Skip to main content

Posts

బిగ్‌బాస్ విశ్లేషణ: పాపం అభిజిత్! ట్రోఫీ తనదైనా, మైలేజి అంతా సొహైల్‌కే!‌

  ఇంగ్లీష్ భాషలో 'పిరిక్ విక్టరీ' అనే పదప్రయోగం ఒకటి ఉంది. ఒక యుద్ధంలో ఒక వ్యక్తి గెలిచినాకూడా అంతిమంగా దానినుంచి అతను లబ్ది పొందింది తక్కువైతే దానిని పిరిక్ విక్టరీ అంటారు(He won the battle but lost the war). నిన్న రాత్రి బిగ్ బాస్ 4 ఫినాలేలో గెలిచి ట్రోఫీ పట్టుకెళ్ళింది అభిజిత్ అయినాకూడా హృదయాలను గెలుచుకుందిమాత్రం సొహైల్ కావటం చూస్తుంటే ఈ పిరిక్ విక్టరీ అన్న పదప్రయోగం గుర్తురాక మానదు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలోనుంచి వచ్చిన సొహైల్‌కు ఇంట్లో ఎన్నో బాధ్యతలు, సమస్యలు ఉన్నాయని స్పష్టంగా తెలుసు. తన తండ్రి ఒక హార్ట్ పేషెంట్ అని ఒక కిడ్నీ లేదని, ఇంట్లో పెళ్ళి కావాల్సిన సిస్టర్స్ ఉన్నారు, తను, తన తమ్ముడు ఇంకా సెటిల్ కాలేదని నిన్న అతనే చెప్పాడు. అయినాకూడా తాను గెలుచుకున్న రు.25 లక్షలనుంచి స్టేజిమీద అప్పటికప్పుడే రు.10 లక్షలను ఛారిటీకి ఇస్తానని ప్రకటించి తన magnanimity ను చాటుకున్న సొహేల్‌ - స్టేజిమీద ఉన్న చిరంజీవి, నాగార్జునలనేకాదు, యావత్ తెలుగు ప్రజల హృదయాలను గంపగుత్తగా గెలిచేశాడు. నాగార్జున అయితే సొహేల్‌ స్టేజిమీదకు రాగానే ఎత్తుకుని మొత్తం హౌస్‌లో తన అభిమాన కంటెస్టెంట్ ఎవరో అన్యాపదే

గ్రేటర్‌లో జనం గుణపాఠం చెప్పవలసింది కేసీఆర్‌కా, బీజేపీకా?

  రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్‌ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

అభిజిత్‌ను గెలిపించి బిగ్ బాస్ నిర్వాహకులు ఆ తప్పు చేస్తారా!

బిగ్ బాస్ - 4లో ఫైనల్‌కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్‌లలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు కూడా బలంగానే ఉన్నాయి... బిగ్ బాస్ - 2లో కౌశల్ మందాకు లాగానే ఇతనిని విపరీతంగా సపోర్ట్ చేస్తున్న గ్రూపులు కొన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో. అయితే అతను విన్నర్ కావటానికి ఒక్క విషయం మాత్రం బలంగా అడ్డుపడుతుందనే వాదనకూడా మరోవైపు బలంగా వినిపిస్తోంది. పూర్తి వ్యాసాన్ని ఇక్కడ చదవండి .

ఎట్ లాస్ట్! తెలంగాణకు బాహుబలి దొరికాడు!

  కాంగ్రెస్ నేత జానారెడ్డి మూడేళ్ళ క్రితం ఓసారి విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్‌తో తలపడటానికి బాహుబలి రానున్నాడంటూ సరదాగా వ్యాఖ్యానించారు. జనంలోకూడా అప్పట్లో ఓ చర్చ నడిచింది... కేసీఆర్ ను ఎదుర్కోగల నాయకుడు తెలంగాణలో ఎవరున్నారూ అని. ఆ బాహుబలి ఎవరు అనే ప్రశ్నకు - కేసీఆర్ గద్దెనెక్కిన ఆరున్నర ఏళ్ళకుగానూ, దుబ్బాక ఫలితంతో ఇప్పుడు ఒక సమాధానం దొరికింది. తెలంగాణ రాజకీయ యవనికపై బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఈ క్రమంలో అది మరో విపక్షమైన కాంగ్రెస్‌ను పక్కకు నెట్టటంకాదు... తొక్కుకుంటూ పైకొచ్చింది. రాష్ట్రంలో రాజకీయసమీకరణాలలో సమూలమైన మార్పులకు దుబ్బాక ఫలితం నాంది పలికిందనటం అత్యుత్సాహమేమీ కాదు. వ్యాసం పూర్తిపాఠం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి .

ఫ్లాష్‌బ్యాక్: పీవీపై సోనియా కక్షసాధింపు వెనక అసలు కథ ఇదీ!

రెండున్నర దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి పీవీ నరసింహారావును సోనియా ప్రశంసించటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధినేత్రి, ఎందుకు ఇలా టర్న్ ఎరౌండ్ తీసుకుందనేదానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. అయితే ఈ వ్యాసం దానిగురించి కాదు. అసలు వారిద్దరికీ మధ్య జరిగిన కోల్డ్ వార్ గురించి చాలామందికి తెలియక అత్యధికశాతం జనం సోనియాదే తప్పన్నట్లుగా judgements ఇచ్చేస్తున్నారు... ముఖ్యంగా తెలుగువారు. అందులోనూ ఒక సామాజికవర్గంవారైతే గత పదిహేనేళ్ళుగా సోనియాపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ సామాజికవర్గంలోని అత్యధికులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గంపగుత్తగా మద్దతు ఇస్తుండటానికి ఇదికూడా ఒక ప్రధాన కారణం అని అంటారు. ఇక సోనియా - పీవీ కోల్డ్ వార్, దానికి కారణాలను ఒకసారి పరిశీలిద్దాం.                                                       పూర్తివ్యాసంచదవటానికి ఇక్కడ  నొక్కండి.  https://trendingtelugunews.com/top-stories/features/sonia-versus-pv-narasimharao-background-story/  

కమ్మవారిని దెబ్బతీయటానికేనన్న ఆరోపణల్లో కొత్త ట్విస్ట్!

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని ఆ సామాజికవర్గానికి చెందిన పలువురు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు   రాజధానిగా   ఉన్న   చారిత్రక   ప్రదేశం   అయిన   పాత   అమరావతి   ప్రస్తావనతో   నాని  తనప్రసంగాన్ని  మొదలుపెట్టారు .  చంద్రబాబుఆ  అసలు   అమరావతిని   పాడుబెట్టి ,  అక్కడకు  25  కిలోమీటర్లదూరంలో   రాజధానికోసం   తాను   సృ

ఇది నిజంగా సంచలనం! తమిళ బిగ్‌బాస్-3 టైటిల్ గెలుచుకుంది ఓ తెలుగువాడు!

అవును, గతవారం ముగిసిన తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ను  గెలుచుకున్న ముగేన్ రావు మలేషియా దేశానికి చెందిన తెలుగు సంతతి కుర్రాడు. టీనేజ్ లో గ్యాంగ్ స్టర్ లాగా అవ్వాలని అనుకుని, తిరిగి ఆ దారిని వదిలి సింగర్ గా మారి ఇప్పుడు రాత్రికి రాత్రి ఒక సెలబ్రిటీ అయిపోయిన ఈ 24 ఏళ్ళ యువకుడి ప్రస్థానం అనూహ్యం, విలక్షణం. పూర్తి కథనం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.