Wednesday, September 4, 2013

దిశానిర్దేశం కొరవడిన సమైక్యాంధ్ర ఉద్యమంతెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి కాంగ్రెస్ అధిష్ఠానంప్రత్యేకరాష్ట్ర ప్రకటనచేసేటట్లు చేయడంలో తెలంగాణ జేఏసీ పాత్ర కీలకమనేది నిర్వివాదాంశం. టీడీపీనుంచి బయటకొచ్చి టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమ పునరుద్ధరణకు మూలకారకుడైనప్పటికీ, ఇటీవలికాలంలో సకలజనులసమ్మె, అసెంబ్లీ ముట్టడివంటి ఏదో ఒక కార్యక్రమంచేస్తూ, విజయవంతమయ్యేవరకు ఉద్యమాన్ని చైతన్యవంతంగా ఉంచిన ఘనత తెలంగాణ జేఏసీదే. మంత్రి గీతారెడ్డిని కర్రుకాల్చి వాతపెట్టాలనటంవంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా,ఉద్యమం ఫలవంతమవడంలో ప్రొఫెసర్ కోదండరామ్ కృషిని ఎవరూ కాదనలేరు. మధ్యలో కేసీఆర్ తో విభేదాలు వచ్చినా తట్టుకుని నిలబడి, రాజకీయ పార్టీలు, ఉద్యోగసంఘాలను సమన్వయంచేసుకుంటూ తెలంగాణ జేఏసీఅస్తిత్వాన్ని కాపాడుకున్నారు. జేఏసీ వలన ఆ ఉద్యమం ఒక గాడిలో, సంఘటితంగా, సమీకృతంగా నడిచింది. సమైక్యాంధ్ర ఉద్యమంలోఖచ్చితంగా అదే కొరవడింది.

విభజన నిర్ణయంతో సీమాంధ్రలో తీవ్ర భావోద్వేగాలకు గురై ప్రతిరోజూ లక్షలమంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నప్పటికీ, వారి ఉద్యమం ఒక కార్యాచరణ ప్రణాళిక,దిశానిర్దేశంలేకుండా నడుస్తోంది. సంఘటితంగా ఒక్కతాటిపై నడిపే నాయకత్వం లేకపోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు తమదైన శైలిలో ఆందోళలను, ర్యాలీలను, ధర్నాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల, ఏమిచేయాలో, ఏమి చేయకూడదో కూడా తెలియక చిత్ర, విచిత్ర పోకడలను అనుసరిస్తున్నారు. విభజనతో తాము నష్టపోతామన్న బాధతో ఆందోళనలకు దిగినవారు, తమ కార్యక్రమాలలో ఆ ఆందోళనను ప్రతిఫలించడానికి బదులుగా కరాటేలు, వ్యాయామాలు, యోగాసనాలు,కబడ్డీ ఆటలు, ముగ్గులపోటీలు, రోడ్లపై స్నానాలు వంటి విన్యాసాలు చేస్తున్నారు. లక్షజనఘోషవంటి గంభీరమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, విచిత్ర విన్యాసాలనే మీడియాలో బాగా చూపించడంవలన ఉద్యమం పలచనైపోతోంది.

ఎవరూ ఊహించనివిధంగా, నాయకులులేకుండానే ప్రజలనుంచి స్వచ్ఛందంగా ఉవ్వెత్తున పుట్టుకొచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమం నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. ప్రజల ఆందోళనను, భావోద్వేగాలను ప్రతిబింబించేవిధంగా, విధాన నిర్ణేతలకు దాని తీవ్రతను తెలియజెప్పే విధంగా ఉద్యమాన్ని నడిపే కేంద్రీకృత నాయకత్వం కరువయింది.దీనివలన ఉద్యమం ఎన్నిరోజులు జరిగినా ఫలితం పెద్దగా ఉండదని, అంతిమంగా నష్టపోయేదితామేనన్నది ఆ ప్రాంతప్రజలు గుర్తించాలి. ఇప్పటికే పరిపాలన కుంటుపడింది. కోర్టుల్లో కేసులు నడవకపోవడంతో నిందితులు, కక్షిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటినీ మించి అభం, శుభం తెలియని విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజువారీ వ్యాపారులు, కూలీలపై బంద్ ల ప్రభావం బాగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే.

సమైక్యాంధ్ర ఉద్యమ నాయకత్వలోటును పూరించడానికి రాజకీయనాయకులు ముందుకు రాకపోవడానికి వారి కారణాలు వారికున్నాయి. కాంగ్రెస్ నాయకులు రోడ్లపైకి వస్తే ఉద్యమకారులు చొక్కాపట్టుకుంటారు కాబట్టి వారు ఎలాగూ రారు. ఇక సమన్యాయం అంటూ గోడమీద పిల్లిలాఉన్న తెలుగుదేశం, ఈ పరిస్థితినుంచి లబ్దిపొందటానికి బస్సుయాత్ర ప్రారంభించింది. అటు జగన్ పార్టీకూడా కాపీ క్యాట్ లాగా టీడీపీ బాటలోనే పయనిస్తోంది.ఈ పరిణామాలన్నింటినీ సీమాంధ్రప్రజలు గుర్తించి, నిర్మాణాత్మకంగా, సవ్యదిశలో ఉద్యమాన్ని నడపటానికి ఒక సమీకృత నాయకత్వాన్ని, జేఏసీని ఏర్పాటుచేసుకుని కార్యాచరణ ప్రణాళికప్రకారం నడుచుకుంటూ తమ ఆంక్షలను , ఆశయాలను సాధించుకోడానికి ప్రయత్నించాలి. ఎక్కడికక్కడ పార్టీల రహితంగా జేఏసీలను ఏర్పాటుచేసుకుని ఒక నాయకత్వకేంద్రాన్ని ఇప్పటికైనా రూపొందించుకుంటే ఫలితముంటుంది.

Image courtesy:manabhimavaram.info

11 comments:

 1. దిశ దశ లేక కాదమ్మా?
  ఇది నిజంగా ప్రజలలోంచి వచ్చిన ఉద్యమం. ప్రజల గుండెల్లోంచి వచ్చిన ఉద్యమం కనుకనే ఇంత ఉధ్రుతంగా నడుస్తోంది. ఏ రాజకీయ నాయకుడూ నిబద్ధత లేని ఏ రాజకీయ నాయకుణ్ణీ, విలీనాలకి ఆశపడో పాకేజీలకి ఆశపడో ఫాం హౌసుల్లో నిద్రపోయే రాజకీయ నాయకులు లేరు కనుకనే, ఎమెల్సీ తిఖట్లకి ఆశపడి ఉద్యమాలని మధ్యలో ఆపేసే నిజాయితీ పరులేరు కనుకనే .. వంతుల వారీగా వర్గాల వారీగా రోజూ రోజూ నిరసన ఏ మాత్రం ఉధృతి తగ్గకుండా వ్యక్తం చేస్తున్నారు. Wait and watch .. ప్రపంచంలో ఏ ప్రజా ఉద్యమమూ వ్యర్ధం కాలేదు .. ఇదీ కాదు

  ReplyDelete
 2. jai andhra udyamam emaindi? madras manade udyamam emaindi? madras rajadhani kavalani potti sriramulu nirahara deeksha cheste emaindi?

  ReplyDelete
 3. పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమం విశాలాంధ్ర ఏర్పాటుకి పునాది వేసింది. 56 యేళ్ళపాటు మిగతా రాష్ట్రాలకి దీటుగా తెలుగుజాతి వెలగడానికి పునాది వేసింది. దేశం గర్వపడే ఆణిముత్యాల్లాంటి తెలుగు వైతాళికులని అందించగలిగే వ్యవస్థకి పునాది వేసింది.

  మొత్తంగా భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకి నాంది పలికింది.

  రాజకీయ ప్రయోజనాలకోసం జైతెలంగాణ అన్నా జై ఆంధ్ర అన్నా .. అద్గదుగో అని చంకలు గుద్దుకోవడానికి తప్ప మరొకటి కారాదు.

  ఇది తెలుసుకోండిరా .. మీ అమాయకత్వం తగలెట్టా .. దౌర్భాగ్యులలారా

  ReplyDelete
  Replies
  1. ఇంకా వివరంగా చెప్పాలంటే విశాలాంద్ర ఏర్పడటానికి పొట్టి శ్రీ రాములు గారు మద్రాసు రాజధాని గల ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసాడు అది విశాలన్ద్రకు ఒక పునాది (విశాలాంద్ర ఆయన లక్ష్యం అయితే రాజధానిగా హైదరాబాదు ఉందిగా, మరి మద్రాసు ఎందుకు కావలన్నాడో లాజిక్కులు అడక్కండి), అయితే అంతకు ముందు పటేల్ గారు పోలిస్ యాక్షన్తో హైదరాబాదును భారత్ లో కలిపాడు, అదే జరిగుండక పొతే విశాలాంద్ర కుదిరే పని కాదు, సో ఆయన కూడా విశాలన్ద్రకు అలా ఒక పునాది వేసాడు. గాంది గారు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసాడు, దేశ శ్వతంత్రం లేకుంటే విశాలన్ద్రనే లేదు కదా, అలా గాంది గారు కూడా విశాలంద్రకు పునాది వేసాడు. అంతకు ముందు చిన్న చిన్న సంస్తానాలుగా ఉన్న భారత్ ను ఒక దేశంగా తయారు చేసిన ఘనత బ్రిటిష్ వారిది, వారు అలా చెయ్యకపోతే విశాలాంద్ర సాద్యం అయ్యేది కాదు, అలా బ్రిటిష్ రాణి కూడా విశాలంద్రకు పునాది వేసారు. రెండవ ప్రపంచ యుద్ధం లో భారీగా నష్టపోవటం చేత బ్రిటిష్ చేతులెత్తేసి భారత్ కు స్వతంత్రం ఇచ్చిందని ఒక చర్చ, అలా అయితే రెండవ ప్రపంచ యుద్ధం మొదలు పెట్టిన జర్మని కూడా విశాలన్ద్రకు పునాది వేసినట్లే. మన దేశం బ్రిటిష్ రాణి అధికారంలోకి రావటానికి ఈస్ట్ ఇండియా కంపెని కారణం, సో వాళ్ళు లేకపోతె కుడా విశాలాంద్ర కష్టం అయ్యేది, అంటే ఈస్ట్ ఇండియా కంపెని కూడా విశాలంద్రకు పునాది వేసింది .... ఇంకా ఉంది తర్వాత రాస్తా.

   Delete
  2. So East India company is the reson for Separate Telangana State

   Delete
 4. nijamga oka varam rojulu media coverage lekapothe ee udyamam nilabadadu.

  ReplyDelete
 5. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం వల్లనే కేంద్రం ౨౧౫ రొజుల తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ౧౨౫ రోజులకు కుదించి వేగవంతం చేసింది!ఇప్పటికే హోం శాఖనుంచి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లు న్యాయశాఖకు చేరుకుంది!వారం రోజుల్లో కేంద్ర న్యాయ శాఖనుంచి అభిప్రాయంతో బిల్లు హోం శాఖకు చేరుతుంది!మంత్రుల బృంద పరిశీలనను ౯౦ నుంచి ౬౦ రోజులకు కుదించారు!పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి అనిశ్చితిని తొలగించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది!మీరు పేర్కొన్నట్లు సమైక్యాంధ్ర ఉద్యమానికి దిశా నిర్దేశం కొరవడింది!

  ReplyDelete
  Replies
  1. కల నిజమవదుగా... కోరిక తీరదుగా.. మీ తెలంగాణ నేతలు చేస్తున్న ఒక్కో దరిద్రపు ప్రకటనతో తెలంగాణ ఒక్కో అడుగు వెనక్కి వెళ్తోంది అపకారిగారూ. చివరికి హరగోపాల్ లాంటి వాళ్లు కూడా సీమాంధ్ర ఉద్యమాన్ని కృత్రిమం అంటున్నారంటే... వినాశకాలే విపరీత బుద్ధి. ఎంజాయ్ చెయ్యండి. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని... ఇవాళ ఉండవల్లి కూడా చెప్పాడు.. ‘అనుభవిస్తారు మీరు’ అని. అది నిజం. నిజం. నిజం.

   Delete
  2. ప్రస్తుతం రెప రెప కొట్టుకుంటున్నది సీమంద్ర దీపమే, ఇంకెంత ఇంకో మూడు నెలలు. తర్వాత తెలంగాణా రాష్ట్రం ఎలాగు ఏర్పాటు అవుతుంది.

   Delete
  3. అందుకే సిగ్గులేకుండా ఇన్నాళ్లూ సభ ఎట్ల పెట్టుకుంటారో చూస్తామన్నారు. చివరాకరికి తుస్సుమన్నారు. ఇదే రెపరెపలాడటమంటే. నిజమైన దీపం అఖండంగా వెలుగుతుంది.. ఎల్బీ స్టేడియంలో ఎపీఎన్జీవోల సభలాగా...

   Delete
 6. ఇంతకు ముందు జరిగిన తెలంగాణా ఉద్యమానికీ ఇప్పుడు జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికీ హస్తిమశకాంతరం ఉంది.ప్రత్యేక తెలంగానా ఉద్యమం మొదలై ఈ మధ్య వరకూ నేను తెలంగాణా ఉద్యమాన్ని న్యాయబధ్ధమైనదని అమాయకంగా నమ్మి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కామెంట్లు గూదా ఇచ్చాను.కానీ ఉద్యమాన్ని వాళ్ళు నదిపించిన తీరూ, ప్రతేక రాష్ట్ర ప్రకటణని వాళ్ళు సాధించుకున్న తీరూ, ప్రకటన వొచ్చి ఇక ప్రతేక తెలంగాణా ఖాయమైందని తెలిసాక వాళ్ళ్ ధోరణీ చూసాక వీటన్నితినీ మదింపు చేసుకున్నాక నా అభిప్రాయాలు తప్పని అనిపిస్తున్నది. వాళ్ళ కొరికలో న్యాయం ఉంటే దాన్ని చాలా న్యాయమైన పధ్ధతి లో అసెంబ్లీలో చర్చ జరిపించి ఇక్కడి నుంచి విభజనకి ప్రపోజల్ పంపించే పధ్ధతి నే యెన్నుకునే వాళ్ళు.
  జై గొట్టిముక్కల చాలాసార్లు విడిపోవటానికి యేకాభిప్రాయం దేనికి అని చాలా తెలివిగా కనబడే ఒక దుర్మార్గమైన వాదన చేస్తూ ఉందేవాడు. ఈప్పటికీ అలాగే వాదిస్తూ ఉన్నాదనుకుంటాను మొదతి నుంచీ వాళ్ళ పాను అంతా ఇక్కద చర్చ జరగదం తో పని లేకుండా కాంగ్రెసుతో లోపాయకారీ బేరసారాలతో సాధించుకోవాలని.
  తెలంగాణా ని తెచ్చ్కుకోవడానికి కచరా దగ్గిర్నించీ గొట్టిముక్కల వరకూ యెన్నుకున్న దారి యేమిటంటే, యెన్నికల్లో యెక్కువ సీట్లు గిలిచి ఆ బలం తో కాంగ్రెసు(వీళ్ళూ మాకు జరిగినయ్యని చెబుతున్నా అన్ని అన్యాయలకీ - పెద్దమనుషుల ఒప్పనదాన్ని ఉల్లంఘించదం నుంచీ మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను నీ దిక్కున్న చోట చెప్పుకో అనటం వరకూ వాళ్ళని అణిచివేసిన, అవమానించిన పార్టీ) తో బేరసారాల ద్వారా తెచ్చుకోవటం.అందుకోసం వాళ్ళు వాళ్ళ్ అత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టేసారు.
  పత్రికల్లో వొచ్చిన వార్తల ఆధారంగానే కొన్ని విషయాల్ని మీకు గుర్తు చేస్తున్నాను. తెలంగాణా సాధన కోసమని పెట్టిన పర్ట్య్ ప్రతినిధిగా కేంద పరభుత్వం తో సంప్రదింపులు జరపాలంటె యేం చెయ్యాలి?తం న్యాయమైన కోరికలతో ఒక గ్రూపు ని సరన పధధతి లో అపాయింట్మంతు తీసుకుని వెళ్ళి కలవాలి, కాని యెప్పుడు ఢిల్లీ వెళ్ళినా కచరా ఒక్కడే వెళ్ళేవాడు. అక్కద యేం మాట్లాదే వాడో తెలియదు గానీ వొచ్చాక మాత్రం , "అంతా అయిపోయింది వొచ్చే నెలలోనే ఇవ్వడానికి వాళ్ళొప్పేసుకున్నారు" అని వాగే వాడు. ఆ తర్వాత తను యెవర్ని కలిసానని చెప్పాడో వాళ్ళని జర్నలిస్టులు వివరాల కోసం అడిగితే కేసీ ఆర్ నాన్ను కలిసాడా అని హాచ్చెర్య పడిపోవతమో లేదా కలిసిన మాట నిజమే కాని మా మధ్యన తెలంగాణా ప్రస్తావన రాలేదే?! అనో అంటూ ఉండదం మీకందరికీ గుర్త్రు ఉందే ఉంతుంది. దానర్ధం యేమిటి? ఒక ఉద్యమానికి సారధ్యం వజిస్తూ ఆ పర్య్ తరపున సంప్రదింపులు జరపటానికి వెళ్ళిన మనిషికి అలాంటి ప్రతిస్పందన ఋఆవటం అంటే యేమితో మీరు వూహంచుకోండి.
  తనేప్పుడూ కనీసం తెలంగాణా గురించి మాట్లాదడానికి వెళ్ళాల్సిన పధ్ధతి లో వెళ్ళలేదనేది తేలిపోవటం లేదా?రహస సంభాషణల తో లోపాయకారీఎ ఒప్పందాలతో సాధించిన దాన్ని న్యాయమార్గంలో సాధించిన దానితో సమాన్మైన గుర్తింపుని మనం ఇవ్వాలా? యెట్టి పరిస్తితుల్లోనూ విపుల ప్రజా పర్యోజాలకు సంబంధించి విషయాల్లో అలాంటి వాటికి చట్టబత్తత కల్పించజూదదు.
  ఉద్యమం మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ వళ్ళు కక్కిన విషాన్ని బట్టి చూస్తే ఇలాంటి పొరుగు రాష్త్రం చాలా ప్రమాదకరమైనది

  ReplyDelete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts