త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ పార్టీ, తెలంగాణలో తెరాస మెజారిటీ సాధిస్తాయని తాము నిర్వహించిన సర్వేలో తేలినట్లు నీల్సన్-ఎన్‌టీవీ సంస్థలు వెల్లడించాయి . ఇవాళ వెలువడిన ఈ సర్వేఫలితాల ప్రకారం, సీమాంధ్రలో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి 129-133, తెలుగుదేశానికి 42-46, కాంగ్రెస్‌కు 0 స్థానాలు, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ పార్టీకి 19-21స్థానాలు, తెలుగుదేశానికి 4-6, కాంగ్రెస్‌కు 0 స్థానాలు లభిస్తాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 51-57, కాంగ్రెస్‌కు 46-52, బీజేపీకి 5-8, తెలుగుదేశానికి 4-6,ఎమ్ఐఎమ్‌కు 7-8, పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసకు 6-8, కాంగ్రెస్‌కు 7-9 సీట్లు దక్కనున్నాయని సర్వే చెబుతోంది. అయితే, అభ్యర్ధుల ఎంపిక, పొత్తుల ఖరారు తర్వాత ఈసర్వే ఫలితాలలో స్వల్ప తేడాలుంటాయని, మళ్ళీ తాము కొద్దిరోజులలో మరో సర్వే జరపబోతున్నామని, అప్పుడు మరింత ఖచ్చితత్వం వస్తుందని నీల్సన్ సంస్థ ప్రతినిధి శేషగిరిరావు చెప్పారు. సీమాంధ్రలో జగన్ పార్టీ ప్రభావం నిలకడగా ఉంటుండగా, తెలుగుదేశం పుంజుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండుపార్టీలమధ్య ఓట్లశాతం తేడా ఎ...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides