కేరళలోని మళయాళ మనోరమగ్రూప్ కు చెందిన ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ 'మళవిల్ మనోరమ' ఓనమ్ సందర్భంగా, ఈనెల 15న తమ ఛానల్ లో 'మల్లు' అర్జున్ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. అరగంటకుపైగా సాగిన ఆ కార్యక్రమంలో అతనిని వ్యక్తిగత విషయాలగురించి తెలుగులోకూడా ఎవరూ అడగనంత వివరంగా, చిన్న చిన్న వాటినికూడా ప్రస్తావిస్తూ ఆ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసింది. అతనిని మళయాళ ప్రేక్షకులు ఎంత నిశితంగా గమనిస్తున్నారనేది, అతనికి అక్కడ ఎంత ఫాలోయింగ్ ఉందనేది ఆ యాంకర్ మాటలనుబట్టి అర్థమవుతోంది . ప్రతి సినిమాలోనూ అల్లు అర్జున్ ను మొదట హీరోయిన్ ఇష్టపడదని , చివరకు మాత్రం అతను ఆమె హృదయాన్ని , ప్రేక్షకుల సానుభూతిని గెలుచుకుంటాడంటూ ఆర్య , హ్యాపీ , జులాయి చిత్రాలను ఉదాహరణలుగా చూపిస్తూ విశ్లేషించింది . రెడ్ బుల్ త్రాగినట్లు అంతబాగా డాన్స్ లు చేయటానికి ఎనర్జీ ఎక్కడనుంచి వస్తుందని ప్రశ్నించింది . మళయాళ యువత అతనంటే ఊగిపోతున్నారని, ఏ మూలకు వెళ్ళినాఅల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ బోర్డ్ కనబడుతోందని ఆ యాంకర్ చెప్పింది. క...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides