ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ, అధికారంకోసం ఎంతకైనా దిగజారే తెంపరితనంతో నియంతృత్వందిశగా వెళుతున్న మోదికి ఇంతటి ఘన విజయం లభించటం అగ్నికి ఆజ్యం తోడవటం లాంటిదే. ఇది దేశానికి ఏమాత్రమూ శుభ పరిణామం కాదు. మోది గ్యాంగ్ బుట్టలో పడిపోయిన అమాయక ప్రజలు... ముఖ్యంగా ఉత్తరభారత వాసులు కమలానికి తిరుగులేని మ్యాండేట్ ఇచ్చారు. కమలనాధులు రెచ్చగొట్టిన జాతీయవాదం, దేశభక్తి నినాదాల హోరులో ప్రజలు కొట్టుకుపోయారు. మరోవైపు, పప్పూగా సామాజిక మాధ్యమాల్లో పేరుగాంచిన రాగా కూడా తన వంతుగా మోదికి ఎంతో సాయం చేశారు. తాను మునగటమే కాకుండా దేశ ప్రజలను నిట్టనిలువునా ముంచేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులు కలిసిరావటంతోనే ఇవాళ ఎన్డీయేకు ఈ ఘన విజయం లభించిదనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ముఖ్యంగా ప్రతిపక్షాల పొత్తుల విషయంలో రాహుల్ వ్యవహరించిన తీరు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అనేక రాష్ట్రాల్లో బీజేపీకి విజయాలు చేకూర్చిపెట్టింది. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

It seems you want sickular gang like mamata, Arvind kejriwal, kanhaiya Kumar, Prakash Raj etc. Even though modiji took some wrong decisions he was the best option.
ReplyDeleteLet me ask you a question. What would Modi have to do to become "the best option"?
Deleteమన దేశంలో జనం రాహుల్ గారిని దివాళా తీసిన కాంగ్రెసు సంస్థానం యువరాజులాగానే చూస్తున్నారు. పాపం ఆయనను ఎవరూ సీరియస్‍గా తీసుకోవటం లేదు. ముందుముందూ అంతే.
ReplyDelete