Skip to main content

Posts

Showing posts with the label రాజకీయాలు

చంద్రబాబును అభినందించకుండా ఉండలేం!

ఏ వ్యక్తయినా విజయం సాధించగానే ఆ సమయంలో ఆ వ్యక్తిలోని సానుకూల అంశాలు ప్రముఖంగా కనబడతాయి. అయితే 2014 ఎన్నికలలో చంద్రబాబు సాధించిన విజయం ఆషామాషీది కాదు. పదేళ్ళపాటు అత్యంత కఠినాత్మక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొనికూడా పార్టీని కాపాడుకుంటూ తిరిగి అధికారపగ్గాలు చేపట్టటం ఒక విజయగాధ అనే చెప్పాలి. ఆయన విజయంనుంచి స్ఫూర్తి పొందవలసింది ఎంత అనేది తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం.  పదేళ్ళపాటు అత్యంత ప్రతికూల, కఠినాతి కఠిన పరిస్థితులను, అవమానాలను, హేళనలను ఎదుర్కొన్నారు.  ప్రత్యర్ధి పార్టీలలోని గల్లీనాయకులనుంచి ఢిల్లీ నేతలదాకా ప్రతిఒక్కరూ చంద్రబాబును తిట్టేవారే.  ఇక సొంతపార్టీనుంచి పలువురు అగ్రనాయకులు ఇతరపార్టీలకు క్యూకట్టటం.  కుటుంబంలో అసంతృప్తితో రగులుతున్న  ఒకవర్గం .  ఒకానొక సమయంలో పార్టీ అస్తిత్వమే ప్రశ్నార్ధకంగా మారింది.   ఇంతటి పరిస్థితులలో మరొకరైతే కాడిపారేసి పారిపోయేవారని చెప్పకతప్పదు. చంద్రబాబు వీటన్నంటినీ తట్టుకున్నారు. మళ్ళీ పార్టీని మళ్ళీ విజయందిశగా నడిపించి అధికారాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఆయన అనుసరించిన సహనం, ఓర్పు, సానుకూలవైఖరి, పట్టుదల, ...

పవన్‌కై చంద్రబాబు వెంపర్లాటను ఆ రెండు వర్గాలూ జీర్ణించుకోగలవా!

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోడి సభలో తనతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబునాయుడు నిన్న స్వయంగా అతని కార్యాలయానికి వెళ్ళి మరీ కలుసుకోవటం తెలుగుదేశంపార్టీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. తెలుగుదేశం శ్రేణులలోని ఒక వర్గానికి, నందమూరి కుటుంబంలోని హరికృష్ణ వర్గానికి ఇది జీర్ణించుకోలేని పరిణామమని చెప్పొచ్చు. మొదటివర్గం కోణంచూస్తే, తెలుగుదేశంలో కోస్తాలోని శ్రేణులలో ఒక సామాజిక వర్గం చంద్రబాబు-పవన్ భేటీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతోంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలోని టీడీపీ శ్రేణులు తల కొట్టేసినట్లయిందని భావిస్తున్నారు. దీనికి మూలాలు ఈనాటివికావు. తెలుగుదేశాన్ని తమ సొంతసంస్థగా పరిగణించే కమ్మ సామాజికవర్గానికీ, పవన్ కళ్యాణ్ సామాజికవర్గమైన కాపులకు కోస్తాలో చిరకాలంగా బద్ధవైరమున్న సంగతి తెలిసిందే. ఊళ్ళలో ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన సినీ అభిమానులుకూడా తమ తమ వర్గాలకు చెందిన నందమూరి, మెగా హీరోలకు 'బై డిఫాల్ట్' అభిమానులుగా మారిపోతుంటారు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్‌వద్దకే స్వయంగ...

టీఆర్ఎస్ గొంతుకలై గర్జించే శ్రవణ్, కర్నె ప్రభాకర్‌లకు కేసీఆర్ మొండిచెయ్యి

తెలంగాణ రాష్ట్రసమితి వాదాన్ని వివిధ వేదికలపై, టీవీ చర్చా కార్యక్రమాలలో బలంగా వినిపించే వారిలో డాక్టర్ దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్ ముందుంటారు(ఇంతకుముందు రఘునందన్‌రావుకూడా ఈ జాబితాలో ఉండేవారు. అయితే ఆయన గత ఏడాది మే నెలలో పార్టీనుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు). పార్టీ అధికార ప్రతినిధులు మరెందరో ఉన్నా, ప్రత్యర్ధి పార్టీల నాయకుల విమర్శలను, వాదనలను తిప్పికొట్టడంలో వీరిద్దరిదే పైచేయిగా ఉంటుంది. అయితే పార్టీకోసం ఇంత గొంతుచించుకుని అరిచిన వీరిద్దరికీ పార్టీ అధినేత మొండిచెయ్యే చూపారు. శ్రవణ్ గతంలో ప్రజారాజ్యంలో చురుకైన పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా మెలుగుతూ ఆయన సిఫార్సుద్వారా సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ సాధించి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీనుంచి డాక్టరేట్ పొందిన శ్రవణ్, మంచి ఆలోచనాపరుడు, వక్త కావటంతో తక్కువ సమయంలోనే టీఆర్ఎస్‌లో పొలిట్‌బ్యూరోలో స్థానం సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో భువనగిరి, ముషీరాబాద్‌లలో ఏదో ఒకస్థానంలో పోటీచేయాలని ప్రయత్నించారుగానీ    టికెట్‌  దక్కలేదు. ...

"అయన వస్తున్నాడు" వర్సెస్ "ఆయన వస్తేనే బాగుంటుంది "

గతకొద్దిరోజులుగా న్యూస్ ఛానల్స్ చూస్తున్నవారికి పై రెండు స్లోగన్‌ల గురించి వివరించి చెప్పనవసరంలేదు. చూడనివారికోసం వివరణ - పై రెండు స్లోగన్‌లూ రెండు వేర్వేరు రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార చిత్రాలలోనివి. మొదటిదేమో జగన్ పార్టీది, రెండేదేమో తెలుగుదేశానిది.  జగన్ పార్టీ ప్రచారచిత్రాలలో  ముందు ఏదో ఒక అక్రమాన్ని చూపిస్తారు. ఆ తర్వాత బాధితులవర్గంలోని ఒక వ్యక్తి లేచి ఇంకెన్నాళ్ళు మీ అక్రమాలు, ఆయనొస్తున్నాడు ఎలుగెత్తి అరుస్తారు. ఇంతలో పెద్ద ఎత్తున గాలి, దుమారం వస్తాయి. ఆ వెంటనే మీసాల రామ్ అన్నయ్య(ఈయన ఈ మధ్యనే సాక్షిలోకి రీఎంట్రీ ఇచ్చారు) తన బేస్ వాయిస్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి అంటూ పిలుపునిస్తారు. థమ్సప్ యాడ్‌లోలా గాలి, దుమారాన్ని చూపటంపై జోకులు బాగా పేలుతున్నాయి...'వచ్చేదెవరూ! వైఎస్ దెయ్యమా?' అని. ఇక తెలుగుదేశం ప్రచారచిత్రాలలో ముందుగా, పెరిగిపోతున్న ధరలు, కరెంట్ కోత వంటి ఏదో ఒక సమస్యను ప్రస్తావిస్తారు. స్క్రీన్ అంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుందిగానీ, ఎక్కడో ఒక్కచోటమాత్రమే పసుపురంగు కనిపిస్తూఉంటుంది. సమస్యగురించి పాత్రలు మాట్లాడుకున్న తర్వాత ముక్తాయింపుగా ...

వీరనారి విజయశాంతి, ఫైర్‌బ్రాండ్ రేణుకలకు భంగపాటు

మెదక్‌సీటు నాదే ఎన్నోరోజులనుంచీ ధీమాగా చెప్పుకుంటూ వచ్చిన రాములమ్మకు కాంగ్రెస్ ఝలక్ ఇచ్చింది. ఆమెను మెదక్ అసెంబ్లీసీటుకు పరిమితం చేసింది. మెదక్ పార్లమెంట్ సీటును నిన్నటిదాకా జగన్ పార్టీలో చురుకుగా పనిచేసిన డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి అనే అపరిచితుడికి ఇచ్చింది. మెదక్‌నుంచి తానుగానీ, కుమార్తె కవితగానీ, రమణాచారిగానీ నిలబడాలని యోచిస్తున్న కేసీఆర్, ఢిల్లీ లెవెల్‌లో పావులు కదిపి శ్రవణ్‌కుమార్‌రెడ్డికి ఈ టికెట్ కేటాయించేలా చేసినట్లు సమాచారం. అసలు విజయశాంతి టీఆర్ఎస్‌నుంచి బయటకు రావటానికి కారణమే మెదక్ పార్లమెంట్ సీటు. 2009లో తమ పార్టీలోకొచ్చిన విజయశాంతికోసం - కేసీఆర్ సురక్షితమైన మెదక్ సీటును త్యాగం చేసి మహబూబ్‌నగర్‌కు వెళ్ళారు. అక్కడ చాలా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. ఈ సారిమాత్రం విజయశాంతికి మెదక్‌ను ఇవ్వగూడదని ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఇది మెల్లమెల్లగా రాములమ్మకుకూడా అర్ధమైంది. దాంతో వారిద్దరిమధ్యా సంబంధాలు చెడి పార్టీనుంచి ఆమె నిష్క్రమణకు కారణమయింది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాతకూడా తనకు మెదక్ సీటు కేటాయిస్తానని సోనియా హామీ ఇచ్చినట్లు రాములమ్మ అందరికీ చెప్పుకున్నారు. చివరికి చూస్...

"కాపులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు?"

‘ పీసీసీ నాయకత్వం కాపుకు ’ , ‘ మంత్రివర్గవిస్తరణలో ఇద్దరు కాపులు ’ , ‘ కొత్త సమాచార కమిషనర్లలో ఇద్దరు కాపులు ’ . అసలు కాపులకు ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు ? వీళ్ళను ఈ స్థాయిలో ఎందుకు అందలాలెక్కిస్తున్నారు ? ఇప్పుడు రాష్ట్రంలో మీడియాలో ఇదో పెద్ద చర్చ అయి కూర్చుంది. మరోవైపు, ఉన్నట్లుండి కాపులకు లభిస్తున్న ఈ గుర్తింపుపై మిగిలిన కులాల్లో(ముఖ్యంగా వెనకబడిన వర్గాలలో) కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. అయితే కాపువర్గాలు మాత్రం, కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న కుల రాజకీయ చదరంగంలో తమ వర్గం పావులాగా మారడం వలన తాము ఇలా అందరి వ్యతిరేకతను మూటకట్టుకోవలసి వస్తోందని వాపోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలలో రాజ్యమేలుతున్న కులరాజకీయాల ఫార్ములాను ఆంధ్రప్రదే శ్‍లో కూడా అమలుచేసే ప్రణాళికలో భాగమే కాంగ్రెస్ అధిష్టానానికి కాపులపై ఈ కొత్త ప్రేమ అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు కమ్మయువత, ప్రజారాజ్యం పెట్టినపుడు కాపుయువత ఆవేశంతో ఎలా ఊగిపోయారో, ఇప్పుడు వై ఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీపట్ల రెడ్డి యువత కూడా అంతే ఆవేశంగా ఉన్నారన్న విషయం ఢిల్...

ఇంత దద్దమ్మ నాయకత్వమా మన దేశాన్ని పాలిస్తోంది?

అన్నాహజారే ఉదంతం – కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ మరియు యూపీఏ నాయకత్వంలోని డొల్లతనాన్ని కళ్ళకుగట్టింది. ఇక్కడ, 'అన్నా' వాదన కరెక్టా - కేంద్రప్రభుత్వ వాదన కరెక్టా అనేదాని గురించో (లేక) అవినీతి నిర్మూలనలో లోక్‌పాల్ బిల్ ఎంత సమర్ధమంతం అనేదాని గురించో చర్చించబోవడంలేదు. 'అన్నా'విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరించిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ ఎంత అవివేకంగా ఉందనేది చర్చనీయాంశం. రెండు తప్పుడు నిర్ణయాలు(డిసెంబర్ 9నాటి తెలంగాణా ప్రకటన, జగన్‌ను సరిగా టేకిల్ చేయలేకపోవడం) తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటికే రావణకాష్ఠంలాగా మార్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని మించిన ఒక చరిత్రాత్మక తప్పిదానికి పాల్పడి నడిబజారులో పరువు పోగొట్టుకుంది. నిరవధిక నిరాహారదీక్షకు కూర్చోబోతున్న 'అన్నా'ను, నియంతృత్వ ధోరణిలో కొద్దిగంటలముందు అరెస్టు చేయించింది. ఒక్కసారి దేశమంతా భగ్గుమంది. ప్రజలు వెల్లవలా బయటకొచ్చి 'అన్నా'కు మద్దతుగా నిలబడి ప్రభుత్వంపై నిప్పులుగక్కారు. అప్పటికిగానీ పరిస్థితి అర్ధంగాని ప్రభుత్వం కాళ్ళబేరానికొచ్చింది. 'అన్నా' బృందంతో బేరసారాలు మొదలుపెట్టి చివరికి వా...

వెన్నుచూపి పారిపోనందుకు మొత్తానికి చిరుకు మంచి ప్రతిఫలమే దక్కేటట్లుంది

వ్రతం చెడ్డా ఫలం దక్కడమంటే ఇదేనేమో. మొత్తానికి ముఖ్యమంత్రి కాలేకపోయినా చిరంజీవికి ఏదో గౌరవప్రదమైన స్థానం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఒకానొక సమయంలో చిరంజీవి తన పార్టీని రద్దు చేసేస్తారని, మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోతారని పుకార్లు జోరుగా వినిపించాయి. ప్రజారాజ్యం దుకాణం బంద్ అని, పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారని మీడియాలో...ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలలో కొంతకాలంగా ఎన్నో కథనాలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా తెలంగాణాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(అనిల్, మహేశ్వరరెడ్డి) ఉన్నా లేనట్లే. రాయలసీమలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(శోభానాగిరెడ్డి, కాటసాని) జగన్ వర్గంలో చేరిపోయారు. ఇక ఉన్న 14మందిలో కూడా నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి కూడా జగన్ వర్గంమనిషే. ఇక నికరంగా చూస్తే 13మంది ఉన్నట్లు. ఒక విషయంలో చిరుని మెచ్చుకోవాలి. రాష్ట్రంలో అంత భారీస్థాయిలో ఆసక్తిరేపుతూ సంచలనాత్మకంగా రాజకీయాల్లోకి వచ్చి, తీరా ఎన్నికల్లో తుస్సుమన్న తర్వాత – ఎవరయినా ఛీ మనకెందుకు ఈ రొచ్చు అని వెనక్కి పారిపోయి ఉండేవారేమో(వెనకకు వెళితే సినిమాఫీల్డులో మరో ఐదారేళ్ళు కెరీర్ కొనసాగించే అవకాశాలున్నాయి కాబట్టి). అయితే ఆ పనిచేయక...

జగన్ దారి...పెడదారా?

2004 లో...కాంగ్రెస్  అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ళ‌లో ముఖ్యమంత్రి  రాజ‌శేఖ‌ర‌రెడ్డిని...మా వోయిస్టుల ప‌ట్ల మీ వైఖ‌రి ఎలా ఉండ‌బోతోంద‌ని మీడియావారు అడిగితే – సిసలైన క్రైస్తవుడిలాగానే ఆయన బైబిల్ లోని ఓ కథను ఉటంకిస్తూ, వాళ్ళు ' ప్రోడిగ‌ల్ స‌న్స్ '(పెడ దోవ ప‌ట్టిన పిల్ల‌లు) అని అన్నారు. మావోయిస్టుల సంగ‌తేమిటోగానీ , సాక్షాత్తూ ఆయ‌న‌ కుమారుడే ప్రోడిగ‌ల్ స‌న్‌ అయ్యాడనే అభిప్రాయం కలుగుతోంది. తండ్రి చనిపోయిననాటినుంచీ జగన్ వ్యవహారశైలిని గమనిస్తే అది సవ్యంగా ఉందని అనిపించడంలేదు. మరి అతని స్వభావమే అంతో, లేక చెప్పుడుమాటలు వింటున్నాడో తెలియదుగానీ తప్పుదోవ పట్టాడనిపిస్తోంది. ఇప్పుడు రాజీనామా చేయడంవలన పార్టీకి ఎంతోకొంత నష్టం చేయగలడు....కానీ, అతనికి ఒరిగేదేమిటి ? గరిష్ఠంగా... అయితే గియితే -  ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతాడు. కానీ అతనేం బావుకుంటాడు... ? అతనికి సొంతపార్టీ పెట్టి నడిపేటంత సామర్ధ్యముందా... ?(అర్ధబలముందిగానీ...దిశానిర్దేశం చేసేటంత అనుభవజ్ఞులు,  రాజనీతిజ్ఞులు,  వ్యూహకర్తలెవరూ అతనిపక్కన కనిపించడంలేదు).  ఇంత జరిగాక కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత...

చంద్ర‌బాబు, రామోజీరావు జీర్ణించుకోలేని పరిణామం

అవును నిన్నటి సీఎమ్ మార్పు వ్య‌వ‌హారం వాళ్ళిద్ద‌రికీ అస్స‌లు మింగుడుప‌డ‌ని ప‌రిణామమని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ త‌ర్వాత‌...వాళ్ళిద్ద‌రూ కాంగ్రెస్‌లో  తీవ్రంగా ద్వేషించే వ్య‌క్తి కిర‌ణ్ కుమార్‌రెడ్డి. అటువంటి వ్య‌క్తి ఇవాళ సీఎమ్ అవుతున్నాడంటే వాళ్ళిద్ద‌రికీ నిన్న‌రాత్రి నిద్రకూడా పట్టిఉండదు. అస‌లు వీళ్ళిద్ద‌రికీ - కిర‌ణ్‌కూ గొడ‌వేమిట‌నుకుంటున్నారా...! కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఒక ఏగ్రెసివ్ కాంగ్రెస్ నాయ‌కుడు. 2004లో అధికారంలోకి రాక‌మునుపు, వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలుగుదేశంమీద ఎటాక్‌ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో గ‌ట్టివ్య‌క్తి ఎవ‌ర‌ని చూస్తే... కిర‌ణ్‌కుమార్ రెడ్డే ముందుండేవారు. గాంధీభ‌వ‌న్‌లో, సీఎల్పీలో జ‌రిగే ప్రెస్‌మీట్‌ల‌లో ఆయ‌న విమ‌ర్శ‌లు ధాటిగా ఉండేవి. "చంద్ర‌బాబునాయుడూ... ఇదేమిటి, అదేమిటి..." అంటూ ఏక‌వ‌చ‌న సంబోధ‌న‌తోనే కొట్టిన‌ట్లు మాట్లాడేవారు. అసెంబ్లీలో కూడా కిర‌ణ్‌ టీడీపీని బాగా ఎదుర్కొనేవారు. దీంతో చంద్రబాబునాయుడు కిరణ్‌కుమార్ ఉనికిని కూడా సహించలేకపోయేవారు.  దరిమిలా 2004తర్వాత కిరణ్ వైఎస్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అసెంబ్లీలో ప్రతిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు కిర‌ణ్ స్పంద‌న‌ను ప్ర‌...

బీహార్ ఫలితాలు: మళ్ళీ నితీష్‌కే కుర్చీ, లాలూకి గడ్డి, రాహుల్‌కు చెయ్యి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కే ప్రజలు మళ్ళీ పట్టం కట్టినట్లు దాదాపుగా స్పష్టమవుతోంది. జేడీయూ-బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు బీహార్‌ను పదిహేనేళ్ళపాటు అప్రతిహతంగా పాలించిన లాలూకు(పశుగ్రాసం కుంభకోణాన్ని అక్కడి జనం మరిచిపోలేదనుకుంటా...!) మరోసారి ఘోర పరాభవం ఎదురయింది. లాలూ-పాశ్వాన్ కూటమిని బీహార్ ప్రజలు తిరస్కరించారు. అటు రాహుల్ కరిష్మా కూడా బీహార్లో పనిచేయలేదు. ఆయనకు ప్రజలు చెయ్యిచ్చారు.  కాంగ్రెస్‌ రెండంకెలకు చేరుకోవడం కూడా కష్టమయ్యేటట్లుగా ఉంది. నితీష్ చేసిన అభివృద్ధే ఆయనకు విజయం సాధించిపెట్టింది. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, సుదీర్ఘంగా పెండింగులో ఉన్న వంతెనల నిర్మాణాలను చేపట్టడం, నేరాలసంఖ్యను తగ్గించడం, లక్షమంది టీచర్లను నియమించడం, వైద్యులు తప్పనిసరిగా ప్రాధమిక విద్యాకేంద్రాలలో పనిచేయాలని నిబంధన పెట్టడం వంటి చర్యల వలన నితీష్‌కు ప్రజాదరణ లభించింది. దానికితోడు ఆయన వ్యూహాత్మకంగా...ఈ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ అల్లర్లకేసు నిందితుడయిన ముఖ్యమంత్రి నరేంద్రమోడిని(సంకీర్ణ భాగస్వామ్యపక్షానికి చెందిన ముఖ్యనేత అయినప్పటి...

అమెరికా ఆధిపత్యం తగ్గిందని అంగీకరించిన ఒబామా...భారత్ వరల్డ్ పవర్ గా ఎదిగిందని ప్రశంశలు

ఒకనాడు ద్విథృవంగా(అమెరికా, రష్యా)ఉన్న ప్రపంచం, సోవియట్ రష్యా(యూఎస్ఎస్ఆర్) పతనం పుణ్యమా అని ఏకధృవప్రపంచమైపోవడంతో పెద్దన్నపాత్ర తీసుకున్న అమెరికా...గత 30ఏళ్ళుగా చేస్తూవస్తున్న కర్రపెత్తనానికి కాలం చెల్లే పరిస్థితి దగ్గరకు వచ్చినట్లేఉంది. అమెరికా ఆధిపత్యం సడలిందని ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించారు. అఫ్ కోర్స్...ఆయన చెప్పింది ఆర్ధికపరంగా అనుకోండి.(డబ్బు లేకపోతే ఎవరు లెక్క చేస్తారు?) భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు అనూహ్యరీతిలో ఎదుగుతుండటం తమ ఆర్ధికవ్యవస్థకు సవాలుగా మారిందని ఒబామా నిన్న ముంబాయిలో చెప్పారు. అయితే ఆ దేశాలకు గట్టిపోటీనిస్తామని గాంభీర్యం ప్రదర్శించారు. భారత్ కు హైటెక్ ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంపై తనకు, తన ప్రజలకు సర్ది చెప్పుకున్నారు. వాణిజ్యమంటే ఒక్కవైపునుంచే జరగదని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని అన్నారు. మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అమెరికా ప్రజలకు ఆయన ఈ వివరణ ఇచ్చుకున్నట్లు కనబడుతోంది. భారత్ ఎదుగుతున్న శక్తి కాదని, ఇప్పుడది అంతర్జాతీయశక్తి అని ఒబామా అన్నారు. ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ను సందర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ తో స్నేహసంబంధాలను మరింత...

ఒబామాకు నిరసనలు తెలిపేందుకు సిద్ధమైన లెఫ్ట్ పార్టీలు-అతిథిని ఆదరించాలన్న శ్రీశ్రీశ్రీ రవిశంకర్

ఇవాళ ముంబాయిలో దిగుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నిరసనలు తెలిపేందుకు సీపీఐ, సీపీఎమ్, ఫార్వార్డ్ బ్లాక్ తదితర వామపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఐదుగంటలకు ముంబాయిలోని చర్చిగేట్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. మరోవైపు ఎల్లుండి ఒబామా భారత్ లో అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నందున...ఆ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించబోతున్నారు. తీవ్రవాదంపై పోరులో...ముఖ్యంగా 2008 నవంబర్ 26నాటి ముంబాయి పేలుళ్ళ సూత్రధారి డేవిడ్ హెడ్లీని భారత ప్రభుత్వానికి అప్పజెప్పడానికి...అమెరికా ఏమాత్రం సాయపడటంలేదని, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో కీలక నిందితుడు యూనియన్ కార్బైడ్ మాజీ అధినేత వారెన్ ఆండర్సన్ ను భారత ప్రభుత్వానికి అప్పజెప్పడానికి కూడా అమెరికా సహకరించడంలేదని వామపక్షనేతలు ఆరోపిస్తున్నారు. అమెరికాకు అనుకూలమైన ఆర్ధిక, విదేశాంగ విధానాలను అనుసరించేలా భారత్ పై ఒత్తిడి చేస్తోందని కూడా వారి ఆరోపణ. మరోవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ గురూజీ శ్రీశ్రీశ్రీ రవిశంకర్...ఇది తగదంటూ లెఫ్ట్ పార్టీలను వారిస్తున్నారు. ఒబామా భారతదేశానికి వస్తున్న అతిధి అని, అతిధులన...

అమెరికా ఉత్పత్తుల అమ్మకాలను పెంచడం కోసమే భారత పర్యటన:కుండ బద్దలు కొట్టిన ఒబామా

చరిత్రాత్మక భారత పర్యటన వెనకున్న అసలు లక్ష్యమేమిటో ఒబామా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ముంబాయికి బయలుదేరేముందు వైట్ హౌస్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో తన పర్యటన పరమార్ధాన్ని ఆయన స్వయంగా వివరించారు. భారత్ మార్కెట్ లో అమెరికా ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచడంపైనే తాను ఈ పర్యటనలో దృష్టి కేంద్రీకరించబోతున్నానని, పలు కార్పొరేట్ ఒప్పందాలు చేసుకోబోతున్నానని తెలిపారు. రాబోయే ఐదేళ్ళలో అమెరికా ఎగుమతులను రెట్టింపు చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అమెరికాలో ఉద్యోగం కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లభించేదాకా తాను సంతృప్తి చెందబోనని తెలిపారు. అమెరికా ఉత్పత్తులకు మార్కెట్ పెరిగితే దేశంలో ఉపాధి దానంతట అదే పెరుగుతుందని, తద్వారా నిరుద్యోగం తగ్గిపోతుందని వివరించారు. అసలు విషయమేమిటంటే మార్పు నినాదంతో అమెరికా గద్దనెక్కిన ఒబామా అక్కడి ప్రజలకు ఎలాంటి మార్పూ చేసి చూపలేకపోయారు. దానికి తోడు ఆర్ధిక వ్యవస్థను కూడా ఏమాత్రం కోలుకునేటట్లు చేయలేకపోయారు...నిరుద్యోగ సమస్యనూ తగ్గించలేకపోయారు. దీనితో ఆయనకు ప్రజాదరణ క్రమక్రమంగా తగ్గుతూ వస్తూ నిన్నటి మధ్యంతర ఎన్నికలనాటికి తీవ్రంగా దిగజారిపోయింద...

ఒబామా నెత్తిన బోండాం పడింది

ఈవారం చివరలో భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా...తన పర్యటనలో భాగంగా ముంబాయి సందర్శించనున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన పర్యటించబోయే కొన్ని స్థలాలలో కొబ్బరిచెట్లు ఉండటంతో వాటి బోండాలు అధ్యక్షుని నెత్తిమీద పడతాయేమోనని భద్రతాసిబ్బంది ఆ చెట్లకున్న బోండాలను, కొబ్బరిమట్టలను కొట్టించేశారని ఇవాళ న్యూస్ పేపర్‌లలో వచ్చింది. అయితే అక్కడ అమెరికాలో ఇవాళ నిజంగానే ఒబామా నెత్తిమీద కొబ్బరి బొండాం పడినంత పనయింది. అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఒబామాకు, ఆయన పార్టీ 'డెమోక్రాట్'కు, అక్కడి ప్రజలు మాడు పగిలిపోయేలా టెంకజెల్ల ఇచ్చారు. దిగువ సభ - హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ లో 'డెమోక్రాట్'పై ప్రత్యర్ధి పార్టీ 'రిపబ్లికన్' గణనీయమైన ఆధిపత్యం సాధించింది. ఎగువ సభ - సెనేట్ లో కూడా రిపబ్లికన్స్ మునపటికంటే లాభపడ్డప్పటికీ, అక్కడ డెమోక్రాట్స్ మెజారిటీ కొనసాగడంతో ఒబామాకు చావుతప్పి కన్ను లొట్టపోయినట్లయింది. అటు వివిధ రాష్టాల గవర్నర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో కూడా రిపబ్లికన్స్ ఆధిపత్యం సాధించారు. డెమోక్రాట్లకు గత 70ఏళ్ళలో ఎన్నడూ లేనివిధంగా ఓటమి ఎదురయింది. రెండేళ్ళక్రితం అనూహ్యరీతి...