Skip to main content

Posts

Showing posts from April, 2012

నోకియాకు చుక్కలు చూపిస్తున్న గూగుల్, ఏపిల్

మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో ఏళ్ళతరబడి రారాజుగా చెలామణీ అయిన నోకియా మార్కెట్ గణనీయంగా పడిపోయింది. మరోవైపు శ్యాంసంగ్, సోని ఎరిక్సన్ కంపెనీలు విపరీతంగా పుంజుకున్నాయి. ఈ పరిణామానికి కారణం స్వయంకృతాపరాధమని తెలుసుకున్న నోకియా పూర్వ ప్రాభవాన్ని సంతరించుకోవడానికి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సెల్ ఫోన్ అంటేనే నోకియా అనే స్థాయిలో ఆ కంపెనీ ప్రస్థానం ప్రారంభమయింది. ఫిన్లాండ్ దేశానికి చెందిన ఈ కంపెనీ దాదాపు ఒకటిన్నర దశాబ్దాలపాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే రెండేళ్ళుగా ఆ కంపెనీ అమ్మకాలు తిరోగమనదిశలో సాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గూగుల్ కంపెనీ సెల్ ఫోన్లకోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో మొబైల్ ఫోన్ల ఉపయోగంలో ఎన్నో సానుకూల, విప్లవాత్మక మార్పులు రావడంతో అందరూ దానిపట్ల ఆకర్షితులయ్యారు. దీనిని గమనించిన శ్యాంసంగ్ కంపెనీ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పలు మోడల్స్‌ను మార్కెట్లోకి దించింది. సోని ఎరిక్సన్, మోటరోలా తదితర కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాయి. కానీ మార్కెట్ నంబర్ వన్‌గాఉన్న నోకియామాత్రం ఈ పరిణామాన్ని లైట్ తీసుకుంది. ఏళ్ళతరబడి తమ ఫోన్లలో అమర్చుతున్