Wednesday, January 26, 2011

యాపిల్ తెలుగు కీబోర్డ్ వాడేవారికి ఒక మంచి చిట్కా


యాపిల్ తెలుగు కీబోర్డ్ అలవాటు ఉన్నవారికి కొత్తగా కంప్యూటర్‌లో ఆ సెటప్ పెట్టుకోవడానికి సాధారణంగా రెండు మార్గాలను అనుసరిస్తున్నాం.

1) అనూ ఫాంట్స్ సాఫ్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవడం.(ఇది యూనికోడ్ కాదు)

2) వీవెన్ గారు రూపొందించిన కీబోర్డ్ లేఔట్‌ను నెట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయడం.

అనూ ఫాంట్స్ ఇన్‌స్టాల్ చేయాలంటే దానిని కొననైనా కొనాలి...లేదా పైరసీ వెర్షన్ అయినా తీసుకోవాలి. అందుకనే యాపిల్ కీబోర్డ్ వాడేవారం ఎక్కువగా వీవెన్ గారి సాఫ్ట్ వేర్ వాడుతున్నాం. అయితే దీనిలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి. ‘ఇన్‌స్టాల్‘ అనే పదం కంపోజ్ చేయాలంటే ఇన్ స్టాల్ అని మధ్యలో గ్యాప్ ఇచ్చి కంపోజ్ చేయవలసి వస్తోంది. అలాగే ‘జ్ఞాన‌ము’ అనే పదములో ఉన్న మొదటి అక్షరం కంపోజ్ చేయడానికి వీలుకావడంలేదు.

ఇదేకాక మనం మన ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా(నెట్ సెంటర్‌లోగానీ, వేరే సిస్టమ్‌లోగానీ) తెలుగులో కంపోజ్ చేయాలంటే తెలుగు సాఫ్ట్ వేర్ అక్కడ అందుబాటులో ఉండటం అరుదు. పై సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం ఉంది. దీనిగురించి మీకు తెలిస్తే సరే. తెలియకపోతే కింద చూడండి.

తెలుగు కీబోర్డుల గురించి నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా నాకు ఈ లింక్‌లో మంచి పరిష్కారం దొరికింది. దీనిలో సౌలభ్యం ఏమిటంటే వీవెన్ గారి కీబోర్డుతో కంపోజ్ చేయలేని పదాలను కూడా ఇక్కడ కంపోజ్ చేయవచ్చు. దీనిలో మరో సౌలభ్యం ఏమిటంటే దీనిని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లో కూడాను వాడుకోగలం. అంటే మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్‌లో తెలుగు కీబోర్డు ఇన్‌స్టాల్ చేసి లేకపోయినా నెట్ ద్వారా ఈ సైట్‌కు వెళ్ళి ఆ ఇంట‌ర్‌ఫేస్‌లోనే కంపోజ్ చేసుకోవచ్చు...లేదా దీనిని డౌన్‌లోడ్ చేసుకుని మన పెన్‌డ్రైవ్‌లో పెట్టుకుని ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. దీనికి ఆన్‌లైన్‌ కీబోర్డ్(లేఔట్) కూడా ఉంది. కొత్తవాళ్ళు నేర్చుకోవాలన్నా చాలా సులభంగా నేర్చుకోవచ్చు.

అయితే దీనిలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఇంటర్ ఫేస్‌లో సేవ్ చేసుకునే అవకాశంలేదు. ఎప్పటికప్పుడు మనం కాపీ చేసుకుని వేరేచోట పేస్ట్ చేసుకుంటూ ఉండాలి. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే వీవెన్ గారి కీబోర్డుకీ దీనికీ కొద్దిగా తేడాలున్నాయి. ‘ఆ, ఈ, ఊ, ఓ’ వంటి దీర్ఘాక్షరాలు కంపోజ్ చేయాలంటే గోపీగారి కీబోర్డులో షిఫ్ట్ పట్టుకోనవసరంలేదు. ఆ ఇంటర్ ఫేస్‌లో ఇచ్చిన కీబోర్డు చూసుకుంటే అర్ధమవుతుంది.

ఈ ఇంటర్ ఫేస్‌ను తమిళుడైన గోపాలకృష్ణన్ అనే ఐటీ నిపుణుడు రూపొందించారు. దీనిపై ఏమైనా సందేహాలుంటే ఆయననే నేరుగా సంప్రదించవచ్చు. నేను కాంటాక్ట్ చేస్తే ఆయన వెంటనే చక్కగా స్పందించారు. కంప్యూటర్ రంగానికి సంబంధించినవాడిని కానప్పటికీ యాపిల్ కీబోర్డుతో తెలుగు టైపింగు చేసేవారు ఎదుర్కొంటున్న చిన్నచిన్న సమస్యలకు ఇది పరిష్కారం కాగలదని, చాలామందికి ఉపయోగపడుతుందని చిట్కాలాంటి ఈ పోస్టు రాశాను. మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.


Image courtesy: www.pixabay.com

3 comments:

 1. ఇలాంటి సౌకర్యం అను మాడ్యులార్ కీ బోర్డ్ వాడే వారికి ఉందా తెలుప గలరు.
  - ప్రకాష్, హైదరాబాద్

  ReplyDelete
 2. మంచి సమాచారం అందించారండీ. మీరిచ్చిన లింకు బాగుంది. కృతజ్ఞతలు! అక్కడకు వెళ్ళి ‘ఇన్ స్టాల్’ అనే మాట గ్యాప్ లేకుండానే కంపోజ్ చేయగలిగాను.

  వీవెన్ గారు అందించిన లే అవుట్ లో కూడా ‘జ్ఞ’ అక్షరం టైప్ చేయవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ Keys ఉపయోగించాలి. జ టైప్ చేసి, తర్వాత Shift h కొట్టి Alt T టైప్ చేస్తే ఈ అక్షరం వస్తుంది. మీరిచ్చిన లింకులో ఇంత శ్రమపడనక్కర్లేదు.

  ReplyDelete
 3. శ్రవణ్ గారూ, బాగుంది.

  ప్రకాష్ గారూ, మాడ్యులర్ లేయవుటులో యూనికోడ్ టైపు చెయ్యడానికి ఈ లంకెలో చూడండి.

  ReplyDelete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts