Skip to main content

మనం తిండి తినే విధానమంతా తప్పేనట! డాక్టర్‌లు కూడా ఫాలో అవుతున్న కొత్త పద్ధతి ఇదిగో!

పొద్దున్నే లేస్తే మనం తినే ఇడ్లీ, దోశ, పూరి, బ్రెడ్ లతో మొదలుపెట్టి భోజనంలో తినే అన్నం, చపాతి, ఇక సాయంత్రంపూట స్నాక్స్ గా తినే సమోసాలు, బజ్జీలు, బర్గర్, పిజ్జాలవరకు అన్నింటిలో ఎక్కువగా ఉండే ఏకైక పదార్థం ఏమిటో తెలుసా? కార్బోహాడ్రేట్స్(పిండిపదార్థాలు). ఇది మనం తీసుకునే ఆహారంలో 70 నుంచి 80 శాతం ఉంటోంది. ఇదే మన కొంప ముంచుతోందని, షుగర్, బీపీ, ఒబేసిటీ, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులకు కారణమవుతోందని తాజా అధ్యయనాలలో తేలింది. దీనితోపాటు - సంప్రదాయ వంటనూనెలు, నెయ్యి, వెన్న వంటి ఫ్యాట్స్(కొవ్వు పదార్థాలు)తో కొలెస్టరాల్ పెరుగుతుందని ఇంతవరకూ నమ్ముతూ వస్తున్న సిద్ధాంతం కూడా పూర్తిగా తప్పని తెలియవచ్చింది. ఫ్యాట్స్ తినటం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుందన్నది అపోహమాత్రమేనని, వాటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని అంటున్నారు. ఈ తాజా అధ్యయనాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఒక కొత్త ప్రత్యామ్నాయ ఆహార విధానం(డైట్ ఛేంజ్ ప్రోగ్రామ్) ఇప్పుడు ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలలో హల్ చల్ చేస్తోంది. దీనిని ఆచరించటంవలనసాధారణ వ్యక్తులకు ఆరోగ్యం ఎన్నోరెట్లు మెరుగవుతుండగా, షుగర్, బీపీ, ఒబేసిటీ, మోకాళ్ళ నొప్పులు,పీసీఓడీ వంటి దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులతో బాధపడేవారికి వాటినుంచి విముక్తి కలుగుతోంది. అవును… మీరు చదివింది కరెక్టే. ఇది అక్షరాలా నిజం. 3 నెలలపాటు ఒక నిర్ణీత పద్ధతిలో ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించి, కొవ్వుపదార్థాలను పెంచటమే ఈ కొత్త ప్రోగ్రామ్ లో అనుసరించే మూలసూత్రం. కొందరు వైద్యులు కూడా ఈ ప్రోగ్రామ్ ను ఆచరించి సత్ఫలితాలు పొందామని బహిరంగంగా చెబుతున్నారు. మీడియా కన్ను సరిగా పడకపోవటంతో పెద్దగా బయటకురాని ఈ ప్రోగ్రామ్ ఇప్పుడిప్పుడే మెల్లగా ఊపందుకుంటోంది. ఏపీలోని ఇతర ప్రాంతాలకు, తెలంగాణకు కూడా ​విస్తరిస్తోన్న ఈ కొత్త ఆహారవిధానంపై ప్రత్యేక కథనం​.To Read the Full Story, Click Here.

Comments

  1. కీటో డైట్‌ ఆసక్తి సరే..అతి విశ్వాసం వద్దు!
    best artile on Enadu paper, please go through before follow new diet practices,
    http://www.eenadu.net/special-pages/sukhibhava/sukhibhava-inner.aspx?featurefullstory=19542

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

గ్రేటర్‌లో జనం గుణపాఠం చెప్పవలసింది కేసీఆర్‌కా, బీజేపీకా?

  రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్‌ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.