Skip to main content

Posts

Showing posts from 2013

నెట్‌లో లభిస్తున్న మీ ఇంటి శాటిలైట్‌మ్యాప్, ఫోటోలు చూసుకోండి!

మీరు లేదా మీవాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉంటున్నట్లయితే , మీ ఇంటి శాటిలైట్ మ్యాపును , 360 డిగ్రీలలో ఫోటోలను చూసుకునే అవకాశాన్ని ఒక భారతీయసంస్థ కల్పిస్తోంది . వోనోబో . కామ్ (www.wonobo.com) అనే వెబ్ సైట్ ద్వారా మీరు మీ ఇంటి శాటిలైట్ మ్యాప్ , ఫోటోలు చూసుకోవచ్చు . ఆ వెబ్ సైటుకు వెళ్ళగానే , మీరు ఏ నగరం చూడాలనుకుంటున్నారని ప్రశ్న ఎదురవుతుంది . అక్కడున్న డ్రాప్ డౌన్ లోనుంచి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవాలి . మీరు ఆ నగరాన్ని ఎంచుకుని ఎంటర్ నొక్కగానే చార్మినార్ ఫోటో కనిపిస్తుంది . అయితే మీరు చూడాలనుకున్న ప్రదేశంకోసం మీరు కుడివైపు కిందభాగంలో కనిపిస్తున్న మ్యాప్ పైన క్లిక్ చేయాలి . అప్పుడు స్క్రీన్ సగభాగంలో మ్యాప్ , సగభాగంలో ఫోటో కనిపిస్తాయి . ఆ మ్యాప్ ద్వారా మౌస్ ను కదిలిస్తూ మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళొచ్చు . అక్కడ మీరు చూడాలనుకున్న ప్రదేశం మ్యాప్ తోబాటు , 360 డిగ్రీలలో ఫోటోలు కూడా దర్శనమిస్తాయి . మీరు టెక్నాలజీ పెద్దగా పరిచయంలేనివారైతే , ఈ వెబ్ సైట్ మీకు పల్లెటూరుతప్ప మరేమీ తెలియనివారిని నగరం నడిబొడ్డున వదిలినట్లుగా , కొద్దిగా అయోమయంగానే ఉంటుంది . ఎవరినైనా సాయం తీసుకుంటే నేవిగేషన

జూ.ఎన్‌టీఆర్‌ ఫెయిల్యూర్ ఫార్ములా

'రామయ్యా వస్తావయ్యా' ఓవర్సీస్ లో అతిపెద్ద ఫ్లాప్ గా రికార్డ్ సృష్టించిం దని తెలుగు సినిమా వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి . అదెంత నిజమోగా నీ తెలుగు ఇండస్ట్రీలో మంచి ట్యాలెంట్ , మాస్ అప్పీల్ ఉన్న జూ . ఎన్‌టీఆర్‌కు ఆది , సింహాద్రి స్థాయి ఘనవిజయం అందకుండా ఊరిస్తోందన్నది నిజం . యమదొంగ , బృందావనం , అదుర్స్ వంటివి విజయం సాధించినా అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కాదన్నది అందరికీ తెలిసిన విషయమే . రామయ్యా వస్తావయ్యాకు ముందు వచ్చిన బాద్షా రు .40 కోట్లు వసూలుచేసిందని చెబుతున్నప్పటికీ , పెట్టుబడి పెట్టినవారెవరికీ లాభాలు రాలేదన్న సంగతి విదితమే . ఇక జూనియర్ ఫ్లాప్ లను ఒకసారి చూస్తే , ఇంత భారీ ఫ్లాపులు ప్రస్తుతమున్న హీరోలలో మరెవరికీ లేవనే చెప్పాలి . నరసింహుడు ఫ్లాపవడంతో ఆ సినిమా నిర్మాత చెంగల వెంకట్రావు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో దూకితే , పెద్ద ఎన్టీయార్ , చిరంజీవిలతో ఎన్నో సూపర్ హిట్లిచ్చిన సుప్రసిద్ధ నిర్మాత చలసాని అశ్వనీదత్ , శక్తి సినిమా ఫ్లాప్ అవటంతో ఉంటున్న ఇల్లుకూడా అమ్ముకున్నాడని ఫిలింనగర్ లో చెప్పుకుంటుంటారు . ఈ స్థితికి కారణమెవరని ప్రశ్నిస్తే , జూనియర్ స్వయంకృతాపరాధమని

మళయాళ నిర్మాతలను ప్రాధేయపడుతున్న అల్లు అర్జున్

కేరళలోని మళయాళ మనోరమగ్రూప్ కు చెందిన ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ 'మళవిల్ మనోరమ' ఓనమ్ సందర్భంగా, ఈనెల 15న తమ ఛానల్ లో 'మల్లు' అర్జున్‌ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. అరగంటకుపైగా సాగిన ఆ కార్యక్రమంలో అతనిని వ్యక్తిగత విషయాలగురించి తెలుగులోకూడా ఎవరూ అడగనంత వివరంగా, చిన్న చిన్న వాటినికూడా ప్రస్తావిస్తూ ఆ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసింది.  అతనిని మళయాళ ప్రేక్షకులు ఎంత నిశితంగా గమనిస్తున్నారనేది, అతనికి అక్కడ ఎంత ఫాలోయింగ్ ఉందనేది ఆ యాంకర్ మాటలనుబట్టి అర్థమవుతోంది .  ప్రతి సినిమాలోనూ అల్లు అర్జున్ ను మొదట హీరోయిన్ ఇష్టపడదని , చివరకు మాత్రం అతను ఆమె హృదయాన్ని , ప్రేక్షకుల సానుభూతిని గెలుచుకుంటాడంటూ ఆర్య , హ్యాపీ , జులాయి చిత్రాలను ఉదాహరణలుగా చూపిస్తూ విశ్లేషించింది . రెడ్ బుల్ త్రాగినట్లు  అంతబాగా డాన్స్ లు చేయటానికి ఎనర్జీ ఎక్కడనుంచి వస్తుందని ప్రశ్నించింది . మళయాళ యువత అతనంటే ఊగిపోతున్నారని, ఏ మూలకు వెళ్ళినాఅల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ బోర్డ్ కనబడుతోందని ఆ యాంకర్ చెప్పింది.                           క్యాలికట్ లోని ఒకఫ్యాన్స్ అసోసియేషన్ వారి వెబ్ పేజి మళయాళంలో న

వ్యక్తిగత ఆరోపణలపై ఏపీఎన్జీఓ నేత అశోక్‌బాబు వివరణ

జులై 30 న జరిగిన రాష్ట్రవిభజన ప్రకటన తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి రావటమేకాక , రాష్ట్రంలోని ప్రముఖులలో ఒకరై పోయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓ సంఘ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు . ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడి పదవిలోకి వచ్చినపుడే ఆయన ఓ మాదిరి ప్రముఖుడైపోయినప్పటికీ , ఇంతస్థాయిలో రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ తెలిసేటంత గుర్తింపు అయితే జులై 30 కు ముందు లేదు . ఇంతకుముందు ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న గోపాల్ రెడ్డి ఈ ఏడాది మే 31 న రాజీనామా చేయటంతో జనరల్ సెక్రెటరీగాఉన్న అశోక్ బాబు , రివాజు ప్రకారం అధ్యక్షస్థానానికి చేరుకున్నారు . ఏపీఎన్‌జీఓ అధ్యక్ష పదవికి చేరుకోవటంతోసహా అశోక్ బాబుపై అనేక వ్యక్తిగత ఆరోపణలు మీడియాలో వచ్చిన మాట తెలిసిందే . ఆ పదవికి ఎన్నికలే జరగలేదని , అధ్యక్షుడినని తానే స్వయంగా ప్రకటించుకున్నారని ఎన్‌జీఓ సంఘానికి సంబంధించి ఆయనపై ఫిర్యాదు . ఇక వ్యక్తిగత విషయానికొస్తే , డిగ్రీ చదవక పోయినా , చదివినట్లు పేర్కొని , తప్పుడు సర్టిఫికెట్ తో విజయవాడనుంచి హైదరాబాద్ బదిలీ చేయించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ . దీనిపై అశోక్ బాబు గత ఆదివారంనాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో

ఏపీ ఎన్జీఓల సభ విజయవంతం

సభను అడ్డుకుంటామని తెలంగాణవాదులు , జరపాలన్న కృతనిశ్చయంలో ఎన్జీఓలు ఇరువైపులా మోహరించి ఉంటడంతో ఎప్పుడేమి జరుగుతుందో అని శనివారం ఉదయంనుంచి హైదరాబాద్ వాసులు ఉత్కంఠతతో ఊపిరి బిగబట్టి చూశారు . మొత్తానికి చెదురుమదురు ఘటనలు మినహా సభ సాఫీగా సాగిపోయింది . సభ నిర్వాహకులను , ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దీనికి అభినందించాలి . మోరల్ సపోర్ట్ , లాజిస్టిక్ సపోర్ట్ , లా అండ్ ఆర్డర్ సపోర్ట్ ... ఒకటేమిటి అన్ని సపోర్టులూ అందించి సభను విజయవంతం చేయించారు కిరణ్ . ఏపీ ఎన్జీఓలు ఈ వేదికను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు . సమైక్యవాదానికి తమ కారణాలను , తమ వాదనను స్పష్టంగా వినిపించారు . విభజన వలన నష్టాలను వివరించడంకూడా ఈ సభ లక్ష్యమైనప్పటికీ , వక్తలలో అశోక్ బాబు తప్పితే మిగిలిన ఉద్యోగసంఘాల నాయకులెవరూఆ విషయాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు . సభలో వక్తల ఉపన్యాసాలుసంయమనంతో సాగాయని చెప్పొచ్చు . ఎవరైనా శృతి మించినా , అశోక్ బాబు వెనకనుంచి వారిని వారించడంతో వక్తలు మళ్ళీ గాడిలోకి వచ్చారు . వక్తలలో అశోక్ బాబు తర్వాత మిత్రా , సత్యవాణి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి . ఇంకా పలువురు వక్తలు ప్రసంగించాల్సి ఉన్

దిశానిర్దేశం కొరవడిన సమైక్యాంధ్ర ఉద్యమం

తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి కాంగ్రెస్ అధిష్ఠానంప్రత్యేకరాష్ట్ర ప్రకటనచేసేటట్లు చేయడంలో తెలంగాణ జేఏసీ పాత్ర కీలకమనేది నిర్వివాదాంశం . టీడీపీనుంచి బయటకొచ్చి టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్   తెలంగాణ ఉద్యమ పునరుద్ధరణకు మూలకారకుడైనప్పటికీ , ఇటీవలికాలంలో సకలజనులసమ్మె , అసెంబ్లీ ముట్టడివంటి ఏదో ఒక కార్యక్రమంచేస్తూ , విజయవంతమయ్యేవరకు ఉద్యమాన్ని చైతన్యవంతంగా ఉంచిన ఘనత తెలంగాణ జేఏసీదే . మంత్రి గీతారెడ్డిని కర్రుకాల్చి వాతపెట్టాలనటంవంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా , ఉద్యమం ఫలవంతమవడంలో ప్రొఫెసర్ కోదండరామ్ కృషిని ఎవరూ కాదనలేరు . మధ్యలో కేసీఆర్ తో విభేదాలు వచ్చినా తట్టుకుని నిలబడి, రాజకీయ పార్టీలు, ఉద్యోగసంఘాలను సమన్వయంచేసుకుంటూ తెలంగాణ జేఏసీఅస్తిత్వాన్ని కాపాడుకున్నారు . జేఏసీ వలన ఆ ఉద్యమం ఒక గాడిలో , సంఘటితంగా , సమీకృతంగా నడిచింది . సమైక్యాంధ్ర ఉద్యమంలోఖచ్చితంగా అదే కొరవడింది . విభజన నిర్ణయంతో సీమాంధ్రలో తీవ్ర భావోద్వేగాలకు గురై ప్రతిరోజూ లక్షలమంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నప్పటికీ , వారి ఉద్యమం ఒక కార్యాచరణ ప్రణాళిక , దిశానిర్దేశంలేకుండా నడుస్తోంది . సంఘటితంగా  ఒక్కత

మైక్రోసాఫ్ట్ హస్తగతమైన నోకియా:కుమిలిపోతున్న ఫిన్లాండ్ దేశస్థులు

   14 సంవత్సరాలపాటు ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్ లో ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన నోకియాసంస్థ అమ్ముడుపోయింది . తమ మొబైల్ ఫోన్ తయారీ విభాగాన్ని సాఫ్ట్ వేర్ దిగ్గజం 5.44 బిలియన్ యూరోలకు (7.17 బిలియన్ డాలర్లకు ) మైక్రోసాఫ్ట్ కు అమ్మేసుకుంది . అయితే 148 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఫిన్లాండ్ కంపెనీ , నెట్ వర్క్ పరికరాలు , సర్వీసులు వంటి ఇతర వ్యాపారాలను యధావిధిగా కొనసాగిస్తుంది . మొబైల్ ఫోన్ ల వ్యాపారంలో నోకియా ఆధిపత్యానికి గత కొద్ది సంవత్సరాలుగా శామ్ సంగ్ , యాపిల్ ( ఐఫోన్ తయారీసంస్థ ) కారణంగా గండిపడింది . దీని నోకియా సంస్థ స్వయంకృతాపరాథమే కారణం . బూజుపట్టిన సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ నే పట్టుకుని వేలాడుతూ పోటీగా దూసుకొస్తున్న ఆండ్రాయిడ్ , ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ లను , స్మార్ట్ ఫోన్ మార్కెట్ నూ నోకియా పట్టించుకోలేదు . వీటన్నింటినీ మించి , నోకియా తలరాతను మారుస్తాడనే నమ్మకంతో మైక్రోసాఫ్ట్ నుంచి తెచ్చుకున్న ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీఫెన్ ఎలాప్ తన మాతృసంస్థప్రతినిధిలాగానే పనిచేశాడు . ఆండ్రాయిడ్ అవసరం నోకియాకు లేదని , మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తోనే భవిష్యత్ నోకియా స్మార్ట్ ఫో