Skip to main content

Posts

Showing posts with the label Deepthi

బిగ్‌బాస్‌షోలో యాంటీ క్లైమాక్స్! జనం ఛీకొట్టటం ఖాయం!

బిగ్ బాస్ రెండో సీజన్ మొదలైనప్పుడు కొద్ది రోజులపాటు నానిని జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చి పెదవి విరిచారు చాలామంది . నానికూడా తొలినాళ్ళలో కొద్దిగా బెరుకుగానే కనిపించాడు . తన సహజమైన ఆత్మవిశ్వాసం కనిపించలేదు . కానీ మెల్లగా పుంజుకున్నాడు . వారం ముగియగానే వీకెండ్ లో వచ్చి , ఆ వారమంతా హౌస్ లో జరిగిన సంఘటనలను విశ్లేషించటంలో , సభ్యులు వ్యక్తిగత పనితీరు , ప్రవర్తనను అంచనా వేయటంలో మంచి పరిణతి ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు . ఇక అక్కడనుంచి అతను ఎక్కడా తడబడలేదు . బ్రహ్మాండంగా షోను నడిపించారు . తప్పులు చేసిన ఇంటి సభ్యులను గట్టిగా మందలించారు . సలహాలు , సూచనలు చక్కగా ఇచ్చాడు . Click Here to Read the Full Story...