Skip to main content

Posts

ఢిల్లీలో అద్భుతాన్ని ఆవిష్కరించిన సామాన్య మానవుడు!

ఎనిమిది నెలలక్రితం తిరుగులేని మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న 'మోడి-షా అండ్ కో'కు ఢిల్లీ ఆమ్ ఆద్మీలు(సామాన్య మానవులు) దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. ప్రభుత్వంలో, పార్టీలో ఏకపక్షంగా - కేంద్రీకృతంగా వ్యవహారాలు నడుపుతున్న మోడి-షా ద్వయానికి ఇది చెంపపెట్టు. అమిత్ షా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికలలో తన శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. తమపార్టీ ఎంపీలు 300మందినికూడా అమిత్ షా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దించారు. ఢిల్లీ నగరంలో గణనీయసంఖ్యలో ఉన్న ఆంధ్రప్రాంత తెలుగువారిని ఆకట్టుకోవటంకోసం ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు. ఆఖరు నిమిషంలో కిరణ్‌బేడిని పార్టీలోకి తీసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు(దీంతో అంతర్గత విభేదాలు మొదలై ఇదే చివరికి 'బూమరాంగ్' అయింది). స్వయంగా నరేంద్ర మోడి విస్తృతంగా ప్రచారసభలలో పాల్గొని ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చేసిన తప్పులను తెలుసుకుని దాదాపు సంవత్సరకాలంగా పక్కా ప్రణాళికతో పనిచేస్తూ లక్ష్యాన్ని సాధించింది. పా...

'superlative' ముఖ్యమంత్రి కేసీఆర్

చిన్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్‌ చదువుకున్నవారందరికీ parts of speech లోని ఎనిమిది భాగాలలో Adjective అనేది గుర్తుండే ఉంటుంది. ఆ Adjectiveలో Superlative Adjective అనే మరో సబ్ క్యాటగిరీ ఉంటుంది. ఆ సూపర్‌లేటివ్ ఎడ్జెక్టివ్‌కు అర్థం 'సర్వోత్కృష్టమమైనది' అని. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకయ్యా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సమయాలలో, సందర్భాలలో ఆయా సమస్యలకు ప్రకటిస్తున్న 'సర్వోత్కృష్ట' పరిష్కారాలగురించి చెప్పేందుకు. అదేమిటో ఏ సమస్యకుకూడా సర్వోత్తమమైనది తప్పితే దానికి తక్కువస్థాయిలో పరిష్కారం కేసీఆర్‌కు కనబడదు.  ఏదైనా సమస్యను వివరించటం ఆలస్యం ఆయన దానికి సర్వోత్కృష్టమైన పరిష్కారం ప్రకటించిపారేస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం సందర్భంగా మొదలుపెట్టిన ఈ పోకడ, అధికారం చేపట్టిన ఆర్నెల్ల తర్వాతకూడా కొనసాగుతూనేఉంది. నాడు ప్రచారంలో పేదలకు డబల్ బెడ్‌రూమ్ ఫ్లాట్, మూడెకరాల పొలం, కోటి ఎకరాలకు సాగునీరు, లక్షా 25వేల ఉద్యోగాలు, ముస్లిమ్‌లకు 12శాతం రిజర్వేషన్లు వంటి వాగ్దానాలు చేశారు. వాటి ఆచరణ ఏదశలో ఉందో ఎవరికీ తెలియదు. వాగ్దానాలుమాత్రం  అధికారం చేపట్టిన తర్వాత మరింత జోర...

'ఆగడు' కాదు - 'దూకుడు సింగ్'

టీజర్ విడుదలదగ్గరనుంచి గబ్బర్ సింగ్ తో పోల్చబడుతున్న 'ఆగడు' చిత్రం, నిన్న విడుదలతర్వాతచూస్తే ఆ వాదనను నిజంచేసేటట్లుగా ఉంది. చిత్ర రచయితలు, దర్శకుడు శ్రీనువైట్లపై గబ్బర్ సింగ్ ప్రభావం స్పష్టంగా...ముఖ్యంగా మూలకథలో, ఫస్ట్ హాఫ్  లో, సన్నివేశాలలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మరోవైపు శ్రీనువైట్ల-మహేష్ కాంబినేషన్లో వచ్చిన దూకుడు ప్రభావం మరోవైపు. వెరసి ఇది దూకుడుసింగ్ అయింది. ఈ పరమ రొటీన్, ఫార్ములా కథకు కథనంలో కొత్తదనం ఏమీ లేకపోవటం పెద్ద మైనస్. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవపెట్టుకునే దర్శకుడు శ్రీనువైట్ల ఈ సారి కోనవెంకట్, గోపిమోహన్ లతో గొడవపెట్టుకుని 'ఆగడు'కు అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ అనే కొత్త రచయితలను పెట్టుకున్నారు. వీరి డైలాగులు బాగానే ఉన్నప్పటికీ అవి సంక్లిష్టంగా, హైరేంజ్ లో ఉండటం ప్రధానంగా మైనస్ పాయింట్. మహేష్ విలన్స్ ను ట్రాప్ చేయటానికి తన పాత హిట్ సినిమాల కథలను చెప్పే కాన్సెప్ట్ సులభంగా అర్ధంకావటంలేదు. మీలో ఎవరు పోటుగాడు ఎపిసోడ్ లోని కాన్సెప్ట్ కూడా అలాగే ఉంది. డైలాగులు, అరుపులు, పంచ్ లు సినిమాలో బాగా ఎక్కువైపోయాయి. మహేష్ డైలాగులు కొన్నిచోట్ల అర్ధంకాన...

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన చెప్పుదెబ్బ!

శతాధిక చిత్రాల దర్శకుడు, అన్నమయ్య, రామదాసువంటి 'కళాఖండాల' సృష్టికర్త కె.రాఘవేంద్రరావు గతంలో ఒకసారి ప్రముఖ నిర్మాత కె.మురారి చెప్పుదెబ్బనుంచి తృటిలో తప్పించుకున్నారట. ఈ వైనాన్ని మురారి ఇవాళ చెన్నైలో స్వయంగా వివరించారు.  చెన్నైలో నివసిస్తున్న మురారి ఇవాళ ఒక పుస్తకా‌విష్కరణ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రాఘవేంద్రరావుకు గీతం యూనివర్సిటీ యాజమాన్యం డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించడంపై స్పందించారు. సంస్కారహీనుడైన రాఘవేంద్రరావుకు డాక్టరేట్ ఇవ్వటంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ డాక్టరేట్‌లు ప్రకటింటిన ముగ్గురిలో మిగిలిన ఇద్దరి విషయంలో ఎవరూ వేలెత్తి చూపాల్సిన అవసరంలేదని, అయితే రాఘవేంద్రరావుకు ఇవ్వటం సరైన నిర్ణయం కాదని మురారి అన్నారు. గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మూర్తి అంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పారు.  ఇక రాఘవేంద్రరావు గురించి చెప్పుకొస్తూ, అతనికి సంస్కారం లేదని, పెద్దలంటే గౌరవంలేదని మురారి అన్నారు. ఒకసారి అతను తమ ఇంటికి వచ్చినపుడు తమ ఇంటి హాల్‌లో తన తల్లిదండ్రుల ఫోటోను చూశాడని, ఆ ఫోటోలోని తన తల్లిని ఉద్దేశించి ఏమిటి నల్లగా,...

'నమస్తే తెలంగాణ-2'గా మారుతున్న 'ఈనాడు'

వ్యాపారవేత్తలు పత్రికాధిపతులైతే చాలా ప్రమాదమని పత్రికారంగ పెద్దలు ఏనాడో చెప్పారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపార ప్రయోజనాలకోసం పత్రికా ప్రమాణాలను పణంగా పెడుతున్న ప్రస్తుత తరుణాన్ని ఆ పెద్దలు ఆనాడే ఊహించి ఉంటారు. హైదరాబాద్‌లో, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో పలు వ్యాపారాలను, ఆస్తులను కలిగిఉన్న రామోజీరావు, ఆయన పుత్రరత్నం కిరణ్ - ముఖ్యమంత్రి కేసీఆర్‌పట్ల విధేయత ప్రకటించుకోవడానికి(to be in good books of KCR) నానా తంటాలు పడుతున్నారు. కేసీఆర్‌పై విమర్శలుగానీ, ప్రభుత్వ వ్యతిరేక వార్తలుగానీ తమ పత్రికలో ప్రముఖంగా కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామోజీరావు వ్యాపారాలను కేసీఆర్ ఏమి చేస్తాడనుకుంటున్నారా? తెలంగాణ ప్రభుత్వంవస్తే రామోజీ ఫిలింసిటీని నాగళ్ళతో దున్నిస్తానని గతంలో అన్న కేసీఆర్ ఇప్పుడు అంతపని చేయకపోవచ్చుగానీ, తెలంగాణలో కొత్త ఫిలిమ్ సిటీ(కేసీఆర్ ఇటీవల ఈమేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే) పెడితేమాత్రం అంతపని చేసినట్లే అవుతుంది. కేసీఆర్ చేసే ప్రతిపనినీ విమర్శించాలనీ, ఆయన ప్రతిమాటనూ ఖండించాలని వివేకము, విచక్షణ ఉన్నవారు ఎవరూ అనరు. అయితే వార్తను వార్తగా నివేదించటం, రాగద్వేషాలకతీ...

చంద్రబాబును అభినందించకుండా ఉండలేం!

ఏ వ్యక్తయినా విజయం సాధించగానే ఆ సమయంలో ఆ వ్యక్తిలోని సానుకూల అంశాలు ప్రముఖంగా కనబడతాయి. అయితే 2014 ఎన్నికలలో చంద్రబాబు సాధించిన విజయం ఆషామాషీది కాదు. పదేళ్ళపాటు అత్యంత కఠినాత్మక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొనికూడా పార్టీని కాపాడుకుంటూ తిరిగి అధికారపగ్గాలు చేపట్టటం ఒక విజయగాధ అనే చెప్పాలి. ఆయన విజయంనుంచి స్ఫూర్తి పొందవలసింది ఎంత అనేది తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం.  పదేళ్ళపాటు అత్యంత ప్రతికూల, కఠినాతి కఠిన పరిస్థితులను, అవమానాలను, హేళనలను ఎదుర్కొన్నారు.  ప్రత్యర్ధి పార్టీలలోని గల్లీనాయకులనుంచి ఢిల్లీ నేతలదాకా ప్రతిఒక్కరూ చంద్రబాబును తిట్టేవారే.  ఇక సొంతపార్టీనుంచి పలువురు అగ్రనాయకులు ఇతరపార్టీలకు క్యూకట్టటం.  కుటుంబంలో అసంతృప్తితో రగులుతున్న  ఒకవర్గం .  ఒకానొక సమయంలో పార్టీ అస్తిత్వమే ప్రశ్నార్ధకంగా మారింది.   ఇంతటి పరిస్థితులలో మరొకరైతే కాడిపారేసి పారిపోయేవారని చెప్పకతప్పదు. చంద్రబాబు వీటన్నంటినీ తట్టుకున్నారు. మళ్ళీ పార్టీని మళ్ళీ విజయందిశగా నడిపించి అధికారాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఆయన అనుసరించిన సహనం, ఓర్పు, సానుకూలవైఖరి, పట్టుదల, ...

గ్రేట్‌ఆంధ్ర.కామ్‌వారూ! ఇది సబబేనా?

బ్లాగ్ ప్రపంచంలో ఇప్పటికే ఈ కాపీకొట్టడాలు, చెత్తకామెంట్లకు జడిసి చాలామంది మంచి మంచి బ్లాగర్‌లు పోస్ట్‌లు రాయటం ఆపేశారు. ఇటీవల 'కష్టేఫలి' బ్లాగ్ శర్మగారుకూడా అస్త్రసన్యాసం చేయాలనుకున్నప్పటికీ మిగిలిన బ్లాగర్‌ల అభ్యర్ధనలను మన్నించి విరమించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్లాగు రచయితకుకూడా కష్టేఫలి శర్మగారిలాంటి అనుభవం ఎదురైంది. ఈనెల 12న ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత కె.మురారి చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించి దర్శకుడు రాఘవేంద్రరావుకు గీతం యూనివర్సిటీవారు డాక్టరేట్ ఇవ్వటంపై స్పందించారు. రాఘవేంద్రరావువంటి సంస్కారహీనుడికి గౌరవ డాక్టరేట్ ఇవ్వటమేమిటంటూ ధ్వజమెత్తారు. ఈ ప్రెస్‌మీట్‌కు తెలుగు రిపోర్టర్‌లందరూ వెళ్ళినప్పటికీ రాఘవేంద్రరావుఅంటే భయమో, భక్తోగానీ 10టీవీతప్పితే మిగిలిన ఏ తెలుగు దినపత్రికగానీ, ఛానల్‌గానీ ఆ వార్తను ఇవ్వలేదు. 10టీవీవారుమాత్రం సమాచారం అందిన వెంటనే తమ చెన్నై రిపోర్టర్‌ ఫోన్ ఇన్ తీసుకుని దానిని ప్రసారం చేశారు. యథాలాపంగా టీవీఛానళ్ళన్నిటినీ చూస్తూ 10టీవీలో ఆ వార్తను చూసిన ఈ బ్లాగర్ అదేరోజు మూడుగంటల ప్రాంతంలో దానిపై 'దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన చ...