Skip to main content

Posts

ఆంధ్రా కేజ్రీవాల్ అవ్వాలనుకుంటున్న శివాజికి విశాఖలో చేదు అనుభవం

ఏదో ఒక సమస్య తీసుకుని ప్రజా ఉద్యమాలు నడిపి అర్జెంట్‌గా ఏపీలో అగ్రనేతగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న నటుడు శివాజికి దురదృష్టవశాత్తూ నిన్న విశాఖపట్నంలో చుక్కెదురయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం శివాజీ ఇటీవల ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రం నలువైపులా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో మొదటి సమావేశం నిర్వహించారుకూడా. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలోని ప్లాటినంజుబ్లీ హాల్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశంలో మాట్లాడుతూ కొందరు వక్తలు బీజేపీ, టీడీపీ పార్టీలను విమర్శించినపుడు శివాజీ వారిని అడ్డుకుని మైక్ కట్ చేశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వక్తలను శివాజి అనుచరులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో  అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసంతృప్తికి గురైన శివాజి, ఇలా అయితే వెళ్ళిపోతానంటూ తన అనుచరులతోసహా అక్కడనుంచి కారులో ఉడాయించారు. ఓర్పు, సహనంలేని శివాజికి రాజకీయాలు ఎందుకంటూ సమావేశానికి హాజరైన విద్యార్థులు, ఉద్యమకారులు హీరోగారిని తీవ్రంగా దుర్భాషలాడారు. ఈ సమావేశంతాలూకు వీడియోను ఇక్కడ చూడొచ్చు. 'మాస...

పేపర్లకెక్కిన అక్కినేని ఫ్యామిలీ: జప్తు నోటీసులు జారీచేసిన బ్యాంక్‌లు

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో అన్నపూర్ణ స్టూడియోస్‌కు చెందిన అత్యంత విలువైన 7 ఎకరాలు 25 గుంటల స్థలాన్ని ఇండియన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ అధికారులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. స్టూడియోస్‌తరపున తమవద్ద తీసుకున్న రుణాలకు సంబంధించి రు. 62కోట్లు బకాయి ఉందని, దీనిపై గత ఏడాది జనవరి రెండున డిమాండ్ నోటీస్ జారీ చేసినప్పటికీ రుణగ్రహీతలు స్పందించనందున 20మార్చి 2015న స్టూడియోస్‌ తరపున తనఖా పెట్టిన స్థలాన్ని స్వాధీన పరుచుకున్నట్లు బ్యాంక్ అధికారులు ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ స్థలానికి సంబంధించి ఎట్టి లావాదేవీలూ జరుపరాదని హెచ్చరించారు. రుణాన్ని తీసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన కుమారులు నాగార్జునరావు(నాగార్జున) ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అయితే నాగేశ్వరరావు చనిపోయినందున  నాగార్జునతోబాటు నాగేశ్వరరావు వారసులు వెంకట నారాయణరావు(వెంకట్), కుమార్తె నాగసుశీల('కరెంట్' సుశాంత్ తల్లి), మరో కుమార్తె సరోజ మనవరాలు సుప్రియ(అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం హీరోయిన్), ఇంకా నిమ్మగడ్డ ప్రసాద్(వాన్‌పిక్, మ్యాట్రిక్స్, మాటీవీ), వెంకటేశ్ రొడ్డం...

యాపిల్‌వారి మరో ప్రతిష్ఠాత్మక ఉత్పాదన 'యాపిల్ వాచ్' ఆవిష్కారం!

మ్యాక్, ఐపాడ్, ఐఫోన్, మ్యాక్ బుక్, ఐపేడ్‌వంటి అత్యుత్తమమైన ఉత్పత్తులతో చరిత్ర సృష్టించిన యాపిల్ సంస్థ, తమ మరో ప్రతిష్ఠాత్మక ఉత్పత్తి 'యాపిల్ వాచ్‌'ను నిన్న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో విడుదల చేసింది.  దీనిని రెండు సైజులలో వివిధ మోడల్స్, డిజైన్లలో తయారు చేశారు. ప్రారంభ దర - 349 అమెరికన్ డాలర్లు. ఇది సుమారు రు.21 వేలకు సమానం. గరిష్ఠధర - 17,000 అమెరికన్ డాలర్లు(రు. 10,20,000). గరిష్ఠ మోడల్‌ వాచ్‌ను 18 క్యారట్ల బంగారంతో రూపొందించారు. డిస్‌ప్లే గ్లాస్‌ను సఫైర్(నీలం)తో తయారు చేశారు. వచ్చేనెల పదినుంచి ఆర్డర్‌లు బుక్ చేసుకోవచ్చని, 24నుంచి స్టోర్లలో అందుబాటులో ఉంటుందని సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. ఐఫోన్ చేసే కాల్స్, మెసేజెస్, పేమెంట్స్‌వంటి పలు పనులతోబాటుగా ధరించినవారి హృదయ స్పందనలను(హార్ట్ బీట్), వారు చేసే వ్యాయామం వివరాలను కూడా నమోదు చేస్తుందని కుక్ చెప్పారు. చేయవలసినపనులను(రిమైండర్స్) మణికట్టుమీద తట్టిమరీ గుర్తు చేస్తుందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లలో చెక్‌ఇన్ చేయటానికి, కొన్ని హోటల్స్‌లో గదులకు తాళంగాకూడా ఈ వాచ్‌ను ఉపయోగించొచ్చని టిమ్ కుక్ నిన్న ఆవిష్కరణ కార్యక్రమంలో చె...

ఢిల్లీలో అద్భుతాన్ని ఆవిష్కరించిన సామాన్య మానవుడు!

ఎనిమిది నెలలక్రితం తిరుగులేని మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న 'మోడి-షా అండ్ కో'కు ఢిల్లీ ఆమ్ ఆద్మీలు(సామాన్య మానవులు) దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. ప్రభుత్వంలో, పార్టీలో ఏకపక్షంగా - కేంద్రీకృతంగా వ్యవహారాలు నడుపుతున్న మోడి-షా ద్వయానికి ఇది చెంపపెట్టు. అమిత్ షా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికలలో తన శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. తమపార్టీ ఎంపీలు 300మందినికూడా అమిత్ షా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దించారు. ఢిల్లీ నగరంలో గణనీయసంఖ్యలో ఉన్న ఆంధ్రప్రాంత తెలుగువారిని ఆకట్టుకోవటంకోసం ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు. ఆఖరు నిమిషంలో కిరణ్‌బేడిని పార్టీలోకి తీసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు(దీంతో అంతర్గత విభేదాలు మొదలై ఇదే చివరికి 'బూమరాంగ్' అయింది). స్వయంగా నరేంద్ర మోడి విస్తృతంగా ప్రచారసభలలో పాల్గొని ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చేసిన తప్పులను తెలుసుకుని దాదాపు సంవత్సరకాలంగా పక్కా ప్రణాళికతో పనిచేస్తూ లక్ష్యాన్ని సాధించింది. పా...

'superlative' ముఖ్యమంత్రి కేసీఆర్

చిన్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్‌ చదువుకున్నవారందరికీ parts of speech లోని ఎనిమిది భాగాలలో Adjective అనేది గుర్తుండే ఉంటుంది. ఆ Adjectiveలో Superlative Adjective అనే మరో సబ్ క్యాటగిరీ ఉంటుంది. ఆ సూపర్‌లేటివ్ ఎడ్జెక్టివ్‌కు అర్థం 'సర్వోత్కృష్టమమైనది' అని. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకయ్యా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సమయాలలో, సందర్భాలలో ఆయా సమస్యలకు ప్రకటిస్తున్న 'సర్వోత్కృష్ట' పరిష్కారాలగురించి చెప్పేందుకు. అదేమిటో ఏ సమస్యకుకూడా సర్వోత్తమమైనది తప్పితే దానికి తక్కువస్థాయిలో పరిష్కారం కేసీఆర్‌కు కనబడదు.  ఏదైనా సమస్యను వివరించటం ఆలస్యం ఆయన దానికి సర్వోత్కృష్టమైన పరిష్కారం ప్రకటించిపారేస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం సందర్భంగా మొదలుపెట్టిన ఈ పోకడ, అధికారం చేపట్టిన ఆర్నెల్ల తర్వాతకూడా కొనసాగుతూనేఉంది. నాడు ప్రచారంలో పేదలకు డబల్ బెడ్‌రూమ్ ఫ్లాట్, మూడెకరాల పొలం, కోటి ఎకరాలకు సాగునీరు, లక్షా 25వేల ఉద్యోగాలు, ముస్లిమ్‌లకు 12శాతం రిజర్వేషన్లు వంటి వాగ్దానాలు చేశారు. వాటి ఆచరణ ఏదశలో ఉందో ఎవరికీ తెలియదు. వాగ్దానాలుమాత్రం  అధికారం చేపట్టిన తర్వాత మరింత జోర...

'ఆగడు' కాదు - 'దూకుడు సింగ్'

టీజర్ విడుదలదగ్గరనుంచి గబ్బర్ సింగ్ తో పోల్చబడుతున్న 'ఆగడు' చిత్రం, నిన్న విడుదలతర్వాతచూస్తే ఆ వాదనను నిజంచేసేటట్లుగా ఉంది. చిత్ర రచయితలు, దర్శకుడు శ్రీనువైట్లపై గబ్బర్ సింగ్ ప్రభావం స్పష్టంగా...ముఖ్యంగా మూలకథలో, ఫస్ట్ హాఫ్  లో, సన్నివేశాలలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మరోవైపు శ్రీనువైట్ల-మహేష్ కాంబినేషన్లో వచ్చిన దూకుడు ప్రభావం మరోవైపు. వెరసి ఇది దూకుడుసింగ్ అయింది. ఈ పరమ రొటీన్, ఫార్ములా కథకు కథనంలో కొత్తదనం ఏమీ లేకపోవటం పెద్ద మైనస్. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవపెట్టుకునే దర్శకుడు శ్రీనువైట్ల ఈ సారి కోనవెంకట్, గోపిమోహన్ లతో గొడవపెట్టుకుని 'ఆగడు'కు అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ అనే కొత్త రచయితలను పెట్టుకున్నారు. వీరి డైలాగులు బాగానే ఉన్నప్పటికీ అవి సంక్లిష్టంగా, హైరేంజ్ లో ఉండటం ప్రధానంగా మైనస్ పాయింట్. మహేష్ విలన్స్ ను ట్రాప్ చేయటానికి తన పాత హిట్ సినిమాల కథలను చెప్పే కాన్సెప్ట్ సులభంగా అర్ధంకావటంలేదు. మీలో ఎవరు పోటుగాడు ఎపిసోడ్ లోని కాన్సెప్ట్ కూడా అలాగే ఉంది. డైలాగులు, అరుపులు, పంచ్ లు సినిమాలో బాగా ఎక్కువైపోయాయి. మహేష్ డైలాగులు కొన్నిచోట్ల అర్ధంకాన...

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన చెప్పుదెబ్బ!

శతాధిక చిత్రాల దర్శకుడు, అన్నమయ్య, రామదాసువంటి 'కళాఖండాల' సృష్టికర్త కె.రాఘవేంద్రరావు గతంలో ఒకసారి ప్రముఖ నిర్మాత కె.మురారి చెప్పుదెబ్బనుంచి తృటిలో తప్పించుకున్నారట. ఈ వైనాన్ని మురారి ఇవాళ చెన్నైలో స్వయంగా వివరించారు.  చెన్నైలో నివసిస్తున్న మురారి ఇవాళ ఒక పుస్తకా‌విష్కరణ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రాఘవేంద్రరావుకు గీతం యూనివర్సిటీ యాజమాన్యం డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించడంపై స్పందించారు. సంస్కారహీనుడైన రాఘవేంద్రరావుకు డాక్టరేట్ ఇవ్వటంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ డాక్టరేట్‌లు ప్రకటింటిన ముగ్గురిలో మిగిలిన ఇద్దరి విషయంలో ఎవరూ వేలెత్తి చూపాల్సిన అవసరంలేదని, అయితే రాఘవేంద్రరావుకు ఇవ్వటం సరైన నిర్ణయం కాదని మురారి అన్నారు. గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మూర్తి అంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పారు.  ఇక రాఘవేంద్రరావు గురించి చెప్పుకొస్తూ, అతనికి సంస్కారం లేదని, పెద్దలంటే గౌరవంలేదని మురారి అన్నారు. ఒకసారి అతను తమ ఇంటికి వచ్చినపుడు తమ ఇంటి హాల్‌లో తన తల్లిదండ్రుల ఫోటోను చూశాడని, ఆ ఫోటోలోని తన తల్లిని ఉద్దేశించి ఏమిటి నల్లగా,...