Skip to main content

Posts

ఫ్లాష్‌బ్యాక్: పీవీపై సోనియా కక్షసాధింపు వెనక అసలు కథ ఇదీ!

రెండున్నర దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి పీవీ నరసింహారావును సోనియా ప్రశంసించటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధినేత్రి, ఎందుకు ఇలా టర్న్ ఎరౌండ్ తీసుకుందనేదానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. అయితే ఈ వ్యాసం దానిగురించి కాదు. అసలు వారిద్దరికీ మధ్య జరిగిన కోల్డ్ వార్ గురించి చాలామందికి తెలియక అత్యధికశాతం జనం సోనియాదే తప్పన్నట్లుగా judgements ఇచ్చేస్తున్నారు... ముఖ్యంగా తెలుగువారు. అందులోనూ ఒక సామాజికవర్గంవారైతే గత పదిహేనేళ్ళుగా సోనియాపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ సామాజికవర్గంలోని అత్యధికులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గంపగుత్తగా మద్దతు ఇస్తుండటానికి ఇదికూడా ఒక ప్రధాన కారణం అని అంటారు. ఇక సోనియా - పీవీ కోల్డ్ వార్, దానికి కారణాలను ఒకసారి పరిశీలిద్దాం.                                                       పూర్తివ్యాసంచదవటానికి ఇక్కడ  నొక్కండి.  https://trendingtelugunews.com/top-stories/features/sonia-versus-pv-narasimharao...

కమ్మవారిని దెబ్బతీయటానికే రాజధానిని జగన్ మార్చారా?

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు ...

ఇది నిజంగా సంచలనం! తమిళ బిగ్‌బాస్-3 టైటిల్ గెలుచుకుంది ఓ తెలుగువాడు!

అవును, గతవారం ముగిసిన తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ను  గెలుచుకున్న ముగేన్ రావు మలేషియా దేశానికి చెందిన తెలుగు సంతతి కుర్రాడు. టీనేజ్ లో గ్యాంగ్ స్టర్ లాగా అవ్వాలని అనుకుని, తిరిగి ఆ దారిని వదిలి సింగర్ గా మారి ఇప్పుడు రాత్రికి రాత్రి ఒక సెలబ్రిటీ అయిపోయిన ఈ 24 ఏళ్ళ యువకుడి ప్రస్థానం అనూహ్యం, విలక్షణం. పూర్తి కథనం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

జగన్‌లో ఎంత మార్పు!

జగన్‌లో పదేళ్ళలో ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఫలితాలు వెలువడిన తర్వాత మీడియాతో మాట్లాడేటప్పుడు ఏమాత్రం ఉద్వేగం, ఉద్రేకం ప్రదర్శించకుండా అణుకువతో , ఒద్దికతో మాట్లాడటం అతని విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. దీనికంటే మించి అతను చెప్పిన ఒక మాట అతనిలో ఏర్పడిన అద్భుతమైన పరిణతిని తెలియజెప్పింది. రాష్ట్రంలో 5 కోట్లమంది ప్రజలు ఉంటే ఒక్కరికే ఈ అరుదైన అవకాశం వస్తుందని, దానిని దేముడు తనకు ఇచ్చాడని జగన్ చేసిన వ్యాఖ్య, ఇంతటి అపూర్వ విజయంలోకూడా అతను ఒదిగి ఉండటాన్ని తెలుపుతోంది. సిసలైన సనాతన god-fearing క్రైస్తవుడిలా అంతా దేముడి దయ అనికూడా జగన్  చెప్పారు. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మోది విజయానికి మెట్లుగా మారిన రాహుల్ తప్పిదాలు ఇవే!

ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ, అధికారంకోసం ఎంతకైనా దిగజారే తెంపరితనంతో నియంతృత్వందిశగా వెళుతున్న మోదికి ఇంతటి ఘన విజయం లభించటం అగ్నికి ఆజ్యం తోడవటం లాంటిదే. ఇది దేశానికి ఏమాత్రమూ శుభ పరిణామం కాదు. మోది గ్యాంగ్ బుట్టలో పడిపోయిన అమాయక ప్రజలు... ముఖ్యంగా ఉత్తరభారత వాసులు కమలానికి తిరుగులేని మ్యాండేట్ ఇచ్చారు. కమలనాధులు రెచ్చగొట్టిన జాతీయవాదం, దేశభక్తి నినాదాల హోరులో ప్రజలు కొట్టుకుపోయారు. మరోవైపు, పప్పూగా సామాజిక మాధ్యమాల్లో పేరుగాంచిన రాగా కూడా తన వంతుగా మోదికి ఎంతో సాయం చేశారు. తాను మునగటమే కాకుండా దేశ ప్రజలను నిట్టనిలువునా ముంచేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులు కలిసిరావటంతోనే ఇవాళ ఎన్డీయేకు ఈ ఘన విజయం లభించిదనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ముఖ్యంగా ప్రతిపక్షాల పొత్తుల విషయంలో రాహుల్ వ్యవహరించిన తీరు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అనేక రాష్ట్రాల్లో బీజేపీకి విజయాలు చేకూర్చిపెట్టింది. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విశ్లేషణ: జగన్ ప్రభంజనం ఇలా సాధ్యమయింది!

మొదటినుంచి హాట్ ఫేవరేట్ గా ఉన్న వైసీపీయే చివరికి విజయం సాధించటం చాలావరకు ఊహించినదే. లగడపాటి రాజగోపాల్ టీమ్, టీవీ5 వంటి పచ్చబాకా సంస్థలు తెలుగుదేశానికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి బొక్క బోర్లా పడ్డాయిగానీ అసలు ఏపీ ఎన్నికలు చాలా సింపుల్ అర్థమేటిక్ లెక్క. 2014లో బాబు విజయంలో కీలకపాత్ర పోషించిన జనసేన, బీజేపీ ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా నిలిచాయి. దానికితోడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండనే ఉంది. మరోవైపు దాదాపు పదేళ్ళుగా నిత్యం నిలకడగా(consistency) జనంలో ఉండటంతో వైఎస్ వారసుడికి ‘ఒక అవకాశం ఇద్దాం’ అన్న భావన బలంగా వ్యాపించటాన్ని జగన్ విజయానికి ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. దీనితో వైసీపీ విజయం ఎన్నికలకు ముందే ఖరారు అయిపోయింది. కాకపోతే ఇంతటి ప్రభంజనం ఉంటుందనిమాత్రం ఎవరూ ఊహించలేదు. దానికి కారణం మాత్రం ఒక్క వ్యక్తిని చెప్పుకోవాలి. ఆయనే పవన్ కళ్యాణ్. అదెలాగో చూద్దాం… దానితోపాటు బాబు చేసిన తప్పిదాలనుకూడా ఒకసారి పరిశీలిద్దాం. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యుత్తమ రేటింగ్స్ తో ఎంట్రీ ఇస్తున్న 'రియల్ మి 3 ప్రో': షియామికి ఝలక్!

గత ఫిబ్రవరిలో విడుదలైన 'రెడ్‌మి నోట్ 7 ప్రో' భారత మొబైల్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. బడ్జెట్ మొబైల్స్ సెగ్మెంట్‌లో ఆ ఫోన్ ను దాదాపుగా 'గేమ్ ఛేంజర్' అని చెప్పొచ్చు. 14 వేల రూపాయలకే స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సోనీ కెమేరా వంటి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ఇస్తున్న ఈ ఫోన్ ను మార్కెట్ నిపుణులు బెస్ట్ 'వేల్యూ ఫర్ మనీ' గ్యాడ్జెట్ గా అభివర్ణించారు. ఒక్క ఎన్ఎఫ్‌సి(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) తప్పితే మిడ్‌రేంజ్, ప్రీమియమ్ సెగ్మెంట్ ఫోన్లలో ఉండే ఫీచర్లు దాదాపుగా అన్నీ ఉన్నాయనే చెప్పాలి. ఇప్పటికే భారత్‌లో మొబైల్ ఫోన్ అమ్మకాలలో నంబర్ 1 స్థానానికి చేరుకున్న షియామి(రెడ్‌మి సంస్థకు మాతృసంస్థ)ని రెడ్‌మి నోట్ 7 ప్రో మరింత పైకి తీసుకెళుతుందని అందరూ భావించారు. అయితే షియామికి వణుకు పుట్టించే విధంగా, 'రెడ్‌మి నోట్ 7 ప్రో'ను తలదన్నే ఫోన్‌ను రియల్ మి సంస్థ మూడురోజుల క్రితం విడుదల చేసింది. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.