కొద్దిరోజులుగా
తెలుగురాష్ట్రాలను కుదిపేస్తున్న
వీరమాచనేని డైట్ ప్లాన్ మీద
తెలుగు మీడియాలో మొట్టమొదటిసారిగా
ఏషియానెట్ వెబ్ సైట్ విస్తృత
కథనాన్ని ఇచ్చిన సంగతి
తెలిసిందే(ఆ
కథనాన్ని చదవాలనుకుంటే ఇక్కడ
క్లిక్ చేయండి). షుగర్
వ్యాధిని ఒక్కరోజులో
తగ్గించుకోవచ్చని చిటికేసి
మరీ చెబుతున్న వీరమాచనేని
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు
రెండింటిలో హాట్ టాపిక్ గా
మారారు. వీరమాచనేనికంటే
ఎంతో ముందుగానే విశాఖపట్నానికి
చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్
పీవీ సత్యనారాయణ ఈ ప్రత్యామ్నాయ
ఆహారవిధానంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు
నయం చేస్తున్నప్పటికీ ఆయనకు
పెద్గగా ప్రచారం లభించలేదు.
దానికి
కారణం సత్యనారాయణ కార్డియో
థొరాసిక్ సర్జన్ కావటం,
సర్జన్
గా తన విధులను కొనసాగిస్తున్నందున
దీనిపై పూర్తిస్థాయి దృష్టి
పెట్టలేకపోవటం. మరోవైపు
వీరమాచనేని చెప్పేతీరు బలంగా
నాటుకుపోయేటట్లు ఉండటం,
విజయవాడలోని
పలువురు ప్రముఖ వైద్యుల మద్దతు
కూడా లభించటంతో ఆయన సిద్ధాంతం
విస్తృతంగా ప్రజలలోకి వెళ్ళింది.
షుగర్
వ్యాధితో ఎన్నోరోజులుగా
బాధపడుతున్నవారికి ఈయన
ఆశాకిరణంలా కనిపిస్తున్నారు.
దీర్ఘకాలికంగా
ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి
దానినుంచి బయటపడే మార్గముందని
ఎవరైనా చెబితే ఆశగా చూడటం
సహజం. ఔత్సాహికులు
కొంతమంది ఈయన డైట్ ప్లాన్ ను
ఆచరిస్తుండగా,
మరికొంతమంది
వేచిచూసే ధోరణిలో ఉన్నారు.
ఆచరించేవారిలో
రాజకీయ నాయకులు, ఐఏఎస్
అధికారులతోసహా ఎందరో ప్రముఖులు
ఉంటున్నారు. మరోవైపు
అల్లోపతి వైద్యులు,
ఒబేసిటీ,
షుగర్
వ్యాధిలను ఆధారంగా చేసుకుని
వ్యాపారం చేసేవారు మాత్రం
వీరమాచనేనిపై విరుచుకుపడుతున్నారు.
మరి
ఈ ఇరుపక్షాలలో ఎవరు కరెక్టో
తెలుసుకోవాలంటే ఇరుపక్షాల
ప్రధాన వాదనలను పరిశీలించాలి.To Read the Full Story, Click Here.
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
Comments
Post a Comment