Skip to main content

Posts

Showing posts from July, 2021

మంచు ఫ్యామిలీ సినిమాల ప్రమోషన్‌లకు పెద్దదిక్కు చిరంజీవే! ఇండస్ట్రీకి మాత్రం కాదా?

తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయిందంటూ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు నర్మగర్భంగా ఉన్నాయని పలు చోట్ల రాస్తున్నారు. కానీ, అతను సూటిగానే ఒక విషయాన్ని ఢంకా బజాయించి చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు ఉన్నంతలో చిరంజీవే పెద్ద దిక్కు అని తమ్మారెడ్డి భరద్వాజ, మురళీ మోహన్ వంటి కొందరు ప్రముఖులు అక్కడక్కడా వినిపిస్తున్న వాదనను తాము(మంచు ఫ్యామిలీ) అంగీకరించబోమన్నది అతని వ్యాఖ్యల అంతరార్థం.  వివాదాలకు మారుపేరు, చిరంజీవి ఆధిపత్యాన్ని అడుగడుగునా సవాల్ చేసే మోహన్ బాబు ఇలా తన కుమారుడితో వ్యాఖ్యలు చేయించటం సహజ పరిణామమే కాబట్టి అంతవరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. ఇటీవలికాలంలో మంచు వారు తమ సినిమాలు అన్నింటికీ చిరంజీవితోనే ప్రమోషన్ చేయిస్తున్నారు, మరోవైపు పెద్దదిక్కుమాత్రం అతనుకాదు అంటున్నారు, ఈ మతలబు ఏమిటీ అని అటు ఇండస్ట్రీలోనివారు, ఇటు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనిలో నిజంలేకపోలేదు. పూర్తి వ్యాసం చదవటానికి ఈ లింక్ లోకి వెళ్ళండి . 

పోలీసుల అదుపులో మల్లిక్ పరుచూరి: గూగుల్ సైంటిస్ట్ చేసిన తప్పులు ఇవే!

  గూగుల్ సైంటిస్ట్ మల్లిక్ పరుచూరిని హైదరాబాద్ పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు .  థర్డ్ వేవ్ లో ఇంటికో శవం లేస్తుందనే వ్యాఖ్యలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారనే అభియోగంపై ఆయనను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు .  ఆయనకు మద్దతుగా వీరమాచనేని రామకృష్ణ ,  మరికొందరు మద్దతుదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంఘీభావం ప్రకటించారు .  ఇప్పుడంటే సెకండ్ వేవ్ ఉపశమించటంతో కాస్త తగ్గిందిగానీ ,  ఆమధ్య ,  ఒక నెలరోజుల క్రితం ఈ మల్లిక్ పరుచూరి గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చ జరిగింది .  ఇతనికి మద్దతుగా ,  వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ,  బయట తెలుగు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా వాదోపవాదాలు చేసుకున్నారు . మల్లిక్ పరుచూరి తనను తాను ఒక లూయీస్ పాశ్చర్‌ ( వైద్యరంగంలో అపూర్వమైన ఆవిష్కరణలు చేసి మానవాళికి మహోపకారం చేసిన ఒక జీనియస్ సైంటిస్ట్ )   లాగా ఊహించేసుకుని కోవిడ్ వ్యాధికి  తనదైన శైలిలో  మందులు  ప్రిస్క్రైబ్ చేసి వార్తలలోకెక్కిన సంగతి తెలిసిందే . అలా మందులు సూచించటమేకాకుండా ,  సాంప్రదాయక (conventional)  వైద్య విధానంలో కోవిడ్‌ చికిత్సకు అనుసరిస్తున్న ప్రతి పద్ధతిన