Skip to main content

Posts

Showing posts from 2019

ఇది నిజంగా సంచలనం! తమిళ బిగ్‌బాస్-3 టైటిల్ గెలుచుకుంది ఓ తెలుగువాడు!

అవును, గతవారం ముగిసిన తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ను  గెలుచుకున్న ముగేన్ రావు మలేషియా దేశానికి చెందిన తెలుగు సంతతి కుర్రాడు. టీనేజ్ లో గ్యాంగ్ స్టర్ లాగా అవ్వాలని అనుకుని, తిరిగి ఆ దారిని వదిలి సింగర్ గా మారి ఇప్పుడు రాత్రికి రాత్రి ఒక సెలబ్రిటీ అయిపోయిన ఈ 24 ఏళ్ళ యువకుడి ప్రస్థానం అనూహ్యం, విలక్షణం. పూర్తి కథనం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

జగన్‌లో ఎంత మార్పు!

జగన్‌లో పదేళ్ళలో ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఫలితాలు వెలువడిన తర్వాత మీడియాతో మాట్లాడేటప్పుడు ఏమాత్రం ఉద్వేగం, ఉద్రేకం ప్రదర్శించకుండా అణుకువతో , ఒద్దికతో మాట్లాడటం అతని విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. దీనికంటే మించి అతను చెప్పిన ఒక మాట అతనిలో ఏర్పడిన అద్భుతమైన పరిణతిని తెలియజెప్పింది. రాష్ట్రంలో 5 కోట్లమంది ప్రజలు ఉంటే ఒక్కరికే ఈ అరుదైన అవకాశం వస్తుందని, దానిని దేముడు తనకు ఇచ్చాడని జగన్ చేసిన వ్యాఖ్య, ఇంతటి అపూర్వ విజయంలోకూడా అతను ఒదిగి ఉండటాన్ని తెలుపుతోంది. సిసలైన సనాతన god-fearing క్రైస్తవుడిలా అంతా దేముడి దయ అనికూడా జగన్  చెప్పారు. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మోది విజయానికి మెట్లుగా మారిన రాహుల్ తప్పిదాలు ఇవే!

ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ, అధికారంకోసం ఎంతకైనా దిగజారే తెంపరితనంతో నియంతృత్వందిశగా వెళుతున్న మోదికి ఇంతటి ఘన విజయం లభించటం అగ్నికి ఆజ్యం తోడవటం లాంటిదే. ఇది దేశానికి ఏమాత్రమూ శుభ పరిణామం కాదు. మోది గ్యాంగ్ బుట్టలో పడిపోయిన అమాయక ప్రజలు... ముఖ్యంగా ఉత్తరభారత వాసులు కమలానికి తిరుగులేని మ్యాండేట్ ఇచ్చారు. కమలనాధులు రెచ్చగొట్టిన జాతీయవాదం, దేశభక్తి నినాదాల హోరులో ప్రజలు కొట్టుకుపోయారు. మరోవైపు, పప్పూగా సామాజిక మాధ్యమాల్లో పేరుగాంచిన రాగా కూడా తన వంతుగా మోదికి ఎంతో సాయం చేశారు. తాను మునగటమే కాకుండా దేశ ప్రజలను నిట్టనిలువునా ముంచేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులు కలిసిరావటంతోనే ఇవాళ ఎన్డీయేకు ఈ ఘన విజయం లభించిదనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ముఖ్యంగా ప్రతిపక్షాల పొత్తుల విషయంలో రాహుల్ వ్యవహరించిన తీరు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అనేక రాష్ట్రాల్లో బీజేపీకి విజయాలు చేకూర్చిపెట్టింది. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విశ్లేషణ: జగన్ ప్రభంజనం ఇలా సాధ్యమయింది!

మొదటినుంచి హాట్ ఫేవరేట్ గా ఉన్న వైసీపీయే చివరికి విజయం సాధించటం చాలావరకు ఊహించినదే. లగడపాటి రాజగోపాల్ టీమ్, టీవీ5 వంటి పచ్చబాకా సంస్థలు తెలుగుదేశానికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి బొక్క బోర్లా పడ్డాయిగానీ అసలు ఏపీ ఎన్నికలు చాలా సింపుల్ అర్థమేటిక్ లెక్క. 2014లో బాబు విజయంలో కీలకపాత్ర పోషించిన జనసేన, బీజేపీ ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా నిలిచాయి. దానికితోడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండనే ఉంది. మరోవైపు దాదాపు పదేళ్ళుగా నిత్యం నిలకడగా(consistency) జనంలో ఉండటంతో వైఎస్ వారసుడికి ‘ఒక అవకాశం ఇద్దాం’ అన్న భావన బలంగా వ్యాపించటాన్ని జగన్ విజయానికి ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. దీనితో వైసీపీ విజయం ఎన్నికలకు ముందే ఖరారు అయిపోయింది. కాకపోతే ఇంతటి ప్రభంజనం ఉంటుందనిమాత్రం ఎవరూ ఊహించలేదు. దానికి కారణం మాత్రం ఒక్క వ్యక్తిని చెప్పుకోవాలి. ఆయనే పవన్ కళ్యాణ్. అదెలాగో చూద్దాం… దానితోపాటు బాబు చేసిన తప్పిదాలనుకూడా ఒకసారి పరిశీలిద్దాం. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యుత్తమ రేటింగ్స్ తో ఎంట్రీ ఇస్తున్న 'రియల్ మి 3 ప్రో': షియామికి ఝలక్!

గత ఫిబ్రవరిలో విడుదలైన 'రెడ్‌మి నోట్ 7 ప్రో' భారత మొబైల్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. బడ్జెట్ మొబైల్స్ సెగ్మెంట్‌లో ఆ ఫోన్ ను దాదాపుగా 'గేమ్ ఛేంజర్' అని చెప్పొచ్చు. 14 వేల రూపాయలకే స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సోనీ కెమేరా వంటి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ఇస్తున్న ఈ ఫోన్ ను మార్కెట్ నిపుణులు బెస్ట్ 'వేల్యూ ఫర్ మనీ' గ్యాడ్జెట్ గా అభివర్ణించారు. ఒక్క ఎన్ఎఫ్‌సి(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) తప్పితే మిడ్‌రేంజ్, ప్రీమియమ్ సెగ్మెంట్ ఫోన్లలో ఉండే ఫీచర్లు దాదాపుగా అన్నీ ఉన్నాయనే చెప్పాలి. ఇప్పటికే భారత్‌లో మొబైల్ ఫోన్ అమ్మకాలలో నంబర్ 1 స్థానానికి చేరుకున్న షియామి(రెడ్‌మి సంస్థకు మాతృసంస్థ)ని రెడ్‌మి నోట్ 7 ప్రో మరింత పైకి తీసుకెళుతుందని అందరూ భావించారు. అయితే షియామికి వణుకు పుట్టించే విధంగా, 'రెడ్‌మి నోట్ 7 ప్రో'ను తలదన్నే ఫోన్‌ను రియల్ మి సంస్థ మూడురోజుల క్రితం విడుదల చేసింది. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విశ్లేషణ: ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు పడనున్నాయి?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొని ఉంది. టీడీపీ, వైసీపీల స్థాయిలో లేకపోయినా జనసేనపార్టీ చాలాచోట్ల నిర్ణయాత్మకంగా ఉంది. పోయినసారి ముఖాముఖి పోటీలో టీడీపీ విజయం సాధించింది. మరి ఈ త్రిముఖ పోటీ ఎవరికి లాభిస్తుందో పరిశీలిద్దాం. ఏపీలో కులాల స్పృహ కాస్త ఎక్కువేనన్న విషయం తెలిసిందే. అందులోనూ ఈ సారి పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ ఎన్నికలు మూడు కులాలకు చెందిన మూడు ప్రధానపార్టీల మధ్య యుద్ధంలాగా మారాయి. ఇక రాష్ట్రంలో మిగిలిన కులాల ఓటర్లు ఈ మూడు పార్టీలలో ఎవరికి అత్యధికంగా మొగ్గు చూపితే వారే అధికారాన్ని చేజిక్కించుకుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనవరసరంలేదు. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. Click Here.

విశ్లేషణ: చంద్రబాబు/జగన్ - ముఖ్యమంత్రిగా ఎవరు బెటర్?

ఆంధ్రప్రదేశ్ లో తటస్థంగా ఉండే విద్యావంతులు, ఆలోచనపరులు ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారికి ముందుచూస్తే నుయ్యి, వెనకచూస్తే గొయ్యి(పెనంనుంచి పొయ్యిలోకి అని, ఇంగ్లీషులో between the devil and the deep sea అనికూడా అంటారు) అన్నట్లుగా ఉంది . ఒకవైపేమో, ఏపీలో అవినీతిని కనీ వినీ ఎరగని రీతిలో తారాస్థాయికి చేరేటట్లు చేసి, అస్మదీయవర్గం దోచుకోటానికి తలుపులు బార్లా తెరిచిన చంద్రబాబు ప్రభుత్వం ఉంది. మరోవైపేమో... ఏమి చేసైనా ముఖ్యమంత్రి గద్దెనెక్కాలనే ఏకైక లక్ష్యంతో సాగుతూ, ఏపీ అభివృద్ధి అవ్వకూడదని బలంగా కాంక్షించే కేసీఆర్ తో జట్టుకట్టిన ప్రతిపక్ష నాయకుడు జగన్ ఉన్నారు. పూర్తివ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. Click Here.