Skip to main content

Posts

Showing posts with the label YSR Congress

విశ్లేషణ: జగన్ ప్రభంజనం ఇలా సాధ్యమయింది!

మొదటినుంచి హాట్ ఫేవరేట్ గా ఉన్న వైసీపీయే చివరికి విజయం సాధించటం చాలావరకు ఊహించినదే. లగడపాటి రాజగోపాల్ టీమ్, టీవీ5 వంటి పచ్చబాకా సంస్థలు తెలుగుదేశానికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి బొక్క బోర్లా పడ్డాయిగానీ అసలు ఏపీ ఎన్నికలు చాలా సింపుల్ అర్థమేటిక్ లెక్క. 2014లో బాబు విజయంలో కీలకపాత్ర పోషించిన జనసేన, బీజేపీ ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా నిలిచాయి. దానికితోడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండనే ఉంది. మరోవైపు దాదాపు పదేళ్ళుగా నిత్యం నిలకడగా(consistency) జనంలో ఉండటంతో వైఎస్ వారసుడికి ‘ఒక అవకాశం ఇద్దాం’ అన్న భావన బలంగా వ్యాపించటాన్ని జగన్ విజయానికి ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. దీనితో వైసీపీ విజయం ఎన్నికలకు ముందే ఖరారు అయిపోయింది. కాకపోతే ఇంతటి ప్రభంజనం ఉంటుందనిమాత్రం ఎవరూ ఊహించలేదు. దానికి కారణం మాత్రం ఒక్క వ్యక్తిని చెప్పుకోవాలి. ఆయనే పవన్ కళ్యాణ్. అదెలాగో చూద్దాం… దానితోపాటు బాబు చేసిన తప్పిదాలనుకూడా ఒకసారి పరిశీలిద్దాం. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ట్యూషన్‌లో పొరపాటు: తప్పులో కాలేసిన జగన్

ప్రత్యేకహోదాపై మంగళవారంనాడు సీఎమ్‌కు, స్పీకర్‌కూ ట్యూషన్ చెప్పబోతున్నానని ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి సోమవారంనాడు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే మంగళవారంనాడు ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షనేతగా జగన్ చర్చను ప్రారంభించారు. ప్రిపేర చేసుకొచ్చిన కాగితాలు చదువుతూ... Read The Full Story Here.