గూగుల్ సైంటిస్ట్ మల్లిక్ పరుచూరిని హైదరాబాద్ పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు . థర్డ్ వేవ్ లో ఇంటికో శవం లేస్తుందనే వ్యాఖ్యలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారనే అభియోగంపై ఆయనను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు . ఆయనకు మద్దతుగా వీరమాచనేని రామకృష్ణ , మరికొందరు మద్దతుదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంఘీభావం ప్రకటించారు . ఇప్పుడంటే సెకండ్ వేవ్ ఉపశమించటంతో కాస్త తగ్గిందిగానీ , ఆమధ్య , ఒక నెలరోజుల క్రితం ఈ మల్లిక్ పరుచూరి గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చ జరిగింది . ఇతనికి మద్దతుగా , వ్యతిరేకంగా సోషల్ మీడియాలో , బయట తెలుగు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా వాదోపవాదాలు చేసుకున్నారు . మల్లిక్ పరుచూరి తనను తాను ఒక లూయీస్ పాశ్చర్ ( వైద్యరంగంలో అపూర్వమైన ఆవిష్కరణలు చేసి మానవాళికి మహోపకారం చేసిన ఒక జీనియస్ సైంటిస్ట్ ) లాగా ఊహించేసుకుని కోవిడ్ వ్యాధికి తనదైన శైలిలో మందులు ప్రిస్క్రైబ్ చేసి వార్తలలోకెక్కిన సంగతి తెలిసిందే . అలా మందులు సూచించటమేకాకుండా , సాంప్రదాయక (conventional) వైద్య విధానంలో కోవిడ్ చికిత్సకు అనుసరిస్తున్న ప్రతి పద్ధతిన
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides