Wednesday, May 14, 2014

గ్రేట్‌ఆంధ్ర.కామ్‌వారూ! ఇది సబబేనా?

బ్లాగ్ ప్రపంచంలో ఇప్పటికే ఈ కాపీకొట్టడాలు, చెత్తకామెంట్లకు జడిసి చాలామంది మంచి మంచి బ్లాగర్‌లు పోస్ట్‌లు రాయటం ఆపేశారు. ఇటీవల 'కష్టేఫలి' బ్లాగ్ శర్మగారుకూడా అస్త్రసన్యాసం చేయాలనుకున్నప్పటికీ మిగిలిన బ్లాగర్‌ల అభ్యర్ధనలను మన్నించి విరమించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్లాగు రచయితకుకూడా కష్టేఫలి శర్మగారిలాంటి అనుభవం ఎదురైంది.

ఈనెల 12న ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత కె.మురారి చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించి దర్శకుడు రాఘవేంద్రరావుకు గీతం యూనివర్సిటీవారు డాక్టరేట్ ఇవ్వటంపై స్పందించారు. రాఘవేంద్రరావువంటి సంస్కారహీనుడికి గౌరవ డాక్టరేట్ ఇవ్వటమేమిటంటూ ధ్వజమెత్తారు. ఈ ప్రెస్‌మీట్‌కు తెలుగు రిపోర్టర్‌లందరూ వెళ్ళినప్పటికీ రాఘవేంద్రరావుఅంటే భయమో, భక్తోగానీ 10టీవీతప్పితే మిగిలిన ఏ తెలుగు దినపత్రికగానీ, ఛానల్‌గానీ ఆ వార్తను ఇవ్వలేదు. 10టీవీవారుమాత్రం సమాచారం అందిన వెంటనే తమ చెన్నై రిపోర్టర్‌ ఫోన్ ఇన్ తీసుకుని దానిని ప్రసారం చేశారు.

యథాలాపంగా టీవీఛానళ్ళన్నిటినీ చూస్తూ 10టీవీలో ఆ వార్తను చూసిన ఈ బ్లాగర్ అదేరోజు మూడుగంటల ప్రాంతంలో దానిపై 'దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన చెప్పుదెబ్బ' అంటూ ఒక పోస్ట్ రాయటం జరిగింది. గ్రేట్ ఆంధ్ర.కామ్‌వారు 13వ తేది ఉదయాన 'రాఘవేంద్రరావుకు చెప్పుదెబ్బలు తప్పాయట' అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు(ఈ వెబ్‌సైట్‌వారు పోస్ట్ చేసే సమయం పదిగంటలు వెనకకు ఉంటుంది. అందుకనే ఆ ఆర్టికల్‌ను పోస్ట్ చేసిన సమయంచూస్తే 12వతేది రాత్రి పదిగంటలకు పోస్ట్ చేసినట్లుగా ఉంటుంది). ఈ రెండు ఆర్టికల్స్‌నూ గమనిస్తే వారు ఎలా కాపీ కొట్టినదీ అర్ధమవుతుంది. ఈ బ్లాగర్ అంతకుముందు ఈనాడుపై రాసిన ఆర్టికల్‌లోని లైన్‌ను కూడా గ్రేట్‌ఆంధ్రవారు ఇలాగే తీసుకుని కొద్దిగా అటూఇటూ మార్చి తమదైన శైలిలో 'నోరు జార్ చక్రవర్తి' అంటూ  ఇచ్చారు.  

దట్స్ తెలుగు.కామ్‌వారికైతే ఇలాంటి కంటెంట్ చౌర్యం సర్వసాధారణం. ఈ బ్లాగ్‌‌లో గతంలో ఉదయభానుగురించి రాసిన ఒకపోస్ట్‌నుంచి వారు చేసిన చౌర్యాన్ని ఇక్కడ చూడొచ్చు. ఈ బ్లాగ్‌పోస్ట్‌లోని పదాలనుకూడా వారు మక్కికిమక్కి దించేశారు. దాని తాలూకు స్క్రీన్‌షాట్‌నుకూడా ఇక్కడ చూడొచ్చు.
ఎవరైనా ఈ బ్లాగులలో విషయం బాగుందనిపించి మరోచోట వినియోగించదలుచుకుంటే సదరు బ్లాగ్ రచయిత అనుమతి తీసుకోవటం నైతిక సంప్రదాయం. కాబట్టి గ్రేట్ఆంధ్రవారూ! తమరు ఆ నైతిక సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని మనవి.

                                                    
                                                ***


p.s. ఈ బ్లాగ్‌లోని కంటెంట్‌ తీసుకోవాలనుకునాలనుకునేవారు, కంటెంట్ సేవలు అవసరమైనవారు ఈ ఇ-మెయిల్ ఐడీని - tejasswi11@gmail.com సంప్రదించగలరు.


6 comments:

 1. ఇటీవల 'కష్టేఫలి' శర్మగారుకూడా అస్త్రసన్యాసం చేయాలనుకున్నప్పటికీ మిగిలిన బ్లాగర్‌ల అభ్యర్ధనలను మన్నించి విరమించుకున్న విషయం తెలిసిందే

  నిజమా? ఐతే చాలా సంతోషమే.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయంగారూ! నమస్తే. శర్మగారి పోస్టలు కనబడుతున్నాయికాబట్టి ఆయన అస్త్రసన్యాసం చేయలేదనుకుంటున్నాను.

   Delete
 2. బ్లాగర్లకు ఒక సూచన:
  మీ కాంతెంట్ కాపీ ఐనదని నిర్థారణ అయినప్పుడు తప్పకుండా దానిని గూగుల్‌కు రిపోర్టు చేసి సదరు కాపీ బ్లాగును తొలగించవలసిందిగా కోరవచ్చును, అది మరొక గూగుల్ బ్లాగ్ ఐనప్పుడు.

  ReplyDelete
 3. GaA di elaka burra , burraloa saraku leakumtea ilaanea cheastaaru , bhaava daridram

  ReplyDelete
 4. మీ అభిప్రాయాలు మీ బ్లాగుకే పరిమితం కాకుండా మరో పది మందికి చేరుతున్నందకు గర్వించాలి కాని, ఇలా బాద పడితే ఎలా సార్? మీరి బాగా వ్రాస్తారని ఆ కాపీ కొట్టినోడికి తెలుసు కదా!

  పదిమందికి చేరడానికి కాకుండా, మీరు అమ్ముకొవడానికి అయితే ఇక్కడ ప్రచురించడం దేనికి? అంత అమూల్యమైన మీకు సంబందించిన అభిప్రాయం అయితే కంటెంట్ కాపీ రైటు చేయించుకోండి.

  ReplyDelete
  Replies
  1. ఎక్స్‌వైజడ్‌గారూ! మీ ఇంట్లోనుంచి ఏదైనా డబ్బో, వస్తువో దొంగతనం జరిగితే - అది నాదగ్గర ఉంది కాబట్టేకదా దొంగలు దానిని దొంగిలించారు, ఎవరో ఒకరు అనుభవిస్తున్నారులే అని మీలాంటి మహానుభావులు గర్వించి ఆనందిస్తారేమోగానీ సగటుజీవులందరికీ అది సాధ్యంకాదండి.

   బ్లాగులలో జరుగుతున్న కంటెంట్ చౌర్యంపై ఇంత మంచి విలువైన సూచన చేశారంటే మీరు గ్రేటో, దట్సో అయిఉంటారు.

   Delete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts