకుని తీసే బాలీవుడ్ ల‌...

చంద్ర‌బాబు, రామోజీరావు జీర్ణించుకోలేని పరిణామం

అవును నిన్నటి సీఎమ్ మార్పు వ్య‌వ‌హారం వాళ్ళిద్ద‌రికీ అస్స‌లు మింగుడుప‌డ‌ని ప‌రిణామమని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ త‌ర్వాత‌...వాళ్ళిద్ద‌రూ కాంగ్రెస్‌లో  తీవ్రంగా ద్వేషించే వ్య‌క్తి కిర‌ణ్ కుమార్‌రెడ్డి. అటువంటి వ్య‌క్తి ఇవాళ సీఎమ్ అవుతున్నాడంటే వాళ్ళిద్ద‌రికీ నిన్న‌రాత్రి నిద్రకూడా పట్టిఉండదు. అస‌లు వీళ్ళిద్ద‌రికీ - కిర‌ణ్‌కూ గొడ‌వేమిట‌నుకుంటున్నారా...! కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఒక ఏగ్రెసివ్ కాంగ్రెస్ నాయ‌కుడు. 2004లో అధికారంలోకి రాక‌మునుపు, వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలుగుదేశంమీద ఎటాక్‌ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో గ‌ట్టివ్య‌క్తి ఎవ‌ర‌ని చూస్తే... కిర‌ణ్‌కుమార్ రెడ్డే ముందుండేవారు. గాంధీభ‌వ‌న్‌లో, సీఎల్పీలో జ‌రిగే ప్రెస్‌మీట్‌ల‌లో ఆయ‌న విమ‌ర్శ‌లు ధాటిగా ఉండేవి. "చంద్ర‌బాబునాయుడూ... ఇదేమిటి, అదేమిటి..." అంటూ ఏక‌వ‌చ‌న సంబోధ‌న‌తోనే కొట్టిన‌ట్లు మాట్లాడేవారు. అసెంబ్లీలో కూడా కిర‌ణ్‌ టీడీపీని బాగా ఎదుర్కొనేవారు. దీంతో చంద్రబాబునాయుడు కిరణ్‌కుమార్ ఉనికిని కూడా సహించలేకపోయేవారు.  దరిమిలా 2004తర్వాత కిరణ్ వైఎస్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అసెంబ్లీలో ప్రతిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు కిర‌ణ్ స్పంద‌న‌ను ప్ర‌...

బీహార్ ఫలితాలు: మళ్ళీ నితీష్‌కే కుర్చీ, లాలూకి గడ్డి, రాహుల్‌కు చెయ్యి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కే ప్రజలు మళ్ళీ పట్టం కట్టినట్లు దాదాపుగా స్పష్టమవుతోంది. జేడీయూ-బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు బీహార్‌ను పదిహేనేళ్ళపాటు అప్రతిహతంగా పాలించిన లాలూకు(పశుగ్రాసం కుంభకోణాన్ని అక్కడి జనం మరిచిపోలేదనుకుంటా...!) మరోసారి ఘోర పరాభవం ఎదురయింది. లాలూ-పాశ్వాన్ కూటమిని బీహార్ ప్రజలు తిరస్కరించారు. అటు రాహుల్ కరిష్మా కూడా బీహార్లో పనిచేయలేదు. ఆయనకు ప్రజలు చెయ్యిచ్చారు.  కాంగ్రెస్‌ రెండంకెలకు చేరుకోవడం కూడా కష్టమయ్యేటట్లుగా ఉంది. నితీష్ చేసిన అభివృద్ధే ఆయనకు విజయం సాధించిపెట్టింది. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, సుదీర్ఘంగా పెండింగులో ఉన్న వంతెనల నిర్మాణాలను చేపట్టడం, నేరాలసంఖ్యను తగ్గించడం, లక్షమంది టీచర్లను నియమించడం, వైద్యులు తప్పనిసరిగా ప్రాధమిక విద్యాకేంద్రాలలో పనిచేయాలని నిబంధన పెట్టడం వంటి చర్యల వలన నితీష్‌కు ప్రజాదరణ లభించింది. దానికితోడు ఆయన వ్యూహాత్మకంగా...ఈ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ అల్లర్లకేసు నిందితుడయిన ముఖ్యమంత్రి నరేంద్రమోడిని(సంకీర్ణ భాగస్వామ్యపక్షానికి చెందిన ముఖ్యనేత అయినప్పటి...

రామోజీ రావ్...మాటలు జాగ్రత్త!

 ఈనాడులో ఇవాళ "మాటలు జాగ్రత్త!" శీర్షికతో వచ్చిన వార్తలో తప్పులు చిత్తగించండి. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ప్రతిరోజూ సుమారు 5,000 ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయి(రహస్యంగా వింటున్నాయి) అన్నది ఒక వార్త. దానిపై ఈనాడు మెయిన్ ఎడిషన్ మూడో పేజిలో "మాటలు జాగ్రత్త" అనే శీర్షికతో ఇచ్చిన వార్తలో... 'ట్యాపింగ్‌'కు బదులుగా 'ట్యాంపరింగ్' అని వచ్చింది. పోనీ ఏదో ఒకచోట అయితే...ఏదో పొరపాటున, అజాగ్రత్తవలన న్యూస్ డెస్క్ వారు చూసి ఉండకపపోవచ్చు అని అనుకోవచ్చు. హెడ్డింగ్‌లో ఒకసారి, కింది వార్తలో నాలుగుసార్లు 'ట్యాంపరింగ్' అనే మాట ప్రచురితమయింది. ఆవార్తను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి  http://www.eenadu.net/story.asp?qry1=19&reccount=23 అంటే ట్యాపింగ్‌కు, ట్యాంపరింగ్‌కు తేడా తెలియని సబ్ ఎడిటర్ ఈ వార్తను రాశాడన్న మాట. సరే...మరి ఆ వార్తను సరిదిద్దిన డెస్క్ ఇన్ ఛార్జి అనే శాల్తీ ఏం చేస్తున్నట్లో? ట్యాంపరింగ్ అంటే ఫలితాన్ని తారుమారు చేయడం...ఆటోమీటర్లను ట్యాంపరింగ్ చేస్తారు, ఈవీఎమ్ లను ట్యాంపరింగ్ చేస్తారు. టెలిఫోన్లను ట్యాంపరింగ్ చేయడమంటే బిల్లులను తారుమారు చేయడమో ల...