Saturday, September 7, 2013

ఏపీ ఎన్జీఓల సభ విజయవంతంసభను అడ్డుకుంటామని తెలంగాణవాదులు, జరపాలన్న కృతనిశ్చయంలో ఎన్జీఓలు ఇరువైపులా మోహరించి ఉంటడంతో ఎప్పుడేమి జరుగుతుందో అని శనివారం ఉదయంనుంచి హైదరాబాద్ వాసులు ఉత్కంఠతతో ఊపిరి బిగబట్టి చూశారు. మొత్తానికి చెదురుమదురు ఘటనలు మినహా సభ సాఫీగా సాగిపోయింది. సభ నిర్వాహకులను, ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దీనికి అభినందించాలి. మోరల్ సపోర్ట్, లాజిస్టిక్ సపోర్ట్, లా అండ్ ఆర్డర్ సపోర్ట్...ఒకటేమిటి అన్ని సపోర్టులూ అందించి సభను విజయవంతం చేయించారు కిరణ్.

ఏపీ ఎన్జీఓలు ఈ వేదికను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. సమైక్యవాదానికి తమ కారణాలను, తమ వాదనను స్పష్టంగా వినిపించారు. విభజన వలన నష్టాలను వివరించడంకూడా ఈ సభ లక్ష్యమైనప్పటికీ, వక్తలలో అశోక్ బాబు తప్పితే మిగిలిన ఉద్యోగసంఘాల నాయకులెవరూఆ విషయాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. సభలో వక్తల ఉపన్యాసాలుసంయమనంతో సాగాయని చెప్పొచ్చు. ఎవరైనా శృతి మించినా, అశోక్ బాబు వెనకనుంచి వారిని వారించడంతో వక్తలు మళ్ళీ గాడిలోకి వచ్చారు. వక్తలలో అశోక్ బాబు తర్వాత మిత్రా, సత్యవాణి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఇంకా పలువురు వక్తలు ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ, సమయాన్ని పాటిస్తూ 5గంటల ప్రాంతంలో సభను ముగించేశారు. ఈ క్రమశిక్షణకూడా సభ విజయవంతమవడానికి ఒక కారణమని చెప్పొచ్చు. దీనికి తోడు ఎంతో పరిణతితో అశోక్ బాబు వ్యవహరించిన తీరు మరొక కారణమని చెప్పక తప్పదు. ఉపన్యాసాలలో వ్యక్తులగురించి ప్రస్తావించొద్దని ఆయన వక్తలకు పదేపదే గుర్తుచేశారు. రాజకీయాలలోకి రాబోనని చెప్పి అందరి ప్రశంశలూ అందుకున్నారు. ఎవరిపై ద్వేషం, విషం కక్కకుండా సభ మొత్తం ఒక పాజిటివ్ ఫీల్ తో సాగేటట్లు చేశారు. సీమాంధ్రప్రాంతంలోని 13జిల్లాలలో ఎటువంటి కేంద్రీయ నాయకత్వం లేకుండా, అసంఘటితంగానే  సమైక్యాంధ్రకోసం ఉద్యమం చేస్తున్నవారిలో ఇవాళ్టి హైదరాబాద్ సభ మరింత స్ఫూర్తిని రగులుస్తుందనడంలో ఏమాత్రం సందేహంలేదు

image courtesy:ప్రజాశక్తి

15 comments:

 1. ఈ సభ గురించి ఎంత చెప్పినా తక్కువె.ఇంత సంయమనం ఎప్పుడూ చూడలెదు

  ReplyDelete
  Replies
  1. ఆవును ఎంత చెప్పిన తక్కువె ...... ఎంత చెప్పినా తక్కువె...
   అరెరె! ఎంత సోదరభావం, ఎంత సమైక్యత, ఎంత క్రమశిక్షణ. నిజంగా మన సీమాంధ్ర NGOs ఎంత శాంతికాముకులో కదా…
   ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 రైళ్లు, 1200 బస్సుల్లో హైదరాబాదుకు పిక్నిక్ వచ్చిన మన సోదరులు, నిజాం కాలేజి విద్యార్ధులను చూస్తూ “పీక కోస్తాం” అంటూ చేసిన సైగలివి.
   గొప్ప సమైక్యత కదూ వీరిది!

   ఇప్పుడు ఎవరిని ఎవరినుండి రక్షించాలని ప్రశ్నించాలె మనం!

   http://missiontelangana.com/samaikya-goodaism-slit-throat/

   Delete
  2. అబ్బ, ఎంత బాగుందో నటన, ఎంత అమాయకత్వ ప్రదర్శనో - ఒకటో రెండో నందుల్ని ఇచ్చిపారెయ్యొచ్చు.

   సభకొచ్చే సీమాంధ్రులను చావగొడతం అంటూ ఉస్మానియాకు చెందిన రౌడీలు టీవీల ముందు కూసిన కారుకూతలు చూళ్ళేదా ప్రాశ్నికుడా? ఆ తరవాత హై. కి వస్తున్న బస్సులపై రాళ్ళేసిన వైనం తెలీదా? సభ తరవాత తిరిగి వెళ్తున్నవాళ్ళపై రాళ్ళేసిన సంగతి తెలీకుండా కళ్ళూ చెవులూ మూసుకున్నావా?

   ఇక ఆపండి మీ దిక్కుమాలిన అబద్ధపు ప్రచారాలు.

   Delete
  3. ఇంకో సంగతి ఎనానిమస్సూ..
   ఎవరిని ఎవరినుండి రక్షించాలని ప్రశ్నించాలె మనం అంటూ వేదన చెందడం బాగుంది. కానీ ఊరికే గాల్లోకి ప్రశ్నలు వదలడం కాకుండా మీరే స్వయంగా మీ అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేసి ఉంటే మీకు కింది వీడియో (40 వ సెకను నుంచి చూడండి) కనబడి ఉండేది. మీ వేదనకు కారకులు ఎవరో తెలిసి ఉండేది.

   https://www.youtube.com/watch?v=SJL_5iYUMY8

   సభ జరగడానికి ఒకరోజు ముందు చెప్పిన మాటలివి. గొప్ప శాంతికాముకులు కదా వీళ్ళు.

   Delete
 2. Jai Jai Kiran Kumar Reedy & Jai Jai DGP

  ReplyDelete
 3. thanks to our andhra CM & andhra DGP for their nice cooperation.

  ReplyDelete
 4. SEEMANDHRALO EKKADAINA OKKA TELANGANA NAAYAKULA VIGRAHALU UNNAVA ?
  EEROJU MEETING LO ELA GNAPAKAMU VACHINAADI BOORGULA PHOTO VEEDIKA PI PETTADANIKI?

  ReplyDelete
 5. emi baboo seemandhralo telangaanaa naayakula vigrahaalu lekapothe neeku nidra raavatledaa? leka edo okati adagaali kaabatti adugutunnaavaa?

  telangaanaa naayakula vigrahaala visayaniki vaste -- PV vigrahaalu raastramanthaa unnayi. ala rasta paridhilo pani chesina telangaanaa nayakudi peru inkoti cheppu. vigraham petteddam.

  ReplyDelete
  Replies
  1. పీవీ విగ్రహాలు సీమాంధ్రలో ఎన్ని ఉన్నాయి, ఎక్కెడెక్కడ ఉన్నాయి, జెర డెటైల్స్ ఫోటొస్ తో ఇయ్యరాదె.

   Delete
  2. ఇంక నాకు ఇదే పని. ఎప్పుడయినా పొరపాటున బావి దాటి బయటకి వెళ్తే ఒక లుక్కెయ్యి కనిపిస్తాయి

   Delete
 6. businesses of your beloved politicians are running well in various places in seemandhra , telangana and other places in india . who were loosing in bundh are govt school students RTC employees NGOs daily wages workers small business establishments.how they will survive?

  ReplyDelete
  Replies
  1. ఈ ఉద్యమాల వల్ల లాభపడేది రాజకీయ నాయకులు నష్టపోయేది సామాన్య ప్రజలు. కాబట్టి ఈ బంద్ లన్ని ఆపి ఎవరి పనులు వాళ్ళు చూసుకుని రాజకీయ నాయకుల జుట్టు పట్టుకుని అభివృద్ది జరిపించుకుంటే మంచిది. లేదూ నాయకుల తాళానికి చిందులు వేస్తాం అంటే ఇంకా నష్టపోతారు అంతే.

   Delete
 7. At last samaikhaya people shows how faith they are having on courts AND NATIONAL ANTHEM................................................................

  ReplyDelete
 8. The statue of Sri.P.V.Narasimharao is in our Vizag..Please come to my home..I will show it.

  ReplyDelete
 9. Rendu pranthalloo unna yuvataram,prajalu idi baagaa telusukondi.Eee socalled rajakeeya nayakulu, naayakulu desanni digamingataniki inkaa mana madhya nippu ragulusthunee unnaaru. Evadiki kavaali eee samikyamu or separate.Mundhu vaallnu nooru muinchandi. Prajalu haigaa nidrapootharu.Media koodaa chalaa chendaalamga vyavaharisthundi. Paper chudaalannaa asahyam vesthundi.

  ReplyDelete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts