Saturday, March 29, 2014

పవన్ విశాఖ ప్రసంగంలో ఒక చెప్పుకోదగ్గ పాయింట్


జనసేన పార్టీ, దాని సిద్ధాంతాలు, పవన్ 'ఇజం'పైన ఎన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, విశాఖపట్నం ప్రసంగంలో కళ్యాణ్ లేవనెత్తిన ఒక పాయింట్‌‌ మాత్రం అధికశాతంమందినుంచి ప్రశంసలు అందుకుంటోంది.. అదేమిటంటే, రానున్న లోక్‌సభ ఎన్నికలకుగానూ అభ్యర్ధులను ఎంపికచేయటానికి కాంగ్రెస్ పెద్దలు వార్ రూమ్‌లో ఏకబిగిన 12గంటలపాటు చర్చలు జరిపినట్లు నిన్న దినపత్రికలలో వచ్చిన వార్తగురించి. సొంతపార్టీ అభ్యర్ధుల ఎంపికపై ఇంత సుదీర్ఘ కసరత్తు చేసే కాంగ్రెస్ పార్టీ - దేశంలోని అతిపెద్దరాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించటంపై అదే వార్ రూమ్‌లో 40నిమిషాలలో నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రప్రజల మనోభావాలంటే కాంగ్రెస్ పార్టీకి అంత చులకనగా ఉందా అంటూ నిప్పులు చెరిగారు.

ఈ పాయింట్‌ను మాత్రం అందరూ ఒప్పుకుని తీరాలి. పదేళ్ళుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్నికలు రాబోతున్నాయనగా, ఆఖరినిమిషంలో విభజనకు అంగీకరించటం తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించికాదని, ఓట్లకోసమేనని అందరికీ తెలిసిన విషయమే. ఆ మాటకొస్తే, కాంగ్రెస్ పార్టీ హడావుడిగా ప్రవేశపెట్టిన ఈ విభజనబిల్లువలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నమాటేగానీ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పూర్తిగా నెరవేరటంలేదని, పలు నష్టాలున్నాయని కేసీఆర్‌తోసహా పలువురు తెలంగాణవాదులు చెబుతున్నసంగతి తెలిసిందే(తెలంగాణ ఉద్యమానికి ఇది ఇంటర్వెల్ - కేసీఆర్).

అటు సీమాంధ్ర ప్రయోజనాలకు సంబంధించికూడా, ఆ ప్రాంత కేంద్రమంత్రులు ప్రతిపాదించిన పలు సవరణలు పెట్టకుండానే కాంగ్రెస్ పార్టీ హడావుడిగా ఉభయసభలలో దానిని ఆమోదింపజేసింది. పైగా ఇంత ముఖ్యమైన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టేసమయంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌గానీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీగానీ సభలో లేకపోవటం గమనార్హం.

అందుకే, పవన్ ప్రసంగంలో కాంగ్రెస్‌పై చేసిన విమర్శలలో ఇదిమాత్రం అతని సినిమాలలో సూపర్‌హిట్ డైలాగులాగా బాగా పేలిందని చెప్పాలి.

6 comments:

 1. "అందరినీ ఆకట్టుకుంది"

  అందరు అంటే ఆంద్ర వారు మాత్రమెనా? ఇంతోటి విషయం తెలంగాణా వారిని ఆకట్టుకుందా?

  ఇకపోతే అసలు విషయానికి వద్దాం. పదేళ్లుగా వివిధ పార్టీలలో, అఖిలపక్షాలలో, చట్టసభలలో & ప్రభుత్వ స్తాయిలో వేలాది ఘంటల చర్చలు జరగలేదా? కొన్నిటిలో తమరి అన్నలుం గారి మాజీ పార్టీ కూడా భాగం అనే విషయం తమ్ములుం గారు మరిచారా? వాటిన్నిటినీ వదిలేసి నలభై నిమిషాలంటూ ఏడవడం తమ్ములుం గారి భావ దారిద్ర్యానికి & అజ్ఞానానికి పరాకాష్ట.

  ReplyDelete
 2. One thing I don't understand is how this division of state benefiting Congress party, and if it is the case why did BJP supported it. On top of that how these so called samaikyandhra parties forming alliance with BJP, which is also a party to this bifurcation.

  ReplyDelete
  Replies
  1. TDP is not a samaikyandhra party. Their official stand is Telangana formation with "samanyayam" for Seemandhra.

   Delete
  2. కదా జై గోరు, మరెందుకు మీ తెలంగాణా దొర గారు & కో, గుండు మందుసూదన లాంటోరు దానిమీద(TDP) పడి కోటి ఏడుపులు ఏడుస్తూ ఉంటే, మీ లాంటి మెతావులు ఎవరూ దానిని ఎప్పుడూ ఖండిచరు సమీ!!

   జరంత సెప్పరాదే మీ తోటి తెలంగాణా జనానికి, మేమేమన్నా సెప్తామంటే, మళ్ళీ ఆంధ్రోళ్ల కుట్ర అంటూ కోటి ఏడుపులాయన ఈసారి ముక్కోటి ఏడుపులు ఏడుస్తూ ఇంకో పద్దెమెత్తుకొంటాడేమో

   Delete
  3. సమన్యాయం అంటే ఏమిటో బాబు గారు చెప్పాక ఆలోచిస్తాను. అసలు న్యాయానికి సమన్యాయం & అసమన్యాయం అంటూ ఉంటాయా?

   Delete
  4. వాడి బొంద మీద సమన్యాయం, ఆ తెలివి తక్కువ మాటని కనీసం మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు వాగుతూ కూడా అందులో ఉన్న తెలివి తక్కువ తనాన్ని తెలుసుకోలేని బులేనా వాడు!

   Delete

Featured Post

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చి...

All Time Popular Posts